Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

సీజేఐ ఎన్వీ రమణకు గవర్నర్ తేనీటి విందు… హాజరైన ఏపీ సీఎం జగన్!

సీజేఐ ఎన్వీ రమణకు గవర్నర్ తేనీటి విందు… హాజరైన ఏపీ సీఎం జగన్!

  • ఏపీలో సీజేఐ పర్యటన
  • రాజ్ భవన్ కు విచ్చేసిన జస్టిస్ ఎన్వీ రమణ
  • తేనీటి విందుకు సతీసమేతంగా హాజరైన సీఎం జగన్
  • ఎన్వీ రమణను సత్కరించిన బెజవాడ బార్ అసోసియేషన్

ఏపీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పర్యటన కొనసాగుతోంది. ఆయన ఈ సాయంత్రం విజయవాడలో రాజ్ భవన్ కు విచ్చేశారు. సీజేఐ ఎన్వీ రమణకు రాజ్ భవన్ వర్గాలు సాదర స్వాగతం పలికాయి. భారత చీఫ్ జస్టిస్ కు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తేనీటి విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్ సతీసమేతంగా హాజరయ్యారు.

కాగా, జస్టిస్ ఎన్వీ రమణకు విజయవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘన సత్కారం జరిగింది. గుంటుపల్లిలో జరిగిన ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, జస్టిస్ వినీత్ శరణ్, ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ లావు నాగేశ్వరరావు మాట్లాడుతూ, కోకా సుబ్బారావు తర్వాత 60 ఏళ్లకు ఓ తెలుగువాడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యాడని జస్టిస్ ఎన్వీ రమణను కొనియాడారు.

Related posts

వైయస్సార్ కాంగ్రెస్ నేతల కోసం పోలిసుల వేట!

Ram Narayana

తెలుగు రాష్ట్రాల్లో మంటలు రేపిన మధిర కౌన్సిలర్ మల్లాది వాసు మాటలు …

Drukpadam

మావోయిస్టు కీలక నేత హిద్మ ఎన్ కౌంటర్ లో మృతి…

Drukpadam

Leave a Comment