Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రేవంత్ రెడ్డి గృహనిర్బంధం …ఇంటికి వచ్చే అన్నిదార్లు క్లోజ్!

రేవంత్ రెడ్డి గృహనిర్బంధం …ఇంటికి వచ్చే అన్నిదార్లు క్లోజ్!

ఎర్రవల్లి రచ్చబండకు పిలుపు నిచ్చిన రేవంత్
ఎర్రవల్లి కేసీఆర్ వ్యవసాయ క్షేత్ర పరిశీలనకు పిలుపు
ఉద్రిక్తల నేపథ్యంలో పోలిసుల చర్యలు

ఇంటి చూట్టూ బారికేడ్ల ఏర్పాటు

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. హైదరాబాద్, జూబ్లీ హిల్స్ లోని ఆయన నివాసం వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. వరి వేస్తే ఉరే అన్న కేసీఆర్ ఆయన వ్యవసాయ క్షేత్రంలోని 150 ఎకరాల్లో యాసంగి వరి పండిస్తున్నారని నిన్న రేవంత్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రవల్లిలో కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రచ్చబండ నిర్వహిస్తామని ఆయన తెలిపారు. దీంతో, ఈ ఉదయాన్నే ఆయన ఇంటి వద్దకు చేరుకున్న పోలీసులు ఆయనను గృహనిర్బంధం చేశారు. ఆయన బయటకు రాకుండా ఇంటి చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు.

ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘తెలంగాణ పోలీసులకు సుస్వాగతం. నా ఇంటికి వచ్చే అన్ని దారులను పోలీసులు చుట్టుముట్టారు. ప్రభుత్వం దేనికి భయపడుతోంది? ఎందుకు భయపడుతోంది?’ అని ప్రశ్నించారు. దీంతోపాటు అన్ని దారుల్లో పోలీసులు మోహరించిన వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు.

Related posts

ఈసారి అసెంబ్లీలో అడుగు పెట్టడం ఖాయం …ఎవరడ్డుకుంటారో చూస్తా …కత్తిపూడి సభలో పవన్ కళ్యాణ్ …

Drukpadam

పాకిస్థాన్​ ఆర్మీ అదుపులో తాలిబన్​ అధిపతి.. భారత్​ కు నిఘా వర్గాల సమాచారం!

Drukpadam

కాపు సామాజిక వ్యక్తి ముఖ్యమంత్రి కావాలి: చింతా మోహన్!

Drukpadam

Leave a Comment