Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ కొనసాగుతున్న కరోనా విజృంభణ..

ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ కొనసాగుతున్న కరోనా విజృంభణ..
-ఒక్క రోజులో 16 లక్షలకు పైగా కేసులు!
-నిన్న 7,317 మరణాల నమోదు
-కరోనా దెబ్బకు అమెరికా, యూకే ఉక్కిరిబిక్కిరి
-పెద్ద ఎత్తున వెలుగుచూస్తున్న కేసులు, మరణాలు
-అమెరికాలో నూతన సంవత్సర వేడుకల రద్దు
-బ్రిటన్‌లో నిన్న 1.83 లక్షల కేసులు

అగ్నికి ఆజ్యం తోడైనట్టు ఇప్పటికే వున్న కరోనా వేరియంట్లకు సరికొత్త ఒమిక్రాన్ వేరియంట్ తోడు కావడంతో కరోనా విజృంభణ మళ్లీ మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా కేసులు మళ్లీ పెద్ద ఎత్తున వెలుగుచూస్తున్నాయి. నిన్న ఒక్క రోజులోనే ఏకంగా 16.04 లక్షల కేసులు వెలుగుచూశాయి. అలాగే, 7,317 మంది వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. అంతకుముందు రోజుతో పోలిస్తే కేసులు 4 లక్షలు, మరణాలు 800 పెరగడం గమనార్హం. ఆసియా దేశాలలో కొంత తక్కువగా ఉన్నప్పటికీ భారత్ లో కేసుల సంఖ్య రోజురోజు కు పెరుగుతున్నది. ఇది ఆందోళన కలిగించే విషయమని వైద్యవర్గాలు పేర్కొంటున్నాయి .

అమెరికాలో అయితే, 4.65 లక్షల కేసులు నమోదయ్యాయి. అంతకుముందు రోజుతో పోలిస్తే కేసుల సంఖ్య కొంత తక్కువ కావడం ఊరట కలిగించే అంశం. అలాగే 1,777 మంది మరణించారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బహిరంగ కార్యక్రమాలు సహా కొత్త సంవత్సర ప్రారంభ వేడుకలను కూడా రద్దు చేశారు. ఫ్రాన్స్‌లో 2.08 లక్షల కేసులు వెలుగు చూడగా, 108 మంది ప్రాణాలు కోల్పోయారు. జర్మనీలో బుధవారం 41,816 కేసులు నమోదు కాగా, నిన్న వాటికి మరో వెయ్యి తోడయ్యాయి.

రష్యాలోను మరణాలు భారీగానే సంభవిస్తున్నాయి. అక్కడ నిన్న 932 మరణాలు నమోదయ్యాయి. పోలండ్‌లో కరోనా కేసులు తక్కువగా వెలుగు చూస్తున్నప్పటికీ మరణాలు మాత్రం పెద్ద సంఖ్యలో నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అక్కడ నిన్న 794 మంది మరణించారు. ఆ దేశంలో 15 వేల లోపు కేసులు రికార్డవుతున్నాయి. ఇక, యూకే అయితే ఒమిక్రాన్ దెబ్బకు విలవిల్లాడుతోంది. బ్రిటన్‌లో నిన్న 1.83 లక్షల కేసులు బయటపడ్డాయి. అంతకుముందు రోజుతో పోలిస్తే ఇవి 32 శాతం ఎక్కువ కావడం గమనార్హం.

Related posts

తెలంగాణలో ఫీవర్ సర్వే..ఒక్కరోజుల్లోనే 45,567 మందిలో లక్షణాలు గుర్తింపు!

Drukpadam

ఆక్సిజన్ కొరత వీలయితే విమానాల్లో పంపండి … మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరే

Drukpadam

భారత్ లో సింగిల్ డోస్ కరోనా టీకాలు… రేసులో జాన్సెన్, స్పుత్నిక్ లు…

Drukpadam

Leave a Comment