పంజాబ్ లో జర్నలిస్టులకు సీఎం వరాలు…
-పెన్షన్ స్కీమ్ 12 వేల నుంచి 15 వేలకు పంపు
-జర్నలిస్టులు జబ్బున పడితే క్లయిమే 5 లక్షలు నుంచి పెంపు
-బస్సు ప్రయాణం సౌకర్యం మరింత విస్తరించనున్నట్లు వెల్లడి
-పరిశీలనలో మిగతా డిమాండ్స్-జనవరి 4 ప్రకటన
-ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన ఐ జె యూ సెక్రటరీ జనరల్ బల్విందర్ జమ్మూ
పంజాబ్ లో జర్నలిస్టులకు ఆరాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్ జీత్ సింగ్ చన్నీ వరాల జల్లు కురిపించారు. 2022 జనవరి 1 వతేదీన నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రస్తుతం రిటైర్ అయిన జర్నలిస్టులకు ఇస్తున్న పెన్షన్ ను నెలకు 12 వేల నుంచి 15 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా జర్నలిస్టులకు మేడిక్లయిమ్ కింద 5 లక్షల నుంచి పెంచనున్నట్లు తెలిపారు. బస్సు పాస్ రాయితీలను మరింతగా ఉండేలా చర్యలు తీసుకొంటామని అన్నారు. ఇంకా పెండింగ్ లో ఉన్న ఇతర సమస్యలు కూడా ఈనెల 4 వతేదీన వేర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడిస్తామని అన్నారు.
పంజాబ్ ముఖ్యమంత్రి చన్నీ జర్నలిస్టుల సమస్యల పై స్పందించిన తీరు కు పంజాబ్, చండీఘర్ జర్నలిస్ట్ సంఘం అధ్యక్షులు , ఐ జె యూ సెక్రటరీ జనరల్ అయిన బల్విందర్ జమ్మూ కృతజ్నతలు తెలిపారు. తమ సంఘ ఇటీవల కలిసి జర్నలిస్టుల సమస్యలపై చేసిన విజ్ఞప్తి మేరకు సీఎం స్పందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. మిగతా పెండింగ్ సమస్యల పై కూడా సీఎం స్పందిస్తారని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
పంజాబ్ సీఎం చన్నీ జర్నలిస్టుల సమస్యలపై స్పందించి పెన్షన్ పెంచడంతో పాటు , మేడిక్లయిమ్ కింద ప్యాకేజి పెంచడం , బస్సు పాస్ లద్వారా ఇస్తున్న రాయితీలు పెంచడంపై ఐ జె యూ అధ్యక్షులు కె శ్రీనివాస్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు . కోవిడ్ వలన మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు సహాయం అందించాలని కోరారు .