Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

అధికారపార్టీ చెప్పుచేతుల్లో పోలీసులు …బీజేపీ నేత విజయశాంతి ధ్వజం!

అధికారపార్టీ చెప్పుచేతుల్లో పోలీసులు …బీజేపీ నేత విజయశాంతి ధ్వజం!
-వనమా రాఘవ కీచక పర్వమే ఇందుకు నిదర్శనం
-అధికార పార్టీ చెప్పుచేతుల్లో పోలీసులు విధులు
-ఇందులో ఎలాంటి సందేహం లేదు
-రాఘవ ఇప్పించిన పోస్టింగ్‌లో పోలీసులు
-సెల్ఫీ వీడియో తీసుకోక‌పోతే చ‌ర్య‌లు తీసుకోక‌పోయేవారు

టీఆర్ఎస్ స‌ర్కారుపై బీజేపీ నాయ‌కురాలు విజ‌య‌శాంతి మండిప‌డ్డారు. టీఆర్ఎస్ చెప్పిన‌ట్లే పోలీసులు ప‌నిచేస్తున్నార‌ని ఆమె ఆరోపించారు. ‘రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం అధికార పార్టీ చెప్పుచేతుల్లో పనిచేస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే… తాజాగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్‌రావు కుమారుడు రాఘవేంద్రరావు చేసిన కీచక పర్వానికి ఓ కుటుంబం బలి కావడమే ఇందుకు నిదర్శనం’ అని విజ‌య‌శాంతి ట్వీట్ చేశారు.

‘రాఘవ ఇప్పించిన పోస్టింగ్‌లో ఉంటూ ఆయనకు వ్యతిరేకంగా వెళ్లలేని స్థితిలో పోలీసు అధికారులు ఉండిపోవడంతోనే రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. రామకృష్ణ ముందు జాగ్రత్తగా తీసుకున్నసెల్ఫీ వీడియో సోషల్‌ మీడియాలో సంచలనం కావడంతో… ఇప్పుడు తప్పనిసరిగా పోలీసులు చర్య తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది తప్ప… ఏ ఆధారాలు లేకుంటే ఆ కేసుపై ఎలాంటి ముందడుగు ఉండబోదని జగమెరిగిన సత్యం’ అని విజ‌య‌శాంతి చెప్పారు.

‘రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను అడ్డంపెట్టుకుని అధికార పార్టీ నాయకులు, వారి కుమారులు, బంధువులు చేసే ఆగడాలు అన్నా? ఇన్నా?… ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేల కుమారుల తీరు ఎలా ఉందంటే… రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో సహకరించకపోతే ఏకంగా ఏసీబీ దాడులు చేయిస్తామని పోలీస్, రెవెన్యూ సిబ్బందిని బెదిరించే స్థాయికి వెళ్లినట్టు సోషల్ మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది’ అని విజ‌య‌శాంతి తెలిపారు.

‘ఇంకా ఈ ఒక్క జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో వివిధ జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేల అనుచరులు తమకు అనుకూలంగా వ్యవహరించే పోలీసు అధికారులకు పోస్టింగులు ఇప్పిస్తూ సామాన్యుల ఆస్తులు, ప్రభుత్వ భూములను కబ్జాలు చేసి అడ్డువస్తే భౌతిక దాడులకు పాల్పడుతూ అరాచకాలు సృస్టిస్తున్రు. ఇక కనబడని బాధితుల కన్నీటి వ్యధలు కోకోల్లలు’ అని విజ‌య‌శాంతి అన్నారు.

‘నిజాం కాలంలో ఎలా అయితే తెలంగాణ ప్రజలు బాధపడ్డారో… నేడు కేసీఆర్ సర్కార్ ఏలుబడిలో అలాగే బాధలు పడుతున్నారు. ధన సంపాదనే ధ్యేయంగా ప్రజలను పీడిస్తున్న ఈ దగాకోరు సర్కార్‌ను రానున్న ఎన్నికల్లో ఓటర్లు కనుమరుగు చేయడం ఖాయం’ అని ఆమె చెప్పారు.

Related posts

అసెంబ్లీలో సీఆర్డీయే రద్దు ఉపసంహరణ బిల్లును ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి బుగ్గన!

Drukpadam

ప్రతిపక్షాలపై ఈడీ కక్ష …అవి రాజకీయ ప్రేరేపితం అంటున్న విశ్లేషకులు!

Drukpadam

సావర్కర్ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీకి ఉద్ధవ్ థాకరే వార్నింగ్!

Drukpadam

Leave a Comment