Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కేసీఆర్.. కమ్యూనిస్ట్ నేతలతో భేటీపై సంజయ్ రియాక్షన్…

  • కేసీఆర్‌తో కమ్యూనిస్ట్ పార్టీ నేతల భేటీపై ఘాటు వ్యాఖ్యలు
  • ఉద్యమద్రోహులకు విందులా అంటూ మండిపాటు
  • తెలంగాణ ప్రజలకు అన్నీ తెలుసంటూ కామెంట్

సీఎం కేసీఆర్‌పై బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఫైర్ అయ్యారు. వామపక్ష పార్టీల నేతలను సీఎం కలవడంపై సంజయ్ స్పందించారు. తెలంగాణ ఉద్యమకారులకు ప్రగతిభవన్ గేట్లు బంద్ చేసిన కేసీఆర్.. ఉద్యమ ద్రోహులకు విందులు ఇస్తున్నారని విమర్శలు గుప్పించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ కమ్యూనిస్ట్ పార్టీల నేతలను కలవడంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. కేసీఆర్ ఉద్యమ ద్రోహులనే నెత్తికెత్తుకుంటున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని ఉద్యమ ద్రోహులకే మంత్రి పదవులు ఇచ్చారని.. ఇప్పుడు కూడా అటువంటి పార్టీలతోనే దోస్తీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ ఉద్యమకారులకు ప్రగతిభవన్ గేట్లు బంద్ చేసిన కేసీఆర్.. ఉద్యమ ద్రోహులకు విందులు ఇస్తున్నారని సంజయ్ మండిపడ్డారు. తెలంగాణను వ్యతిరేకించిన పార్టీలను, నాయకులనే కేసీఆర్ దగ్గర తీస్తున్నాడని ఫైర్ అయ్యారు. ఎంఐఎం, సీపీఎం తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదని ఆయన గుర్తు చేశారు. ఎంఐఎం, సీపీఎం రెండు పార్టీలు తెలంగాణ రావడాన్ని బహిరంగంగానే వ్యతిరేకించాయని చెప్పుకొచ్చారు.

తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని, ఉద్యమ ద్రోహులకే మంత్రి పదవులు కట్టబెట్టారని.. బీజేపీ పదే పదే ఉద్యమకారుల గురించి ప్రస్తావించడం వల్లనే కొంతమందికైనా కార్పొరేషన్ పదవులు దక్కుతున్నాయని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.. ఇది కేసీఆర్ పాలన అని, ప్రజలకు అన్ని విషయాలు తెలుసని కామెంట్ చేశారు. అందుకే ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు..

Related posts

పెను తుఫానుగా మారిన యాస్ :బెంగాల్ ,ఒడిశా లలో వణికి పోతున్న ప్రజలు…

Drukpadam

Drukpadam

మీడియాపై విమర్శలు గుప్పించిన సీజేఐ ఎన్వీ రమణ!

Drukpadam

Leave a Comment