లగడపాటి రాజగోపాల్ తిరిగి క్రీయాశీల రాజకీయాల్లోకి…?
-టీడీపీ నుంచి విజయవాడ లేదా గుంటూరు నుంచి పోటీ
-గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కు చంద్రగిరి అసెంబ్లీ ఆఫర్ చేసే ఛాన్స్
-విజయవాడ ఎంపీ కేశినేని నాని గుంటూరు లేదా అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం
ఏపీ ఆక్టోపస్ గా పేరు పడ్డ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తిరిగి క్రియాశీలక రాజకీయాల్లోకి రానున్నారా ? అంటే అవుననే అంటున్నారు రాజకీయపరిశీలకులు … రాష్ట్ర విడిపోతే తాను క్రియాశీలక రాజకీయాలకు గుడ్ బై చెబుతానని తిరిగి రాజకీయాల్లో రానని బీష్మ ప్రతిజ్ఞ చేశారు . ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. అన్నట్టుగానే ఆయన అప్పుడు మాటమీద నిలబడి రాజకీయాలకు గుడ్ బై చెప్పారు . అందరు లగడపాటి ఇక రాజకీయాల్లోకి రారని అనుకున్నారు. కానీ గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీడీపీకి అనుకూలంగా వ్యవహరించారనే అభిప్రాయాలు ఉన్నాయి. 2019 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందని నా సొంత సర్వే ప్రకారం టీడీపీ గెలవకపోతే ,ఇక నుంచి ఎన్నికల సర్వే లు చేయనని కచ్చితంగా తన అంచనా ప్రకారం టీడీపీ తిరిగి అధికారంలోకి స్పష్టమైన ఆధిక్యతతో వస్తుందని బల్లగుద్ది మరి వాదించారు . ఆయన
ఆయన సర్వేలు తలకిందులైయ్యాయి. టీడీపీ కి ఓట్లు సీట్లు గణనీయంగా తగ్గాయి. దీంతో ఆయన సర్వే కు విలువ లేకుండా పోయింది. అప్పటినుంచి రాజకీయాలకు తెరమరుగైయ్యారు. సంచల వార్తలకు కేంద్ర బిందువుగా నిలిచే లగడపాటి రాజగోపాల్ తిరిగి రాజకీయాల్లో వస్తున్నాడని వార్తలు రావడం ఆశక్తిగా మారింది. మరి నిజంగా లగడపాటి రాజకీయాల్లోకి వస్తున్నారా ? టీడీపీ లో చేరుతున్నారా ? అనే విషయం ఇటు తెలుగుదేశం వర్గాలుగాని అటు రాజగోపాల్ గాని నిర్దారించలేదు ….
ఆయన వస్తున్నాడని ప్రచారం మాత్రం జరుగుతుంది. ఆయన కాంగ్రెస్ లో చేరరు. మరి వైకాపాకు అవకాశం లేదు . ఇక టీడీపీ అధినేత చంద్రబాబు తో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. టీడీపీ కూడా లగడపాటి లాంటి ఉరకలు పెట్టె నేతలకు చూస్తుంది. అందువల్ల ఆయన్ను చేర్చుకొని గుంటూరు లేదా విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గాలలో పోటీ చేయించాలని చూస్తుందని ప్రచారం జరుగుతుంది. అదే జరిగితే గుంటురు టీడీపీ ఎంపీ గా ఉన్న గల్లా జయదేవ్ ను చంద్రగిరి అసెంబ్లీ నుంచి బరిలో నిలిపే ఛాన్స్ ఉందని అంటున్నారు. లేదా కేశినేని నాని ని అసెంబ్లీ కి పోటీ చేయించి విజయవాడ పార్లమెంట్ లగడపాటికి కేటాయించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ….