Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ప్రజాస్వామ్యం అపహాస్యం… పట్టభద్రుల ఓటుకు సైతం వెల కట్టిన నేతలు

ప్రజాస్వామ్యం అపహాస్యం… పట్టభద్రుల ఓటుకు సైతం వెల కట్టిన నేతలు
– ఓటుకు రూ1000 బిర్యానీ పాకెట్స్
-కొన్ని చోట్ల 500 మాత్రమే పంచటంపై ఆగ్రహం
-దొంగ ఓట్లు సైతం యథేచ్ఛగా వేసిన వైనం
-పోలింగ్ బూతుల దగ్గరే ఓట్లర్లకు డబ్బులు పంచుతున్న పట్టించుకోని పోలీసులు
-కూసుమంచి లో దొగ్గ ఓటుపై ఫిర్యాదు
-చర్యలు తీసుకొని న్యాయం చేస్తామని హామీ నిచ్చిన అధికారులు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారనే విషయం పక్కన పెడితే ప్రజాస్వామ్యాన్ని నడిబజారాలో ఖునీ చేశారు కొందరు. పట్టభద్రలు సైతం నోట్ కు ఓటు అమ్ముకోవడం సిగ్గుచేటుగా ఉంది. ఓటుకు వెలకట్టిన నేతలకు నిజంగా జోహార్లు . నోట్లతో ఓట్లకోని తాము గెలిచామని విర్రవీగే నాయకులకు బుద్ది చెప్పాల్సిన పట్టభద్రులు ఓట్లు అమ్ముకోవడం మరీ దారుణం . భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బూర్గుపహాడ్ పోలింగ్ కేద్రం దగ్గర అధికార పార్టీ ఒక టెంటు ఏర్పాటు చేసింది. అక్కడ ఓటర్లకు డబ్బులు పంచుతూ , బిర్యానీ పెడుతున్న విషయం పోలీసులకు తెలిసిన అధికార పార్టీ టెంటు కదా అది అక్కడ ఉన్నట్లు కూడా వారి గుర్తించినట్లు వ్యవహరించటం విశేషం . ఒక ఓటుకు రూ 1000 బిర్హాణి పాకెట్ ఇచ్చారు . పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండల కేంద్రంలో ఒక పట్టభద్రుడు తన ఓటు వేయటానికి వచ్చాడు అప్పటికే ఆయన ఓటు ఎవరో వేశారు. దీనితో ఆయన కంగు తిన్నాడు . అధికారులలు ఫిర్యాదు చేశాడు . అక్కడ ఉన్న అధికారులు ఆ పట్టభద్రుడికి న్యాయం చేస్తామని సరిది చెప్పారు. ఎలాంటి సంఘటనలు అక్కడక్కడా జరిగినట్లు ఫిర్యాదులు అందినట్లు తెలుస్తుంది.

 

ఖమ్మం లోని యస్ ఆర్ అండ్ బి జి ఎన్ ఆర్ కళాశాల వద్ద పోలింగ్ బూతుల వద్ద ప్రచారం చేస్తున్నారనే నెపంతో కాంగ్రెస్ కు చెందిన నరేందర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై సీఎల్పీ నేత భట్టి ఫైర్ అయ్యారు. అధికార పార్టీ వాళ్ళు ఎలా ప్రచారం చేసిన పట్టించుకోని పోలీసులు ప్రతిపక్షాల కార్యకర్తల ను నిర్బందించటం పై నీరసం వ్యక్తం చేశారు. భట్టి జోక్యం తో నరేందర్ ను పోలీసులు విడిచి పెట్టారు. ఓటర్లను ప్రలోభ పెట్టినందుకు అధికార పార్టీ ఎ బి సి డి లుగా వర్గీకరించి డబ్బులు పంపిణి చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. డబ్బుల పంపిణి ప్రచారం అధికార పార్టీకి కొంత మైనస్ గా మారింది . తమకు డబ్బులు అందలేదని కొందరు , తమకు అభ్యర్థి డబ్బులు పంపిన స్థానిక నాయకులూ ఇవ్వలేదని వారిపై వ్యతిరేక ప్రచారం జరిగింది. మొత్తంగా మీద గతంలో ఎన్నడూ లేని విధంగా మూడు పాత జిల్లాలో 74 శాతం ఓట్లు పాలైయ్యాయి . లెక్కింపు ఈ నెల 17 న జరగనున్నది . అప్పటి వరకు అభ్యర్థుల గుండెలు ల్యాబ్ డబ్ అనాల్సిందే . ప్రధానంగా డబ్బులు ఖర్చు పెట్టినవారికి సరిగా నిద్రకూడా పట్టకపోవచ్చు ఫలితాలకోసం వేచి చూడాల్సిందే …???

Related posts

ప్రజలకు భరోసా ఇవ్వగలిగామన్న తృప్తి ఉంది : సీఎం జగన్…

Drukpadam

జూనియర్ ఎన్టీఆర్ ను వాడుకుని వదిలేశారు..వల్లభనేని వంశీ

Drukpadam

టీఆర్ యస్ ప్రభుత్వాన్ని కూల్చేయండి: బీజేపీ నేత ప్రకాశ్ జవదేకర్…

Drukpadam

Leave a Comment