Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న టీడీపీ…

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న టీడీపీ…
-52.63 శాతం ఓట్లు 73 మున్సిపాలిటీలు సాధించిన వైసీపీ
-టీడీపీకి 30.73 శాతం ఓట్లుతో కేవలం రెండు మున్సిపాలిటీలలో ఆధిక్యం
-4.67 శాతానికి పరిమితమైన జనసేన
-బీజేపీకి కేవలం 2.41 శాతం ఓట్లు
– స్వతంత్రులు – 5.73 శాతం
-నోటా – 1.07 శాతం

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది అనే దాని కంటే టీడీపీ ఘోరంగా దెబ్బతిన్నది అనటం సమంజసంగా ఉంటుందేమో . వైసీపీ 75 మున్సిపాలిటీలకు గాను 73 మున్సిపాలిటీలలో క్లిన్ స్వీప్ చేసింది. అదేవిధంగా మొత్తం 12 కార్పొరేషన్ లు ఉండగా ఓట్లు లెక్కింపు జరగని ఏలూరు మినహా 11 కార్పొరేషన్ లలో విజయ ఢంకా మోగించింది. వైకాపా విజయం దాటికి ప్రతిపక్షాల అడ్రెస్స్ గల్లంతు అయింది. మొత్తం 75 మున్సిపాలిటీలలో 2122 వార్డులు ఉండగా అందులో 1762 వార్డులను వైసీపీ గెలిచింది. మొత్తం పోలైన ఓట్లలో 52 .63 శాతం ఓట్లతో 88 శాతం విజయాలు నమోదు చేసింది. టీడీపీ మాత్రం కేవలం 30 .73 శాతం ఓట్లతో కేవలం 271 వార్డులకు మాత్రమే పరిమితం అయింది. అంటే గెలుపు కేవలం 12 శాతం మాత్రమే దక్కించుకోగలిగింది . బీజేపీ ,జనసేనలు మిత్రపక్షంగా ఉండి పోటీచేశాయి. కానీ జనసేనకు కేవలం జనసేనకు 18 వార్డులు , బీజేపీకి కేవలం 7 వార్డులు మాత్రమే వచ్చాయి. అంటే ఒక్క శాతం ఓట్లు కూడా దక్కించుకోలేక పోయింది . ఈ రెండు పార్టీలకు కలిపి ఓట్ల శాతం కేవలం 7 . 08 శాతం వచ్చాయి. 73 మున్సిపాలిటీలతో పాటు, మొత్తం 11 కార్పొరేషన్లలో జయకేతనం ఎగురవేసింది. కార్పొరేషన్ లలో ఉన్న మొత్తం 671 డివిజన్లలో వైసీపీ 475 , టీడీపీ 71 ,జనసేన 7 ,బీజేపీ ఒక్క డివిజన్లో మాత్రమే గెలిచింది. మిగతా స్థానాలలో ఇతరులు గెలిచారు. వైసీపీ ప్రభంజనం ముందు ఇతర పార్టీలు నిలవలేకపోయాయి. టీడీపీ కొంత మేర పోటీ ఇచ్చినప్పటికీ… ఇతర పార్టీలు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాయి. కడప జిల్లాలోని మైదుకూరు , అనంతపురం జిల్లాలోని తాడిపత్రి మున్సిపాలిటీలలో మాత్రమే తెలుగుదేశం వైకాపాకన్నా ఎక్కువ స్థానాలు గెలిచినా అధికారం దక్కటం కష్టంగానే ఉంది.
ఇదే 2014 మున్సిపల్ ఎన్నికల్లో 92 మున్సిపాలిటీలు ఉండగా 2571 వార్డులు ఉన్నాయి. అందులో 1424 వార్డులు టీడీపీ కి రాగ వైసీపీ కి 939 వార్డులు వచ్చాయి. ఇతరులకు 208 వార్డులు దక్కాయి . వైకాపా ఇంతటి భారీవిజయానికి కారణం ఏమిటి అనేదానిపై విశ్లేషణలు జరుగుతున్నాయి. ఎన్నికలు పెడితే మదము చూపిస్తామని సవాల్ విసిరిన నేతల గొంతులు మూగపోయాయి. వచ్చిన ఒకరిద్దరు నేతలు బెదిరించి ఓట్లు వేయించుకున్నారని సహజమైన ఆరోపణలు చేస్తున్నారు. జగన్ 21 నెలల పాలనకు ఇది రెఫరాండంగానే పరిశీలకులు భావిస్తున్నారు. ప్రధానంగా ప్రజలకు అందించిన సంక్షేమ కార్యక్రమాలే ఈ విజయాలకు కారణంగా ఉన్నాయనే దానిలో సందేహాలు లేవనే మాటలు వినిపిస్తున్నాయి. అంతే కానుందా కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో దేశంలోనే ఏపీ అగ్రస్థానం లో నిలవడంతో ముఖ్యమంత్రి జగన్ వ్యూహాలు బాగా పనిచేశాయి. ప్రజలకు నేను ఉన్నాను అనే భరోసా కల్పించకలిగారు.చెప్పిన మాటకు కట్టుబడే ముఖ్యమంత్రిగా ఉన్నాడనే అభిప్రాయం ప్రజల్లో నాటుకు పోయింది. అందుకే 2019 ఎన్నికల్లో 51 శాతం ఓట్లతో 151 సీట్లు గెలుచుకున్న జగన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అంతకు మించి 52 .63 శాతం ఓట్లు పొందగలిగారు. టీడీపీ 40 శాతం గా ఉన్న ఓట్ల నుంచి 30 శాతానికి పడిపోయింది . జనసేన 7 శాతం నుంచి 4 .67 శాతానికి దిగజారింది. బీజేపీ తాము చేస్తున్న తప్పుల వల్ల రాష్టంలో రోజురోజుకు దిగజారిపోతోంది. ఇప్పటికైనా ప్రతిపక్షాలు తమ పొరపాట్లను తెలిసికొని ముందుకు సాగితే ఫలితాలు ఉంటాయని లేకపోతె ఇదే ఫలితాలు ముందుముందు ఉంటాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Related posts

హైదరాబాద్ లోని షర్మిల ఇంటి ముందు ఏపీ రైతుల మెరుపు ధర్నా…

Drukpadam

ఇన్నాళ్లు మంత్రిని కాబట్టి సైలెంట్ గా ఉన్నా: అనిల్ కుమార్ యాదవ్!

Drukpadam

పాత ఇండియా, కొత్త ఇండియా అంటూ విభజిస్తున్నారు: సంజయ్ రౌత్!

Drukpadam

Leave a Comment