Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఇక్కడ మంచు నల్లగా కురుస్తుంది!

ఇక్కడ మంచు నల్లగా కురుస్తుంది!

  • రష్యాలో ఆశ్చర్యకర పరిణామం
  • ఓంసుచన్ పట్టణంలో నల్లమంచు
  • థర్మల్ వేడినీళ్ల ప్లాంటే కారణం
  • ఇది బొగ్గు ఆధారిత ప్లాంట్
  • భారీ ఎత్తున కాలుష్యం

రష్యా లోని ఒక ప్రాంతంలో కురుస్తున్న మంచు నల్లగా కనిపించడం అక్కడివారిని ఆశ్చర్యానికి గురిచేసింది. దీనిపై ఆరాతీయగా అక్కడ అధికంగా ఉన్న పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యం వల్లనే ఇలా నల్లటి మంచి కురుస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు .

  • మంచు తెల్లగా ఉంటుందన్నది అందరికీ తెలిసిన విషయమే. కానీ రష్యాలోని సైబీరియా ప్రాంతంలో ఓ పట్టణంలో మాత్రం మంచు నల్లగా కురుస్తుంది. ఓంసుచన్ అనే పట్టణంలో కురిసే మంచు ఎవరినైనా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక్కడి నల్లటి మంచుకు బలమైన కారణమే ఉంది.
ఓంసుచన్ పట్టణంలో థర్మల్ ఆధారిత వేడి నీళ్ల ప్లాంట్ ఉంది. సైబీరియా ప్రాంతంలో గడ్డకట్టించే చలి ఉంటుంది. అందుకే ఈ ప్లాంట్ ద్వారా 4 వేల మందికి వేడి నీరు సరఫరా చేస్తారు. దీనికి బొగ్గు ఇంధనంగా వాడతారు. దాంతో ఈ ప్రాంతంలో కాలుష్యం తీవ్రస్థాయిలో ఉంటుంది. ప్లాంట్ నుంచి వెలువడే మసి మంచును సైతం నల్లగా మార్చేస్తోంది. ఇక్కడ కురిసే మంచు అడుగుల మేర పేరుకుపోతుంది. ఈ నల్ల మంచుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో సందడి చేస్తుంటాయి.

Related posts

స్ఫూర్తినిచ్చే రతన్ టాటా కొటేషన్లు కొన్ని…!

Drukpadam

ప్రతిభతో పేటీఎం చీఫ్ కంట్లో పడ్డ ఏడేళ్ల బాలిక!

Drukpadam

మీడియాపై విశ్వాసం కోల్పోరాదు-మంత్రి నిరంజన్ రెడ్డి

Drukpadam

Leave a Comment