Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఇక ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, పాన్.. అన్నీ ఒకే డిజిటల్ ఐడీలో!

ఇక ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, పాన్.. అన్నీ ఒకే డిజిటల్ ఐడీలో!

గుర్తింపు కార్డులన్నింటినీ కలిపి ఒకే కార్డుగా చేసే ప్రయత్నం

ఆధార్ నంబరులా దీనికీ ఓ నంబరు కేటాయింపు

ప్రజాభిప్రాయం కోసం ప్రజల ముందుకు

ప్రస్తుతం దేశ ప్రజల జేబుల్లో బోల్డన్ని కార్డులు ఉంటున్నాయి. ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలియక ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్, పాస్‌పోర్టు వంటివన్నీ మోసుకెళ్లాల్సి వస్తోంది. ఇకపై ఈ బాధ లేకుండా వీటన్నింటినీ కలిపి ఒకే డిజిటల్ ఐడీగా రూపొందించాలని కేంద్రం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఫెడరేటెడ్ డిజిటల్ ఐడెంటిటీస్ (డిజిటల్ గుర్తింపు పత్రాల సమాకలనం)గా ఓ కొత్త మోడల్‌ కోసం ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ ప్రతిపాదించినట్టు సమాచారం.

ఈ కార్డులన్నీ జతకట్టి ఒక్కటిగా చేసిన తర్వాత కూడా ఆధార్ నంబరులా దీనికీ ఓ నంబరు కేటాయిస్తారు. ఇదొక్కటి ఉంటే ఎప్పుడు ఏ కార్డు అవసరమైతే ఆ కార్డును వాడుకోవచ్చు. అంతేకాదు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించే ఐడీలన్నీ ఒకే చోట ఉంటాయి. ప్రస్తుతం ఇది ప్రతిపాదన దశలోనే ఉంది. త్వరలోనే దీనిని ప్రజాభిప్రాయానికి ఉంచుతారని తెలుస్తోంది.

Related posts

The Secrets of Beauty In Eating A Balanced Diet

Drukpadam

పోలీస్ గౌరవం మరింత పెంపొందించేలా పని చేయాలి : డిజిపి మహేందర్ రెడ్డి…

Drukpadam

వ్యాక్సిన్ వేయించుకోవాలని ఎవరినీ ఒత్తిడి చేయలేం: సుప్రీంకోర్టు!

Drukpadam

Leave a Comment