సినీపరిశ్రమ పై సీఎం జగన్ కు పెద్ద మనసు …మెగాస్టార్ చిరంజీవి
-ఏపీ ప్రభుత్వానికి సినీ పరిశ్రమకు మధ్య చర్చలు సఫలీకృతం
-జగన్ ను కలిసిన వారిలో చిరంజీవి , మహేష్ బాబు , ప్రభాస్ , రాజమోళి ,నారాయణ మూర్తి , కొరటాల శివ , అలీ , పోసాని మురళి కృష్ణ
-ఈ నెలాఖరుకి జి ఓ లు
-ఏపీ షూటింగ్ లకు సీఎం ఆహ్వానం
-సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి తగిన సహకారం
గత ఆరేడు నెలలుగా సినీ ప్రశ్రమకు ,ఏపీ ప్రభుత్వానికి మధ్య నెలకొన్న వివాదానికి నేడు శుభం కార్డు పడింది. చిరంజీవి నాయకత్వంలో సినీ పరిశ్రమకు చెందిన అగ్ర హీరోలు మహేష్ ,ప్రభాస్ , అగ్ర దర్శకుడు , రాజమౌళి , కొరటాల శివ , ప్రజా నటుడు నారాయణ మూర్తి , అలీ , పోసాని మురళి కృష్ణ తదితరులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ని తాడేపల్లి లోని ఆయన నివాసం లో కలిశారు . నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అరవింద్, దిల్ రాజు హాజరుకాలేదు. ప్రభుత్వం ముందు టాలీవుడ్ ప్రముఖులు పలు ప్రతిపాదనలు ఉంచారు. సృహుద్ బావ పూరిత వాతావరణంలో జరిగిన చర్చల్లో పరిశ్రమ పెద్దలు చెప్పిన అన్ని విషయాలను జగన్ శ్రద్దగా విన్నారు .పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలను కూడా బతికించాలని నారాయణ మూర్తి కోరికను కూడా సీఎం ప్రస్తావించారు. సినిమా టికెట్స్ రేట్ల విషయంలో , అదే విధంగా కొత్త సినిమాలకు అదనంగా షో లు వేసుకునేందుకు అవకాశాలపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు.
సీఎం తో చర్చల అనంతరం సినీ ప్రముఖులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ సినీ పరిశ్రమకు కావాల్సిన సహకారం సీఎం జగన్ అందించేందుకు అంగీకరించారని అందుకు ఆయనకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. సినీ పరిశ్రమ కోరికలను సీఎం సావధానంగా విన్నారని అన్నిటిని పరిష్కరిస్తామని హామీ నిచ్చారని తెలిపారు . సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని చొరవ పట్టుదల కూడా ఉందని ఆయన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని అన్నారు . ఏపీ లో కూడా షూటింగ్ లు జరిగేలా చూడాలని సీఎం కోరారని అందుకు కావలసిన సౌకర్యాలు కూడా కల్పిస్తామని అన్నారని చిరంజీవి పేర్కొన్నారు . హీరో మహేష్ మాట్లాడుతూ సినీ పరిశ్రమ కొట్టు మిట్టాడుతున్న పరిస్థిల్లో చిరంజీవి చొరవ తీసుకోని సీఎం తో చర్చలు జరిపి పరిష్కరానికి రావడం రిలీఫ్ నిచ్చిందని అన్నారు .అందుకు చిరంజీవికి కృతజ్నతలు తెలిపారు .ప్రభాస్ మాట్లాడుతూ చిరంజీవి గారి పట్టుదల ,సీఎం జగన్ గారి పెద్ద మనసు వల్లనే సమస్యలు పరిష్కరానికి ఒక దారి దొరికిందని అన్నారు.నారాయణ మూర్తి మాట్లాడుతూ , చిన్న పరిశ్రమలు బతికించాలని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేయగానే అంగీకరించిన తీరు తనను ఆకట్టు కున్నాడని అన్నారు . పేర్ని నాని మాట్లాడుతూ సినీ పరిశ్రమకు చెందిన అన్ని అంశాలను ప్రభుత్వ తప్పకుండ పరిష్కరిస్తుందని అన్నారు .చిరంజీవిగారి కృషి వల్లనే ఒక కొలిక్కి వచ్చిన విషయాన్నీ గుర్తు చేశారు .సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా సినీ పరిశ్రమ బతకాలని కోరుకుంటారని అన్నారు . ఏపీ లో కూడా షూటింగ్లు జరిపేలా పరిశ్రమ పెద్దలు కృషి చేయాలనీ విజ్ఞప్తి చేశారు .