Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

యూపీ లో బీజేపీకి ఓటు వేయకపోతే …తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు!

యూపీలో హిందువులంతా బీజేపీకి ఓటు వేయ‌క‌పోయారో..: తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్ వార్నింగ్

  • యూపీలో ఉండాలనుకుంటే యోగికే ఓటు వేయాలి
  • బీజేపీ ఓటు వేయని వారి జాబితా తీస్తాం
  • వారి ఇళ్లపైకి బుల్డోజర్లు, జేసీబీలను పంపిస్తాం
  • యోగి వేల సంఖ్యలో బుల్డోజర్లు, జేసీబీలను యూపీకి తెప్పించారు
ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతోన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో బీజేపీ తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలనం వ్యాఖ్య‌లు చేశారు.
తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ యూపీ ఓటర్లను హెచ్చరించారు . బీజేపీ కి ఓటు వేయకపోతే వారిజాబితా తీస్తామని ,వారి ఇళ్లను బుల్డోజర్లతో తొక్కిస్తామని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు .యూపీలో బీజేపీకి మద్దతివ్వని వారిని హెచ్చరిస్తూ ఓ వీడియో విడుద‌ల చేశారు.   బీజేపీ కి యోగి సర్కార్ కు ఓటు వేయని వాళ్ళను యూపీ నుంచి కూడా పంపిస్తామని నోటికొచ్చినట్లు మాట్లాడటం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. దీనిపై ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అనే ఆశక్తి నెలకొన్నది
యూపీలో ఉండాలనుకుంటే యోగికే ఓటు వేయాలని చెప్పారు. ఎన్నిక‌ల అనంత‌రం.. బీజేపీ ఓటు వేయని వారి జాబితా తీస్తామ‌ని, వారి ఇళ్లపైకి బుల్డోజర్లు, జేసీబీలను పంపిస్తామని వ్యాఖ్యానించారు. ఇప్ప‌టికే యోగి వేల సంఖ్యలో బుల్డోజర్లు, జేసీబీలను యూపీకి తెప్పించారని రాజా సింగ్ చెప్పారు.
బీజేపీకి ఓటు వేయని వారు ఎన్నికల తర్వాత యూపీ నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారు. రెండో దశ ఎన్నికల పోలింగ్ జరిగిందని, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పోలింగ్ శాతం ఎక్కువగా ఉందని చెప్పారు. ఎన్నికల్లో హిందువులంతా ఏకం కావాలని, అందరూ కలిసి యోగి ఆదిత్యనాథ్కు ఓటు వేసి మరోసారి గెలిపించాలని అన్నారు. యోగి మళ్లీ సీఎం కాకూడదని కొంద‌రు కుట్రలు పన్నుతున్నారని చెప్పారు. మూడో దశ పోలింగ్లో బీజేపీకి ఓటు వేయని వాళ్లను గుర్తిస్తామ‌ని అన్నారు.

Related posts

పశ్చిమ బెంగాల్ లో బీజేపీ ఉక్కిరిబిక్కిరి పలువురు నేతలు టీఎంసీ వైపు చూపు…

Drukpadam

టీఆర్ఎస్ ఎంపీలతో ముగిసిన సీఎం కేసీఆర్ సమావేశం!

Drukpadam

మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ పై ఐటీ పంజా… రూ.1000 కోట్ల విలువైన ఆస్తుల జప్తు!

Drukpadam

Leave a Comment