Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

దూకుడు పెంచిన జగన్ సర్కార్

దూకుడు పెంచిన జగన్ సర్కార్
-అమరావతి భూములపై విచారణ వేగవంతం
-విశాఖ కు రాజధాని తరలించటం పై పావులు
-కర్నూల్ కు హైకోర్ట్ తరలింపుపై కేంద్రంతో సంప్రదింపులు
– జిల్లాల విభజనపై కసరత్తు తుదిదశకు
-ప్రత్యేకహోదా పై కేంద్రం దగ్గర వత్తిడి
-దుగ్గిరాజపట్నంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై చర్చలు
-కడప స్టీల్ ప్లాంట్ కోసం ప్రయత్నాలు
-విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రవేటీకరణ వద్దని కేంద్రంతో చర్చలకు సిద్ధం
21 నెలల తరువాత పంచాయతీల ,మున్సిపల్ ఎన్నికలు ముగియటంతో ఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కార్ అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్రంలో పెండింగులో ఉన్న సమస్యలపై స్పీడ్ పెంచింది. పంచాయతీలలో ,మున్సిపాలిటీలలో అధికార పార్టీ సాధించిన విజయాలు మరింత భాద్యత పెంచింది. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలనే పట్టుదలతో పాటు అన్నాయి ప్రాంతాల అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళికతో ముందుకు పోయేందుకు కసరత్తు ప్రారంభించింది.రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఎన్ని ఆటంకాలు కలిగించిన వాటిని లెక్క చేయకుండా తగిన ప్రణాళికతో వ్యూహాత్మకంగా చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే మూడు రాజధానుల ప్రతిపాదన ముఖ్యమంత్రి జగన్ ముందుకు తెచ్చారు. రాష్ట్రంలోను అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే పరిపాలన వికేద్రీకరణ తప్పని సరి అని నమ్ముతున్న ముఖ్యమంత్రి అందుకు అనుగుణంగా అసెంబ్లీలో తీర్మానం చేయించారు. ఇందుకు ప్రతిపక్షాలు అనేక అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ జగన్ తన విజన్ తో అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేశారు.అమరావతి రాజధాని విషయంలో నాడు చంద్రబాబు ప్రభుత్వం అవకతవకలకు పాల్పడిందని దానిపై విచారణ కోసం కాబినెట్ సబ్ కమిటీ ని సైతం నియమించి విచారణ జరిపించారు. దాని రిపోర్టును సైతం శాసనసభలో ప్రవేశ పెట్టారు. దీనిపై టీడీపీ అభ్యతంరాలు వ్యక్తం చేసింది. ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ప్రభుత్వం చెబుతుండగా అది బేస్ లెస్ వాదన అంటూ కొట్టిపారేస్తుంది ఆయన అధికార వికేంద్రీకరణ కు కట్టుబడి ఉన్నామని చెబుతున్న సర్కార్ అందుకనుగుణంగా పావులు కదుపుతుంది. విశాఖకు పరిపాలన రాజధాని ,అమరావతిలో శాసన రాజధాని , కర్నూల్ లో న్యాయ రాజధాని ఏర్పాటుపై కేంద్రం తో చర్చలు జరుపుతుంది. హైకోర్టు అంశం కేంద్రం పరిధిలో ఉన్ననందున చర్చలు జరుపుతుంది. పరిపాలన రాజధాని ,శాసన రాజధాని పెట్టె విషం రాష్ట్ర పరిధిలోని అంశం అని ఇప్పటికే కేంద్రం హైకోర్టు కు సైతం తెలిపింది. ఇక్కడ రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు రాజధాని తరలింపు ను వ్యతిరేకిస్తూ దీక్షలు చేపట్టారు. అవి కొనసాగుతుండగానే వికేంద్రీకరణకు మద్దతుగా దళితసంఘాలు మరో శిభిరం ఏర్పాటు చేసి దీక్షలు చేపట్టాయి. మల్లి ఎన్నికలు జరిపి తిరిగి గెలిస్తే రాజధానిని మార్చండి అంటూ తెలుగుదేశం చేస్తున్న వాదనలు మున్నా జరిగిన పంచాయతీ , మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు తిప్పికొట్టిన విషయాన్నీ వైస్సార్సీపీ ముందుకు తెస్తుంది. ఇప్పటికైనా అన్నాయి ప్రాంతాల అభివృద్ధికి కలిసి రావాలని రాష్ట్రంలో ని అన్ని రాజకీయ పార్టీలకు పిలుపు ఇస్తుంది.అందులో భాగంగానే విశాఖ కు పరిపాలన రాజధానిపై పావులు కదుపుతుంది. కర్నూల్ కు హైకోర్టు తరలింపుకు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తుంది. అక్కడ దీనికోసం వత్తిడి తెస్తుంది.దీనితో పాటు ఎన్నికలలో వాగ్దానం చేసిన విధంగా జిల్లాల పునర్విభజన కసరత్తు తుదిదశకు చేరుకుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ కు వ్యతిరేకంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఇప్పటికే లేఖలు రాసింది. ఈ విషయంపై చర్చించేందుకు అఖిల పక్షంతో ఢిల్లీకి వస్తామని ప్రధాని సమయం ఇవ్వాలని ముఖ్యమంత్రి స్వయంగా కోరారు. ప్రధాని అపాయింట్ మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రవేట్ రంగంలో దుగిరాజపట్నంలో స్టీల్ ప్లాంట్ పెట్టేందుకు సౌత్ కొరియాకు చెందిన పోస్కో కంపెనీ తో చర్చలు జరుపుతున్నారు. అదే విధంగా కడప లో ఏర్పాటు చేయతలపెట్టిన స్టీల్ ఫ్యాక్టరీ పై కూడా ప్రవేట్ కంపెనీ లతో చర్చలు జరుపుతున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. రాష్ట్రాన్ని గతంలోని ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేకహోదా , విశాఖ రైల్వే డివిజన్ , కేంద్ర ప్రభుత్వ ప్రకటించిన సంస్థలు ఏర్పాటుపై ద్రుష్టి సారించారు. ఒకే సారి 30 లక్షల పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి రికార్డు సృష్టించారు.కరోనా మహమ్మారిని సమర్ధవంతంగా ఎదుర్కోవటమే కాకుండా పేదలకు వివిధ స్కీములద్వారా నగదు అందించి ఆదుకుని ఆదర్శం గా నిలిచారు. మరో మూడు సంవత్సరాల పదవి కాలంలో అనుకున్న లక్ష్యాలను సాదించేందుకు నడుంబిగించింది. ఇప్పటికే నవరత్నాలు ఇంప్లీమెంట్ చేయటంతో పాటు చెన్నై టు విశాఖ కారిడార్ ఏర్పాటు , పోర్టుల ఏర్పాటు ,జాలర్లను ఆదుకునేందుకు చర్యలు లాంటి అనేక చర్యలు చేపట్టింది . విమర్శలను సైతం లెక్కచేయకుండా తన విజన్ తో పాలనను ముందుకు తీసుకొని పోయేందుకు జగన్ సర్కార్ మరింత వేగం పెంచుతుందా లేదా చూడాలి !!!

Related posts

వ్యవసాయ చట్టాల రద్దుతో పాటు కనీస మద్దతు ధర చట్టం తేవాలి…

Drukpadam

కేంద్రం తీరుపై టీఆర్ఎస్ ఎంపీ నామ నాగేశ్వ‌రరావు ఫైర్…

Drukpadam

వామ్మో పెట్రోల్ @100 క్రాస్ అవుతుందా …

Drukpadam

Leave a Comment