Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

వైసీపీ ఎంపీపై లోక్ సభ స్పీకర్ ప్రశంసల జల్లు!

వైసీపీ ఎంపీపై లోక్ సభ స్పీకర్ ప్రశంసల జల్లు!

  • విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ కు ఓం బిర్లా లేఖ
  • కరోనా వేళ విలువైన సేవలందించారని కితాబు
  • ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు అభినందనీయమని వెల్లడి
  • నిత్యం ప్రజల మధ్యనే ఉన్నారని ప్రశంసలు

వైసీపీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ (విజయనగరం)పై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ప్రశంసల జల్లు కురిపించారు. కరోనా సంక్షోభ సమయంలో ఎంతో విలువైన సేవలు అందించారని కొనియాడారు. ఈ మేరకు బెల్లాన చంద్రశేఖర్ ఓ అభినందన పత్రాన్ని పంపించారు. ఈ లేఖను ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ఇవాళ మీడియాకు చూపించారు.

కరోనా విజృంభించిన ప్రతిసారి చంద్రశేఖర్ ప్రతిరోజు ఆసుపత్రులను సందర్శిస్తూ ప్రజల్లో ధైర్యం నింపారని ఆ లేఖలో స్పీకర్ ఓం బిర్లా పేర్కొన్నారు. ఎంపీ నిధుల్లో రూ.30 లక్షలు ఖర్చు చేసి జిల్లా ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేశారని, తద్వారా ఆక్సిజన్ కొరత తీరిందని ప్రశంసించారు.

లేఖపై ఎంపీ బెల్లాన స్పందిస్తూ, తాను ఓ ఎంపీగా తన బాధ్యతలు నిర్వర్తించానని ఉద్ఘాటించారు. మహమ్మారి వైరస్ ఉద్ధృతంగా వ్యాపిస్తున్న వేళ ప్రజలకు అండగా నిలవడం తన కర్తవ్యమని స్పష్టం చేశారు. నిత్యం ప్రజల మధ్యన ఉండాలన్న సీఎం జగన్ ఆదేశాలను పాటించానని బెల్లాన వివరించారు. తన సేవలను అభినందిస్తూ స్పీకర్ ఓం బిర్లా లేఖ పంపడం సంతోషదాయకమని తెలిపారు.

Related posts

పోలీసులకు హారతిచ్చి ఆందోళనకు దిగిన షర్మిల.. కేసీఆర్, పోలీసులపై తీవ్ర విమర్శలు!

Ram Narayana

ప్రజాగర్జన సభలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్, ప్రకటించిన రేవంత్ రెడ్డి

Ram Narayana

యాదాద్రి గర్భాలయ విమాన గోపురానికి పసిడి వన్నెలు…

Drukpadam

Leave a Comment