Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఓడిన పట్టభద్రులు … గెలిచిన టీఆర్ యస్

ఓడిన పట్టభద్రులు … గెలిచిన టీఆర్ యస్
-అన్ని పార్టీలకు గుణపాఠం
-టీఆర్ యస్ పునః పరిశీలన చేసుకోవాలి
-మొదటి ప్రాధాన్యత లో టీఆర్ యస్ అభ్యర్థులకు వచ్చిన ఓట్లు
-రెండు చోట్ల మొత్తం పోలైన ఓట్లు 7 లక్షల 45 వేల 314
-టీఆర్ యస్ అభ్యర్థులకు వచ్చిన ఓట్లు 2 లక్షల 28 వేల 764
తెలంగాణాలో జరిగిన రెండు ఎమ్మెల్సీ పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎన్నికలలో టీఆర్ యస్ గెలిచింది. కానీ పట్టభద్రలు ఓడారు. టీఆర్ యస్ పెద్దవెత్తున సంబరాలు చేసుకుంటున్నప్పటికీ వారిలో కూడా ఎక్కడో తేడాకొడుతుంది . పైకి చెప్పకపోయినా దీనిపై లోతుగా ఆలోచనలో వారు పడి ఉంటారు. పథకాలు ఎన్నిపెట్టిన ఎంత అభివృద్దిచేసినప్పటికీ ప్రజలు కోరుకునే అభివృద్ధి కాకుండా, పాలకులు కోరుకునే అభివృద్ధిని, ప్రజలు కోరుకోవటం లేదనేది స్పష్టమైంది. ఈ ఎన్నికలు అనేక ప్రశ్నలను లేవనెత్తాయి .వాటికీ సమాధానం వెతకాల్సిన అవసరం ఉంది. స్పష్టమైన మైజారిటీ ఎక్కడ రాలేదు. ప్రధాన రాజకీయపార్టీలు ప్రజల నాడి పట్టుకోవటంలో ఎక్కడో మిస్ అవుతున్నట్లు తీన్మార్ మల్లన్న పోటీ తెలియజేస్తున్నది. డబ్బు,అధికారం ఉంటె ఎన్నికలలో ఏదోవిధంగా గెలవచ్చు అనే విషయం మరోసారి వెల్లడైంది. పార్టీలలో ఉన్న అసమ్మతి బట్ట బయలైంది. రాజకీయ పార్టీలు మొక్కుబడి ఉద్యమాలు కాకుండ ప్రజల తరుపున నిక్కచ్చిగా పోరాడుతున్నామనే విశ్వాసం ప్రజలకు కలిగించగలగాలని నిరూపితమైంది. రెండు చోట్ల కూడా అధికార టీఆర్ యస్ టెక్నికల్ గా గెలిచినప్పటికి రెండవ ప్రాధాన్యత ఓట్లతో సైతం చివరి అభ్యర్థి ఎలిమినేట్ అయ్యేంతవరకు స్పష్టమైన ఆధిక్యత రాలేదు . మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే గెలుస్తామని మాపాలన చాల బాగుందని ప్రజలు మమ్ములనే ఆదరిస్తారని చెప్పిన టీఆర్ యస్ కు ఈ ఫలితాలు ఒక గుణపాఠం . కానీ అందుకు వారు అంగీకరించక పోవచ్చుగాక ఇది నిజం . టెక్నికల్ గా టీఆర్ యస్ అభ్యర్థులు గెలిచారు. రెండవ ప్రాధాన్యత ఓట్లలో కూడా పూర్తీ మైజార్టి 50 శాతం ప్లస్ ఎవరికీ రాలేదు . సాధారణ మైజారిటీ తోనే టీఆర్ యస్ గట్టెక్కింది . మొత్తం రెండుచోట్లా కలిపి 7 లక్షల 45 వేల 314 ఓట్లు పోలైయ్యాయి. అధికార టీఆర్ యస్ ఇద్దరు అభ్యర్థులకు వచ్చిన ఓట్లు కేవలం సుమారు 2 లక్షల 16 వేల 550 ఓట్లు మాత్రమే వచ్చాయి .అంటే మిగతా 5 లక్షల 28 వేల 764 ఓట్లు టీఆర్ యస్ కు వ్యతిరేకంగా వచ్చాయి. ఇందులో టీఆర్ యస్ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యతలో కచ్చితమైన మైజారిటీ రావాలంటే నల్లగొండలో లక్ష 83 వేల , 168 ప్లస్ ఒకటి , హైద్రాబాద్ లో లక్ష 78 వేల 677 ప్లస్ ఒక్క ఓటు రావాలి. కానీ మొదటి ప్రాధాన్యతలో నల్లగొండలో ఓట్లు లక్ష 10 వేల 840 ,హైద్రాబాద్ లో లక్ష 5 వేల 710 మాత్రమే వచ్చాయి .అందువల్ల అధికార పార్టీ అన్ని అవకాశాలు ఉపయోగించినప్పటికీ అనుకున్న విధంగా పట్టభద్రులు మద్దతు పలకలేదు. దీన్ని టీఆర్ యస్ ఆలోచించాలి . పైగా నల్లగొండ,వరంగల్ ,ఖమ్మం పట్టభద్రుల నియోజవర్గంలో తీన్మార్ మల్లన్న అధికార పార్టీ అభ్యర్థిని ముచ్చెమటలు పట్టించారు. ప్రతి రౌండ్ లో తీన్మార్ కు వచ్చిన ఓట్లు చూసి అన్నిపక్షాలవారు అవాక్కయ్యారు. ఒక సందర్భంలో తీన్మార్ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాల కలిగాయి.హైద్రాబాద్ ,రంగారెడ్డిలో కూడా బీజేపీ అభ్యర్థి రామచందర్ రావు గట్టి పోటీనిచ్చారు.గెలుపు అంచులదాకా వచ్చి ఓడిపోయారు. టీఆర్ యస్ గెలుపు సంబరాలు చేసుకోవచ్చు . ఎన్నిక ఏదైనా టీఆర్ యస్ దే గెలుపు అని చెప్పేందుకు బాగానే ఉన్నా డేంజర్ బెల్స్ మోగుతున్నాయనే సంగతి మర్చిపోతే ఇబ్బందులు తప్పవు, తస్మాత్ జాగ్రత్త !!!

Related posts

బీఆర్ఎస్ రాకపోతే పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం ఆగిపోతుందా?: కిషన్ రెడ్డి….

Drukpadam

చిరంజీవి జగన్ కు దండం వెనక అర్థం చెప్పిన ఎంపీ రామ్మోహన నాయుడు!

Drukpadam

చంద్రబాబు చేయలేని పనిని నేను చేశా: జగన్

Drukpadam

Leave a Comment