- ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం
- తెలంగాణ భవన్ లో సంబరాలు
- గాల్లోకి కాల్పులు జరిపేందుకు నేత యత్నం
- నిలువరించిన ఇతర టీఆర్ఎస్ నాయక
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘనవిజయం అందుకున్న సంగతి తెలిసిందే. రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానంలో సురభి వాణీదేవి… ఖమ్మం-నల్గొండ-వరంగల్ ఎమ్మెల్సీ స్థానంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి నెగ్గారు. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ శ్రేణులు భారీగా సంబరాలు చేసుకున్నాయి.
య
అయితే, అత్యుత్సాహం ప్రదర్శించిన గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు కట్టెల శ్రీనివాస్ యాదవ్ తుపాకీ తీసి విజయసూచకంగా గాల్లోకి కాల్పులు జరిపేందుకు యత్నించారు. అయితే, పక్కనే ఉన్న ఇతర నేతలు వెంటనే అప్రమత్తమయ్యారు. శ్రీనివాస్ యాదవ్ ను కాల్పులు జరపకుండా నిలువరించారు. పార్టీ నేతలు వారించడంతో శ్రీనివాస్ యాదవ్ కాల్పులు జరపాలన్న ఆలోచన విరమించుకున్నారు.