Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

100 కోట్లు,దొంగ ఓట్లు … పల్లా విజయమన్న మల్లన్న

100 కోట్లు,దొంగ ఓట్లు… పల్లా విజయమన్న మల్లన్న
-ప్రజాసమస్యలపై పోరాడతా ప్రగతి భవన్ గోడలు బద్దలు కొడతా
-పోరాడతా ,పోరాడుతూనే ఉంటా
-తెలంగాణాలో సమూల రాజకీయ మార్పును ప్రజలు కోరుకొంటున్నారు
-ప్రతిపక్షాలకు ఇది గుణపాఠం
-అధికార పార్టీ ఊపిరి తీసినంత పనైంది
-త్వరలో 6000 వేల కిలోమీటర్లు పాదయాత్ర
-గడప ,గడపకు తిరుగుతా

100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ,దొంగ ఓట్లు వేయించుకుని పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలిచారని ,నిజంగా ఆయన గెలుపు గెలుపు కాదని ఓటమి అనంతరం తీన్మార్ మల్లన్న అన్నారు. ఇక్కడ ఏమి జరుగుతుందోనని అందరు చూశారు. ముఖ్యంగా ప్రగతి భవన్ వర్గాలు చూసినట్లు నాకు సమాచారం అని అన్నారు. కౌంటింగ్ ముగిసిన అనంతరం ఆయన మీడియా తో మాట్లాడుతూ దొంగ ఓట్లు లేకపోతె పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలిచేవారు కాదని అన్నారు. 17 వేల దొంగ ఓట్లు చేర్పించినట్లు పదే పదే ఆరోపణలు గుప్పించారు. తనకు ఓట్లు వేసి అశ్విర్వదించిన పట్టభద్రులైన ఓట్లర్లకు కృతజ్నతలు తెలిపారు.ఈ యుద్ధం ఇంతటితో ముగియలేదని ఇప్పుడే ఆరంభమైందన్నారు . త్వరలో 6000 కిలోమీటర్ల పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు.గడప,గడప తొక్కుతానన్నారు. ప్రజాసమస్యలపై పోరాడతానని ,పోరాడుతూనే ఉంటానని అన్నారు. ఈ పోరాటంలో ప్రగతి భవన్ గోడలు బద్దలు కొడతా ? బారా బర్ కొడతా అన్నారు. ప్రజలు తెలంగాణలో సమూలమైన రాజకీయ మార్పు కోరుకుంటున్నారు. రానున్న పది సంవత్సరాలలో సామాన్యుడు ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోవాలి . అంతవరకూ తీన్మార్ మల్లన్న విశ్రమించడన్నారు . ప్రతిపక్షాలు భాద్యత నుంచి తప్పుకోవటం వల్లనే ప్రజలే ప్రతి ప్రతిపక్షాలుగా వ్యవహరించారని అన్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి కలిసి రండని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. . ప్రజల్లోకి పోతా , ప్రజల తరుపున పోరాడతా . పట్టభద్రులు సరైన నిర్ణయమే చేశారు. బ్యాలట్ లో ఎక్కడో ఉన్న తన 39 నెంబర్ ను వెతుక్కొని ఓటేశారని వారికీ మొక్కాల్సిఉందని ఉందన్నారు. దొంగ ఓట్లు వల్ల పల్లా గెలిచారని ఉద్గాటించారు. ప్రజాసేవ చేసేందుకు పార్టీ కండువా అవసరం లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు . ప్రజల కోసం పని చేస్తా .ప్రజలపై ఎక్కడ ఈగ వాలితే అక్కడ ఈ మల్లన్న ఉంటాడు. ఎంతోమంది కస్టపడి తెచ్చుకున్న తెలంగాణ దొరల చేతుల్లోకి పోయుందన్నారు. ఏదైనా పార్టీలో చేరే విషయాన్నీ ప్రస్తావించగా ఆయన దాన్ని కొట్టిపారేశారు. రాజకీయపార్టీలు సరిగా ఆలోచించటంలేదని ఈ ఎన్నికలు నిరూపించాయన్నారు.ప్రజల ఆలోచనలు ఒకరకంగా ఉంటె రాజకీయపార్టీల ఆలోచనలు మరోవిధంగా ఉంటున్నాయని పేర్కొన్నారు.అదే విషయం ఫలితాల్లో స్పష్టం అయిందన్నారు.తాను ఏమిచేయాలి ఏమి చేయబోతున్నది తన టీం తో చర్చించిన అనంతరం చెబుతామన్నారు.
మీడియా పై
మీడియా పాత్రపై ఆయన మాట్లాడుతూ మీడియా తనకు ఏమాత్రం సహకరించలేదన్నారు. ఖద్దర్ బట్టలు వేసుకున్న వల్లనే లీడర్లుగా చూశారు. మీడియా నాకు ఏమాత్రం సహకరించలేదు. మీడియా మిత్రులు తాను గెలవాలని కోరుకున్నారని అయితే యాజమాన్యాలు చెప్పినట్లు చేయటమే వారిపని కదా అందువల్ల తన వార్తలకు కనీసం చోటుకూడా దక్కలేదని వాపోయారు. మనవాళ్ళు రాసినా, అవి ఎక్కడ ఆగాలలో అక్కడే ఆగాయన్నారు. సోషల్ మీడియా నన్ను ఇంతటి వాణ్ణి చేసిందని పేర్కొన్నారు.

Related posts

రెండు రోజుల పాటు మూత పడ‌నున్న తిరుమ‌ల ఆల‌యం.. కార‌ణాలివే!

Drukpadam

కోడిపుంజు దశదినకర్మకు 500 మందికి భోజనాలు పెట్టారు!

Drukpadam

టెస్లా అనుకుంటే పోర్షే ముందొచ్చింది… భారత మార్కెట్లోకి తొలి ఎలక్ట్రిక్ కారు!

Drukpadam

Leave a Comment