Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పీఆర్సీ మోదం ఖేదం…

పీఆర్సీ మోదం ఖేదం…
-ఏది నిజం -ఏది అబద్దం
-ఆదాయం లేదా మరి తలసరి ఆదాయం 2 .27 లక్షలకు ఎలా పెరిగింది
-పీఆర్సీ కమిటీ సిపార్సులు -ముఖ్యమంత్రి ప్రకటన
-3 సంవత్సరాల పీఆర్సీ వదులుకోవటమేనా?
-పీఆర్సీ ఉద్యోగుల హక్కా -పాలకుల దయాదక్షిణ్యామా ?
-రాజకీయాల ఉచ్చులో పీఆర్సీ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎట్టకేలకు పీఆర్సీ ప్రకటించారు. దానిపై ఉద్యోగాల సంఘాలు హర్షం వ్యక్తం చేస్తూ ఆయన చిత్రపటాలకు క్షీరాభిషేకం చేస్తున్నాయి .30 ఫిట్ మెంట్ ,ఉద్యోగుల రిటైర్ మెంట్ వయసు 61 సంవత్సరాలకు పెంచుతూ అసెంబ్లీ లో ప్రకటన స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా,దీనిపై కొన్ని ఉద్యోగులు పెదవి విరుస్తున్నారు. అసలు పీఆర్సీ అనేది పాలకుల భిక్షా లేక హక్కా అనే చర్చ కూడా వస్తుంది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి పే రివిజన్ కమిటీ ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాలూ తెలుసుకొని సిపార్సు చేస్తారు. ఉద్యోగ సంఘాల వత్తిడితో దానికి కొంచం కలిపి పీఆర్సీ ప్రకటించటం అనవతిగా వస్తుంది. కానీ పీఆర్సీ కమిటీ ఈ సారి కేవలం 7 .5 శాతం మాత్రమే ఫిట్ మెంట్ ఇవ్వాలని సిపార్సు చేసింది. దీనిపై ఉద్యోగాల సంఘాలు మండిపడ్డాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో జరిపిన చర్చలలో ఫిట్ మెంట్ ఇతర ప్రయోజనాలపై ఉద్యోగ సంఘాల నాయకులూ తమ నిరసన తెలిపారు. చివరకు ముఖ్యమంత్రి దగ్గరకు చేరింది . కరోనా ప్రభావంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం భారీగా తగ్గినందున ఉద్యోగులు తమ పీఆర్సీ ని వాదులు కోవాల్సిందే అనే సంకేతాలు వచ్చాయి. ఒక దశలో కొన్ని ఉద్యోగ సంఘాలు రాష్ట్ర వ్యాపితంగా సమ్మె చేయాలనే ఆలోచన కూడా చేశాయి. రాష్ట్రంలో ప్రభుత్వం పీఆర్సీ అమలులో చూపుతున్న జాప్యానికి ఉద్యోగులలో వ్యతిరేకత పెరిగింది. ఫలితంగా దుబ్బాకలో,హైద్రాబాద్ లలో జరిగిన ఎన్నికలలో అధికార టీఆర్ యస్ కు వ్యతిరేకంగా వారు పని చేశారనే అభిప్రాయాలూ వ్యక్తం అయ్యాయి. ఈ సారి అవకాశం కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగులకు ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి.రెండు పట్టభద్రుల నియోజకవర్గాలలో ఓటమి తప్పదని నివేదికలు అందుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన పీఆర్సీ పై ఉద్యోగసంఘాల నేతలను పిలిచి ప్రగతి భవన్ లో మాట్లాడారు. అప్పుడే పీఆర్సీ పై ఒక నిర్ణయానికి వచ్చి ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్రకటించటంలేదని ఉద్యోగసంఘాల నేతలతో చెప్పించారు. రాష్ట్ర ప్రభుత్వం తలసరి ఆదాయంగా దేశంలో ఏ రాష్ట్రంలో తెలంగాణాలో 2 లక్షల 27 వేలు ఉందని ఆర్థిక మంత్రి రాష్ట్ర శాసనసభలో ప్రకటించగా అందుకు భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం లేదని చెప్పటం విడ్డురంగా ఉండనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి.ఒక పక్క రాష్ట్ర ఆదాయం కోల్పోయామని అందుకోసమే ఉద్యోగులకు కేవలం 7 . 5 శాతం మాత్రమే ఫిట్ మెంట్ ఇవ్వాలని సిపార్సు చేసిన పీఆర్సీ కమిటీ నివేదిక తప్పా? లేక అన్ని ఇబ్బందులు ఉన్నా పీఆర్సీ గొప్పగా ఎందుకు ప్రకటించారు. సిపార్సులు కేవలం కంటి తుడుపేనా ,పీఆర్సీ అమలు అనేది రాజకీయ కార్యక్రమంగా , పాలకుల దయాదాక్షిణ్యాలపై ఆధార పడిందా ? ఎలాంటి సిపార్సులకోసం సంవత్సరాల తరబడి పీఆర్సీ కోసం కమిటీ ఎందుకు ? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.2018 ఎన్నికల టీఆర్ యస్ తన ఎన్నికల ప్రణాళికలో ఉద్యోగులకు రిటైర్ మెంట్ వయస్సు పెంచుతామని , పీఆర్సీ అమలు చేస్తామని ప్రకటించింది. అందుకు పీఆర్సీ కమిటీ ని నియమించి కాలయాపన చేసి 2021 ఏప్రిల్ 1 నుంచి పీఆర్సీ, రిటైర్ మెంట్ వయస్సు పెంపు అమలు చేస్తామని శాసనసభలో ముఖ్యమంత్రి ప్రకటించారు. ఎన్నికల అయిన వెంటనే అమలు ప్రభుత్వ వాగ్దానం అమలు అవుతుందని ఉద్యోగులు భావించారు. కానీ ప్రభుత్వం అమలు జరపలేదు . పైగా 2021 ఏప్రిల్ నుంచి అమలు చేస్తున్నట్లు ప్రకటించటంతో అప్పటి నుంచి ఉద్యోగులు తమకు రావాల్సిన మూడు సంవత్సరాల బెనిఫిట్స్ కోల్పోతున్నారు. ప్రత్యేకించి ఈమధ్య కాలంలో రిటైర్ అయిన ఉద్యోగులకు అన్యాయం జరుగుతుంది. ఉద్యోగులకు హక్కుగా రావాల్సిన పీఆర్సీ రాజకీయాల చట్రంలో నలిగి గిలగిలా లాడుతుంది. అయిన కుడం ఇస్తే పండగ అనుకునే ఉద్యోగులు సంబరాలు జరుపుకుంటున్నారు. దట్ ఈజ్ రాజకీయ చాణిక్యుడు కేసీఆర్!!!

Related posts

మహిళలకు ప్రధాని మోదీ రూ.1,000 కోట్ల కానుక!

Drukpadam

కరోనా ఎఫెక్ట్.. రిలే నిరాహార దీక్షలు వాయిదా వేసిన షర్మిల

Drukpadam

ప్ర‌తిప‌క్ష‌ పార్టీల‌తో త్వ‌ర‌లో   సోనియా గాంధీ  భేటీ!

Drukpadam

Leave a Comment