Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పార్టీ మారాను గాక మారాను …తుమ్మల!

పార్టీ మారాను గాక మారాను …తుమ్మల!
-వ్యక్తిగత లబ్ధికన్నా పార్టీ ప్రయోజనమే ముఖ్యం
-పుకార్లను నమ్మవద్దు
-టీఆర్ యస్ నుంచి పోవాల్సిన అవసరం లేదు

ఖమ్మం జిల్లా టీఆర్ యస్ రాజకీయాల్లో సంచలనంగా మారిన తుమ్మల ,పొంగులేటి రాజకీయ మార్పులపై వస్తున్నా ఊహాగానాలకు సీనియర్ నేత మాజీమంత్రి తుమ్మల తెరదించారు. తాను టీఆర్ యస్ వీడుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని కొట్టి పారేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ మారె పరిస్థితి లేదని తేల్చి చెప్పారు . తనకు వ్యక్తిగత ప్రయోజనాలకన్నా పార్టీ ప్రయోజనాలే మిన్నగా భావిస్తానని పేర్కొన్నారు .సోషల్ మీడియా లోను , మీడియా లో వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు . చిన్న చిన్న విషయాలకు పార్టీలు మారె మనస్తత్వం తనది కాదని అన్నారు . కొన్ని విలువలకు కట్టుబడి రాజకీయాల్లో ప్రయాణం కొనసాగించమని అదే వరవడి కొనసాగిస్తానని అన్నారు .

తుమ్మల ,పొంగులేటి ని ఇటీవల ఖమ్మం జిల్లా వచ్చిన జూపల్లి కృష్ణారావు కలిశారు . ఆయన వీరిని వేరువేరుగా కలిశారు . వారిమధ్య అనేక విషయాలు చర్చకు వచ్చాయి. అందులో రాజకీయాలు కూడా ఉన్నాయి. యాదృచ్చికంగా జూపల్లి కూడా టీఆర్ యస్ లో ఉన్నప్పటికీ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండటం , సీఎం అపాయింట్మెంట్ లేకపోవడం తో ఆయన జిల్లాకు ఎందుకు వచ్చిన అసమ్మతి నేతలను కలవడంతో సంచలనంగా మారింది. దీంతో వీరి కలయిక రాష్ట్ర వ్యాపితంగా చర్చనీయాంశం అయింది. అందులో అదే రోజు వనపర్తి పర్యటనలో సీఎం కేసీఆర్ ఉండగా జూపల్లి దానికి హాహారు కాకుండా ఖమ్మం కు వచ్చి కొంతమందిని కలవడం తో రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది.

అంతే కాకుండా తాజాగా తుమ్మల అనుయాయులు అంతా సమావేశం కావడం అందులో తన నేత తుమ్మల రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నుంచే పోటీ చేస్తారని చెప్పడం , ఒకవేళ ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్న దాని ప్రకారం నడుచుకుంటామని చెప్పడంతో పార్టీ మార్పు పై ఊహాగానాలకు తెరలేచింది. తుమ్మల దీనిపై స్పందించారు . తాను పార్టీ మారడంలేదని స్పష్టం చేశారు . ..

Related posts

విభజన అంశాలపై ఉండవల్లి తీవ్ర వ్యాఖ్యలు…స్పందించిన వైసీపీ !

Drukpadam

జూపల్లి వర్సెస్ హర్షవర్ధన్ రెడ్డి ….. రణరంగంగా మరీనా కొల్హాపూర్….

Drukpadam

20 రేట్ల ప్రతీకారం తీర్చుకుంటా …చంద్రబాబు

Drukpadam

Leave a Comment