Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

2024 ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్ చెమటలు పట్టిస్తుంది: ప్రశాంత్ కిశోర్

2024 ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్ చెమటలు పట్టిస్తుంది: ప్రశాంత్ కిశోర్
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓడిన కాంగ్రెస్
కాంగ్రెస్ ఏకతాటిపైకి వస్తేనే బీజేపీని ఎదిరించడం సాధ్యమన్న పీకే
కాంగ్రెస్ నుంచి గాంధీ కుటుంబం తప్పుకున్నా కష్టమేనని వ్యాఖ్య
బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు షార్ట్‌కట్స్ ఏమీ లేవని స్పష్టీకరణ

ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమి పాలైన కాంగ్రెస్ 2024లో మాత్రం బీజేపీని చాలెంజ్ చేసే స్థాయికి ఎదుగుతుందని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అభిప్రాయపడ్డారు. అయితే, అందుకు చేయాల్సిందల్లా ఏకతాటిపైకి రావడమేనని అన్నారు. కాంగ్రెస్ ఆ పనిని ఇప్పుడే ప్రారంభిస్తే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని సవాలు చేయగలిగే స్థాయికి ఎదుగుతుందని జోస్యం చెప్పారు. ‘ఇండియా టుడే’తో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల సమావేశమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ).. పార్టీలో నెలకొన్న సంస్థాగత బలహీనతలను పరిష్కరించడంతోపాటు పార్టీ నిర్మాణంలో సమగ్ర మార్పులు చేసేందుకు ఆ పార్టీ అధినేత్రి సోనియాకు పూర్తి అధికారం ఇచ్చింది.

2024 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అవకాశం ఉందని పేర్కొన్న ప్రశాంత్ కిశోర్.. బీజేపీ ఆధిపత్యం కొనసాగుతున్నప్పటికీ బీహార్, బెంగాల్, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ వంటి తూర్పు, దక్షిణ భారతదేశంలోని దాదాపు 200 స్థానాల్లో 50 కంటే ఎక్కువ సీట్లను సాధించేందుకు ఇప్పటికీ పోరాడుతోందని అన్నారు.

కాంగ్రెస్‌కు పునర్జన్మ ఇవ్వాల్సిన అవసరం ఉందని పీకే అన్నారు. దాని ఆత్మ, ఆలోచనలు, భావజాలం అలానే ఉంటాయి కానీ, మిగతావన్నీ కొత్తగా ఉండాలని అన్నారు. గాంధీ కుటుంబం కాంగ్రెస్‌ను విడిచిపెట్టినా ఆ పార్టీ పుంజుకునే అవకాశం లేదని, కాబట్టి కాంగ్రెస్ డ్రాయింగ్ బోర్డుకు తిరిగి వెళ్లి ప్రాథమికాలను సరిచేయాల్సిన సమయం ఇదేనని పీకే వ్యాఖ్యానించారు. బీజేపీకి కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు షార్ట్‌కట్స్ ఏమీ లేదని, 10-15 ఏళ్ల దృక్కోణంతో ముందుకు వెళ్లడమే ఏకైక మార్గమని ప్రశాంత్ కిశోర్ తేల్చి చెప్పారు. ప్రశాంత్ కిషోర్ జ్యోష్యం తో రాజకీయాల్లో ఆశక్తి నెలకొన్నది .చచ్చిపోయిందనుకున్న కాంగ్రెస్ కు ఆయన మాటలు ఊరట నిచ్చాయి.

Related posts

2019-20లో 108 కోట్లు ఖర్చు చేసిన టీడీపీ.. కనిపించని ఇతర పార్టీల లెక్కలు!

Drukpadam

తరలింపే తక్షణ ప్రధాన కర్తవ్యం: 31 పార్టీల అఖిలపక్ష సమావేశంలో కేంద్రం స్పష్టీకరణ!

Drukpadam

బడ్జెట్ పన్ను ప్రతిపాదనలపై నిపుణుల అభిప్రాయాలు…

Drukpadam

Leave a Comment