కోమటి రెడ్డి బ్రదర్స్ చుట్టూ రాజకీయాలు …
-ఒకరు రాష్ట్రంలో మరొకరు కేంద్రంలో
-వెంకటరెడ్డి పీఎం తో భేటీ …రాజగోపాల్ భట్టి తనకు సభలో సహకరించలేదని అలక
-పాలకపక్షంతో పాటు సొంతపార్టీ పైన విరుచుపడే నైజం
-తాము కలిసివుంటే ఎదురు ఉండదనే తమపై దుష్ప్రచారం అంటున్న రాజగోపాల్
-ఓ వర్గం మీడియాను వాడుకుంటున్నారు కొందరు వాడుకుంటున్నారని విమర్శ
-ఇంటికి కిలో బంగారం పంచినా కేసీఆర్ అధికారంలోకి రాలేరన్న రాజగోపాల్
కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే తెలుగు రాష్ట్రాలలో తెలియని వారు ఉండరు .వారి చుట్టూ రాజకీయాలను తిప్పుకుంటారు . వారికీ కాంగ్రెస్ లో బలమైన నాయకులుగా గుర్తింపు ఉంది. ఇద్దరు అన్నలదమ్ముల్లో ఒకరు ఎంపీ మరొకరు ఎమ్మెల్యే . వెంకటరెడ్డి పీసీసీ అధ్యక్షుడు కావాలని చాల ప్రయత్నాలు చేశారు . ఆయనకు కాకుండా రేవంత్ కు ఇచ్చేవరకు అధిష్టానం మీదే ఆరోపణలు చేశారు. దీనిపై అధిష్టానం సీరియస్ అయింది. చివరకు రేవంత్ తో సయోధ్య కుదిరింది . కాంగ్రెస్ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. నిన్న పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో ప్రధాని నరేంద్రమోడీని కలిసిన ఎంపీ కోమటిరెడ్డి తన నియోజకవర్గ సమస్యలతోపాటు ,సింగరేణి కుంభకోణంపై ఫిర్యాదు చేశారు .
ఇక రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే …బీజేపీ లోకి వెళుతున్నట్లు ఆయనే ప్రకటించారు. తిరిగి కాంగ్రెస్ లోనే ఉంటున్నానని తెలిపారు .అప్పుడప్పుడు పార్టీ మారుతున్నట్లు ప్రకటించడం మారితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పడం షరా మాములుగా మారింది .బడ్జెట్ సమావేశాల చివర రోజున సభలో భట్టి తనకు మద్దతు పలకలేదని ఆయనపై అసహనం వ్యక్తం చేశారు . కోమటి రెడ్డి బ్రదర్స్ మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని అది సాధ్యమయ్యే పనికాదని అన్నారు . ఆయన మాటల్లోనే ….
కోమటిరెడ్డి సోదరులు ఒక్కటిగా ఉంటే నల్గొండలో ఎదురుండదని భయపడుతున్న కొందరు తమ మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇందుకు ఓ వర్గం మీడియాను ఉసిగొల్పుతున్నారని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆరోపించారు. ఆ మీడియా ద్వారా తమ మధ్య మనస్పర్థలు ఉన్నట్టు ప్రచారం చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎల్పీ కార్యాలయంలో నిన్న ఆయన విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్‌లో సమర్థులైన నాయకులకు కొదవ లేదని, ఎవరి నియోజకవర్గాల్లో వారు పాదయాత్రలు చేస్తే ఈజీగా గెలుస్తామని అన్నారు. అలాగే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పైనా రాజగోపాల్‌రెడ్డి విరుచుకుపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఇంటికి కిలో బంగారం చొప్పున పంచిపెట్టినా కేసీఆర్ అధికారంలోకి రాలేరని అన్నారు. కేసీఆర్ గురించి, ప్రభుత్వ అవినీతి గురించి ప్రజలకు స్పష్టమైన అవగాహన వచ్చిందన్నారు. కాగా, నేటి మధ్యాహ్నం 12 గంటలకు భట్టి విక్రమార్క అధ్యక్షతన కాంగ్రెస్ శాసనసభా పక్షం సమావేశం కానుంది.