Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కేసీఆర్ మంత్రి వర్గంలో సండ్రకు చోటు ఉంటుందా…

కేసీఆర్ మంత్రి వర్గంలో సండ్రకు చోటు ఉంటుందా…
-మంత్రివర్గంలో మార్పులపై కేసీఆర్ ఆలోచనలు చేస్తున్నారా
-ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేల పనితీరుపై సమీక్ష
-సాగర్ ,ఖమ్మం ,వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల తరువాత ప్రక్షాళన దిశగా అడుగులు
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ యస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గంలో మార్పులకు శ్రీకారం చుట్టనున్నారా అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు . కేసీఆర్ రెండవ సారి అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తుంది. ప్రభుత్వ పనితీరు పై ప్రజల్లో కొంత అసంతృపి ఉంది. అది ఆయా సందర్భాలలో బయట పడింది. కొంత మంది మంత్రుల పనితీరు కూడా అధినేతకు నచ్చటంలేదు. ప్రజల నుంచి అసంతృప్తిని చల్లార్చేందుకు రాజకీయ చాణిక్యుడుగా పేరొందిన కేసీఆర్ తనదైన శైలిలో చికిత్స చేస్తుంటారని పేరుంది. అందులో భాగంగా ఆయన మంత్రివర్గంలో కొన్ని మార్పులకు శ్రీకారం చట్టనున్నారనే అభిప్రాయాలూ ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న మంత్రులలో కొంత మంది మంత్రిలను తప్పించి మరికొందరికి చోటుకల్పించవచ్చునని అంటున్నారు. మంత్రివర్గంలో మార్పులు అనేది జరిగితే మొదట వినిపించే పేరు సత్తుపల్లి శాసన సభ్యుడు సండ్ర వెంకటవీరయ్య . ఆయనకు గతంలోనే మంత్రివర్గంలో చోటు ఉంటుందని ప్రచారం జరిగింది. తెలుగుదేశం నుంచి ఆయన కేసీఆర్ పిలుపు మేరకు టీఆర్ యస్ లో చేరారు. మంత్రి పదవి ఆశించారు. సమీకరణలలో సాధ్యంకాలేదు. ఈ సారి ఎలాగైనా ఉంటుందని అంటున్నారు. ముఖ్యమంత్రిని తరచూ కలిసే ఎమ్మెల్యేలలో సండ్రదే అగ్రస్థానం అని ప్రగతి భవన్ వర్గాలు సైతం అంటాయి. తరచూ నియోజకవర్గ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు రావడం ఆయనతో పరిష్కరింప చేసుకోవటం చేస్తుంటారని పేరుంది. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తుపల్లి నుంచి టీఆర్ యస్ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి విజయంలో సండ్ర కీలకంగా వ్యవహరించారనే అభిప్రాయాలూ ఉన్నాయి. ఎమ్మెల్సీ గా ఎన్నికైన పల్లా సైతం వెంకటవీరయ్య విషయంలో సానుకూలంగా ఉన్నారని తెలుస్తుంది. ఇదే విషయం కేసీఆర్ కు తెలిపినట్లు సమాచారం . ఇప్పటికే కొన్ని ఉమ్మడి జిల్లాలో ఇద్దరు,ముగ్గురు మంత్రిలు ఉన్నారు. వైయస్ మంత్రివర్గంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఇద్దరు మంత్రిలు ఉన్న విషయం తెలిసిందే . ఒక్క ఖమ్మం నుంచే కాకుండా మహబూబ్ నగర్ , కరీంనగర్ జిల్లాల నుంచి మంత్రివర్గంలో మార్పులు ఉండే ఆవకాశం ఉండవచ్చునని తెలుస్తుంది. కేసీఆర్ మనసులో ఎవరు ఉన్నారు ఎవరెవరికి అవకాశం వస్తుంది. అనే వాటిపై పైకి చెప్పకపోయినా ఎమ్మెల్యేలలో గుసగుసలైతే ఉన్నాయి. నల్లగొండ జిల్లా నుంచి కూడా మంత్రివర్గంలో కొత్త వారికీ చోటు దక్కుతుందని ప్రచారం జరుగుతుంది. నల్లగొండ ఎమ్మెల్యే మంత్రి పదవిని ఆశిస్తున్నారు. అయితే గుత్తాసుఖేందర్ రెడ్డి కూడా ఎప్పటినుంచో మంత్రి కావాలనే కోరిక తో ఉన్నారు. ఆయన్ను కేసీఆర్ బలవంతంగా మండలి చైర్మన్ చేశారు. మండలి చైర్మన్ మరొకరికి ఇచ్చి ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకునే ఆవకాశాలు లేకపోలేదని టాక్ . ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్సీలు కాకుండా గత ఎన్నికల్లో ఓడిపోయినా కొందరు సీనియర్ నాయకులూ సైతం తమకు ప్రాధాన్యత కావాలని కోరుకుంటున్నారు.కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు ,పట్నం మహేందర్ రెడ్డి ,ఆదిలాబాద్ కు చెందిన జోగు రామన్న లాంటి వాళ్ళు క్రాస్ రోడ్డులో ఉన్నారు .వారి సేవలను ఏవిధంగా ఉపయొగించుకుంటారనే చర్చ జరుగుతుంది. కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేస్తారని ఆసందర్భంగా మంత్రివర్గంలో మార్పులు ఉంటాయని భావించారు. కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకునే ఆవకాశంలేదని ఆయనే పార్టీ సమావేశంలో స్వయంగా స్పష్టం చేసిన తరువాత కొంత కాలం చర్చకు ఫుల్ స్టాప్ పడినా తిరిగి మంత్రివర్గ మార్పులపై చర్చలు ప్రారంభం అయ్యాయి. మరి ఏమి జరుగుతుందో చూద్దాం

Related posts

రేవంత్ రెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌.. ధ‌ర‌ణి వ‌ల్లే రియ‌ల్ట‌ర్ల హ‌త్య‌!

Drukpadam

గవర్నర్ తమిళిసై సూపర్ సీఎం …మాజీ సీఎం నారాయణస్వామి తీవ్ర ఆరోపణలు!

Drukpadam

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సీబీఐకి బదిలీ… తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు!

Drukpadam

Leave a Comment