Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

తుమ్మల స్వభావానికి విరుద్ధంగా దూకుడుగా వెళుతున్నారా ?

తుమ్మల స్వభావానికి విరుద్ధంగా దూకుడుగా వెళుతున్నారా ?
-తొందరెందుకు పడుతున్నట్లు
-పాలేరు నుంచి పోటీచేస్తానని అంటున్న తుమ్మల వ్యూహాత్మకంగా వెళ్లకపోతే ఇబ్బందే
-కార్యకర్తల వత్తిడి మేరకు దూకుడు పెంచారా ?

సీనియర్ నాయకుడు మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల నేలకొండపల్లి మండలం చెరువుమాదారం లో జరిపిన పర్యటన వివాదాస్పదంగా మారింది. ఆయన పర్యటనపై ఎవరికీ అభ్యంతరాలు లేవు … ఆయన అక్కడ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన మాటలు కొందరికి ఇబ్బందిని కలిగించాయి . శత్రువులతో ఇబ్బందు ఉండదు కానీ , ద్రోవులతోనే జాగ్రత్తగా ఉండాలని అనడం సొంతపార్టీ లోని కొందరికి కంటగింపుగా మారింది . అసలు తుమ్మల తనస్వభావానికి విరుద్ధంగా అక్కడ వ్యవహరించారనే మాటలు వినబడుతున్నాయి. ఎదుటివారిని నొప్పించకుండా తాను అనుకున్నది సాధించే మనస్తత్వం ఉన్న తుమ్మల ఎందుకు దూకుడుగా వ్యవహరించారనేది ప్రస్నార్ధకమే ? ఆయన చేసిన వ్యాఖ్యలపై సొంతపార్టీలోనే మండల నాయకులు ఖండించడం ఆయన్ను మరింత నొప్పించి ఉంటుంది. రహస్య మీటింగ్ లు , పార్టీ ఏదైనా పోటీ ఖాయమని తుమ్మల అనుయాయులు చెప్పుకోవడం తుమ్మలకు లాభమా ? అనేది ఆలోచించుకోవాలి .

తుమ్మల ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన వ్యక్తి . ఎన్టీఆర్ క్యాబినెట్ లోను తరువాత చంద్రబాబు మంత్రివర్గంలో తిరుగులేని నేత . టీడీపీ అధికారం లో ఉండగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది.చిన్ననీటి పారుదల , భారీనీటిపారుదల , రోడ్లు భవనాలు , ఎక్సయిజ్ లాంటి అనేక కీలక శాఖలు నిర్వహించారు . తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తరువాత టీఆర్ యస్ లో చేరి కేసీఆర్ క్యాబినెట్ లో అత్యంత కీలకమైన రోడ్లు భవనాల శాఖను నిర్వహించారు . ఉమ్మడి రాష్ట్రంలో ప్రాజక్టులు వాటి స్థితి గతులను చెప్పగలిగిన అతికొద్ది మందిలో తుమ్మల ఒకరు . అదే విధంగా రోడ్ కనక్టవిటీ విషయంలో ఆయనకు అపారమైన నాలెడ్జి ఉంది.

అలాంటి తుమ్మల గత ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత, ఆయన నమ్మి వచ్చిన కేసీఆర్ దూరంగా పెట్టడం ఒకింత ఇబ్బంది పడుతున్నాడు . ఓటమికి కారణాలు సీఎం కు తెలిసినప్పటికీ తుమ్మల ఓడిపోవటంపై ఎందుకో అసంతృప్తిగా ఉన్నారు . పాలేరులో తుమ్మల మీద పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన కందాల ఉపేందర్ రెడ్డి టీఆర్ యస్ లో చేరడంతో పాలేరుపై తుమ్మలకు పట్టులేకుండా చేయాలనీ ప్రయత్నాలు జరిగాయి. అయితే తుమ్మల హయాంలో జరిగిన అభివృద్ధి ప్రజల్లో ఆయన పట్ల సానుభూతి ఉంది . తుమ్మలకు కేటీఆర్ తో అంతగా పొసగకపోవడం కూడా ఒక కారణమనే అభిప్రాయాలు ఉన్నాయి. ఒకసీనియర్ నాయకుడిగా , జిల్లా అభివృద్ధిలో ఆయన పాత్ర కాదనలేనిది . ఉమ్మడి జిల్లాలో తుమ్మల చేసిన అభివృద్ధి పనులు బహుశా మరెవరు చేసిఉండరు . తన కనుసైగలతో జిల్లా అభివృద్ధిని పరుగులు పెట్టించిన తుమ్మల , జిల్లాలోని అసెంబ్లీ సీట్లలో తాను ఎవరిని అనుకుంటే వారిని అభ్యర్థులుగా నిలబెట్టిన తుమ్మల, నేడు తన సీటుకోసం దేహి అని, అనాల్సి రావడం పై మదనపడుతున్నారు. తన రాజకీయ జీవితంలో చివరికంటా ఎదురు లేని నేతగా ఉండాలని అభిలషిస్తున్నారు. అందుకోసం ఆయన వయసు పైబడ్డ విజేతగా నిలవాలనే కోరికతో తాపత్రయ పడుతున్నారు . కార్యకర్తల కోరికమేరకు పర్యటనలు చేస్తున్నారు. పలువురు మిత్రులను పలకరిస్తున్నారు . ఒక్క పాలేరు లోనే కాకుండా జిల్లాలో కూడా తుమ్మల పలకరింపులు పర్యటనలు సాగుతున్నాయి.

Related posts

లఖీమ్ పూర్ వెళ్లతాము ….అరెస్టులకు బెదిరింపులకు భయపడం :రాహుల్ గాంధీ!

Drukpadam

అంపశయ్యమీద తెలంగాణ కాంగ్రెస్ !

Drukpadam

వైఎస్ ష‌ర్మిల సీఎం కావ‌డం ఖాయం: డి. శ్రీనివాస్‌

Drukpadam

Leave a Comment