Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

జాతరలో కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య చిందులు …

జాతరలో డ్యాన్స్ చేసిన కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య… 

  • సిద్ధరమణ హుండి సిద్ధరామయ్య స్వగ్రామం
  • సొంతూర్లో మూడ్రోజుల జాతర
  • చిన్ననాటి స్నేహితులతో కలిసి జానపద నృత్యం
  • వీడియోను పంచుకున్న సిద్ధరామయ్య తనయుడు

కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. మైసూరులోని సిద్ధరమణ హుండి సిద్ధరామయ్య స్వగ్రామం. కాగా, నిన్న సొంతూర్లో జరిగిన సిద్ధరామేశ్వర స్వామి జాతరకు ఈ కాంగ్రెస్ సీనియర్ నేత కూడా హాజరయ్యారు. అంతేకాదు, తన చిన్ననాటి స్నేహితులతో కలిసి జానపద నృత్యం చేశారు. కొందరు జానపద గీతాలు ఆలపిస్తుండగా, సిద్ధరామయ్య పంచె ఎగ్గట్టి మరీ డ్యాన్స్ చేశారు.

దీనికి సంబంధించిన వీడియోని సిద్ధరామయ్య కుమారుడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ యతీంద్ర సిద్ధరామయ్య ట్విట్టర్ లో పంచుకున్నారు. రాజకీయాల్లో ప్రత్యర్థులపై భీకరంగా విరుచుకుపడే సిద్ధరామయ్య… జాతరలో ఎంతో ఉత్సాహంగా జానపద నృత్యం చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు.

Related posts

ఆగస్టు 9న కాంగ్రెస్ పార్టీ ‘దళిత-గిరిజన దండోరా’: రేవంత్ రెడ్డి…

Drukpadam

అసెంబ్లీ అభ్యర్థులపై బీఆర్ యస్ లీకులు …కరీంనగర్ లోకసభకు అభ్యర్థిని ప్రకటించిన కేటీఆర్ …

Drukpadam

ఓవైసిలోనూ సామజిక కోణం …రాజకీయాల్లో సంపన్న కులాలే ఉండటంపై ఆక్షేపణ …

Drukpadam

Leave a Comment