Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

53 ప్రత్యేక మేజిస్ట్రేట్ కోర్టులను రద్దు- తెలంగాణ హైకోర్టు

  • హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 10 ఏళ్ల క్రితం కోర్టుల ఏర్పాటు
  • ఇటీవలే 15 శాశ్వత న్యాయస్థానాలు మంజూరు
  • దీంతో ప్రత్యేక కోర్టులను రద్దు చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ
TS High Court cancels special magistrate courts

తెలంగాణలోని ప్రత్యేక మేజిస్ట్రేట్ కోర్టులను రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 1 నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని తెలిపింది. హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల నేపథ్యంలో, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో ఉన్న 53 ప్రత్యేక కోర్టులు రద్దు కానున్నాయి. 10 ఏళ్ల క్రితం ఈ కోర్టులు ఏర్పాటయ్యాయి. చెక్ బౌన్స్ వివాదాలు, రెండేళ్లలోపు శిక్ష ఉండే కేసులను విచారించేందుకు ఈ కోర్టులను ఏర్పాటు చేశారు.

అయితే, రెండు జిల్లాలకు ఇటీవలే 15 శాశ్వత న్యాయస్థానాలు మంజూరయ్యాయి. దీంతో, ప్రత్యేక కోర్టులను హైకోర్టు రద్దు చేసింది. వీటిలో పని చేస్తున్న ఒప్పంద ఉద్యోగుల సేవలను ఇతర న్యాయస్థానాల్లో తాత్కాలిక ప్రతిపాదికన వినియోగించుకోవాలని ఉత్తర్వుల్లో హైకోర్టు పేర్కొంది.

Related posts

వాషింగ్టన్ పోస్ట్ ను విక్రయించనున్న జెఫ్ బెజోస్?

Drukpadam

మలబద్ధకం వేధిస్తుందా..? దాని వెనుక రిస్క్ ఉంది..!

Drukpadam

ఏపీలో 6 పార్టీలను జాబితా నుంచి తొలగించిన కేంద్ర ఎన్నికల సంఘం!

Drukpadam

Leave a Comment