Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పార్టీ పెట్టె ఆలోచన లేదు …సాగర్ లో పోటీచేయటం లేదు

పార్టీ పెట్టె ఆలోచన లేదు …సాగర్ లో పోటీచేయటం లేదు
-తీన్మార్ మల్లన్న టీం పేరుతొ సమావేశం
-6 వేల కీలోమీటర్ల పాదయాత్రే లక్ష్యం
– తన పోరాటం 45 కేజీలు ఉన్న కేసీఆర్ పై కాదు… ఆయన విధానాలపైనే
– ఎప్పుడు పదవులంటే తెలియని బడుగుల కోసం కొట్లాడతా
-అన్యాయాలను ఎదిరిస్తా … అందుకు ఎన్ని కష్టాలొచ్చినా భరిస్తా
-ఈటల తో కలసి పార్టీ పెడుతున్నట్లు జరుగుతున్నా ప్రచారం –అబద్దం
-కోట్లరూపాయలు వసూల్ చేయలేదు-ఓట్ల కోసం డబ్బులు పంచలేదు

నాగార్జున సాగర్ ఉపఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన కాని పార్టీ పెట్టాలనే ఆలోచన కాని లేదని తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు. సాగర్ లో అధికార టీఆర్ యస్ పార్టీ ఓటమే ధ్యేయంగా పనిచేస్తానని వెల్లడించారు. తీన్మార్ మల్లన్న టీం పేరుతో నిర్వించిన ఒక సమావేశంలో మాట్లాడుతూ తన భవిషత్ కార్యాచరణ ప్రకటించారు. తన టీం లు అన్ని జిల్లాల్లో,మండలంలో ఏర్పాటు చేస్తామని అని అన్నారు. టీంలు నిరంతరం ప్రజలను చెతన్యం చేస్తాయని అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో స్వల్పతేడాతో ఓడిన అనంతరం కొద్దీ రోజుల క్రితం ఆయన ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ తన ఓటమి, ఓటమి కాదని పల్లా గెలుపు గెలుపు కాదని పేర్కొన్నారు. పల్లా 150 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి పల్లా ఒడి గెలిచారు. ఇది అందరికి తెలిసిన బహిరంగ రహస్యమన్నారు. తాను పైసా ఖర్చుపెట్టకుండా గెలిచి ఓడనాన్నరు. ఎక్కడ డబ్బులు వసూల్ చేయలేదని డబ్బులు పంచలేదని అన్నారు .తన ఖర్చుల కోసం డబ్బులు ఇచ్చి ఓట్లు వేశారని అన్నారు. ఇక నుంచి తన పోరాటం అంతా ప్రభుత్వ ప్రజావ్యతిరేక విదానపైనే కానీ వ్యక్తులమీద కాదన్నారు.కేసీఆర్ 45 కేజీల బక్కపలచటి వ్యక్తిపై అసలు కాదని ఆయన బుర్రపై తనపోరాటమన్నారు. ప్రజలకు జరుగుతున్నా అన్యాలపై ప్రశ్నించటం మల్లన్న చేస్తాడనే నమ్మకం కలగబెట్టే తనకు అంతమంది ఓట్లు వేశారని అన్నారు. అందువల్ల తన యుద్ధం అయిపోలేదని ఇప్పుడే ప్రారంభం అయిందని పేర్కొన్నారు. ఏదైనా పార్టీలో చేరే ఆవకాశం ఉందా అనే ప్రశ్నకు అలాంటిది ఏమి లేదని ఏపార్టీ ఏమిటో ఎమ్మెల్సీ ఎన్నికల్లో తేలిపోయిందన్నారు. ప్రజలను చెతన్యవంతం చేయటమే తన ముందున్న కర్తవ్యం అన్నారు.అందుకోసం గతంలో ఎవరు చేయని విధంగా 6 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తానని అన్నారు . రాష్ట్రము అంత తిరుగుట ప్రజలను చెతన్య పరుస్తానన్నారు. నిరుదోగులకు ఉద్యోగాలు కల్పించటం లేదని కాకతీయ యూనివర్సిటీ కి చెందిన సునీల్ అనే విద్యార్ధి సంఘటన కలిచి వేసిందన్నారు. తనకు అనేక మంది పెద్దలు మద్దతు తెలుపుతున్నారని అన్నారు. అందరి ఆలోచనలకు అనుగుణంగా తన అడుగులు ఉంటాయని అన్నారు. తాను ఈటల రాజేందర్ తో కలిసి పార్టీ పెడుతున్నానని వస్తున్నా జరుగుతున్నా ప్రచారం ఒట్టిదేనన్నారు. ఇది కావాలని జరుగుతున్నా ప్రచారంగా కొట్టి పారేశారు. తీన్మార్ మల్లన్న టీం లు అన్ని జిల్లాలో ఉంటాయని అన్నారు.

 

Related posts

కేసీఆర్ ఔరంగజేబులా మారితే తెలంగాణలోనూ శివాజీలు పుట్టుకొస్తారు: బండి సంజయ్!

Drukpadam

రైతుల వద్ద కేంద్రం గురించి కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు: పియూష్ గోయల్…

Drukpadam

జగన్ తో విభేదించిన వారికి ఓటమి తప్పదు: మిథున్ రెడ్డి

Drukpadam

Leave a Comment