Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఏపీ హైకోర్టు సంచలన తీర్పు …8 ఐఏఎస్ లకు జైలు శిక్ష!

ఏపీ హైకోర్టు సంచలన తీర్పు …8 ఐఏఎస్ లకు జైలు శిక్ష!
కోర్టు ధిక్కరణ కింద జైలు శిక్ష విధించిన హైకోర్టు
హైకోర్టును క్షమాపణలు వేడుకున్న ఐఏఎస్ లు
జైలు శిక్షను తప్పించి సేవా కార్యక్రమాలకు ఆదేశం

ఏపీ హైకోర్టు ఈరోజు సంచలన తీర్పును వెలువరించింది. తమ ఆదేశాలను లెక్క చేయని ఐఏఎస్ అధికారులపై కన్నెర్ర చేసింది. ఏకంగా ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష, జరిమానా విధించింది. కోర్టు ధిక్కరణ కింద 2 వారాల జైలు శిక్ష విధించింది.

ఈ నేపథ్యంలో హైకోర్టును వీరు క్షమాపణలు కోరారు. దీంతో, వీరికి జైలు శిక్ష నుంచి విముక్తిని కలిగించిన న్యాయస్థానం… సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆదేశించింది. ఒక రోజు పాటు కోర్టు ఖర్చులు భరించాలని ఆదేశాలు జారీ చేసింది. సంక్షేమ హాస్టళ్లలో ఏడాది పాటు నెలలో ఒకరోజు సేవ చేయాలని ఆదేశించింది. జైలు శిక్షకు గురైన అధికారుల్లో గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్, రాజశేఖర్, చినవీరభద్రుడు, జె.శ్యామలరావు, విజయ్ కుమార్, ఎంఎం నాయక్, శ్రీలక్ష్మి ఉన్నారు.

Related posts

రూప కు 20 ఏళ్ళు సర్వీస్- 40 బదిలీలు

Drukpadam

మిజోరాం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ డిసెంబర్ 4కి వాయిదా.. కారణం ఇదే

Ram Narayana

ఢిల్లీ రైతు ఉద్యమం …ఒక పరిశీలన

Drukpadam

Leave a Comment