నిమ్మగడ్డవి శ్రీరంగనీతులు … మంత్రి పేర్ని నాని
కేసులు లేనప్పుడు ఎన్నికలలు ఆపి కేసులు పెరుగుతున్నప్పుడు ఎన్నికలు పెట్టారు
పరిషత్ ఎన్నికలపై గవర్నర్ కు నిమ్మగడ్డ లేఖ
బ్రహ్మచర్యంపై తిరుగుబోతు పుస్తకం రాసినట్టుందని ఎద్దేవా
చంద్రబాబు కనుసన్నల్లో పనిచేశారని ఆరోపణ
ఏపీ ఎన్నికల సంఘం కమిషనర్ గా పదవీ విరమణ చేస్తున్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పై మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన వైసీపీ పై ద్యేశం పెంచుకుని ప్రభుత్వాన్ని ఏమాత్రం సంప్రతించకుండా వ్యవహరించారని ధ్వజం . రాష్ట్రంలో పరిషత్ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని నిమ్మగడ్డ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు లేఖరాయడంపై పేర్ని నాని ఘాటుగా స్పందించారు. నిమ్మగడ్డ శ్రీరంగనీతుల లేఖ విడుదల చేశారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వంపై కావాలనే ఆయన అనేక నిందలు వేశారని చివరకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై కేంద్రానికి ఫిర్యాదు చేశారని మండిపడ్డరు. ఇది ఎలాంటి సంప్రదాయమని ప్రశ్నించారు. ఎన్నికలు పారదర్శకంగా జరపాలని గవర్నర్ కు లేఖ రాయడం అంటే శ్రీరంగనీతులు చెప్పటం మాత్రమే నని అన్నారు. ఇది హాస్యాస్పదంగాను , బ్రహ్మచర్యంపై ఓ తిరుగుబోతు పుస్తకం రాసినట్టుగా ఉందని విమర్శించారు. నిమ్మగడ్డ లేఖను చూస్తే చెప్పే మాటలకు, చేసే పనులకు ఏమాత్రం పొంతన కుదరడంలేదన్న విషయం అర్థమవుతుందని పేర్కొన్నారు.నిమ్మగడ్డ ఎవరి మెప్పుకోసం పనిచేశారో అందరికీ తెలుసని, బాబు కనుసన్నల్లోనే ఎన్నికలు నిర్వహించారని ఆరోపించారు. కరోనా కేసులు లేనప్పుడు ఎన్నికలు ఆపి, కేసులు వస్తున్నప్పుడు ఎన్నికలు జరిపారని మండిపడ్డారు. ప్రభుత్వం, అధికారులు , ఎన్నిరకాలుగా చెప్పిన వినిపించుకొని పెద్దమనిషి దిగిపోతూ నీతులు వల్లిచటం గురివింద సామెతగా ఉందని అన్నారు. ఎన్నికలు పారదర్శంగా జరపటం అంటే ఆయన పారదర్శంగా జరపలేదా? అని అన్నారు. ఎన్నికల కమిషనర్ కూడా రాజ్యాంగానికి లోబడే పని చేయాలనీ ఆయన తాను రాజ్యాంగ అతీతుణ్ణి అని అనుకున్నారని రాజకీయపార్టీ నాయకుడులాగ వ్యవహరించారని అన్నారు.