Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కమ్మోళ్లను హేళన చేస్తున్నారు…జగన్ పై రేణుకాచౌదరితీవ్ర   వ్యాఖ్యలు!

కమ్మోళ్లను హేళన చేస్తున్నారు…జగన్ పై రేణుకాచౌదరితీవ్ర   వ్యాఖ్యలు!
-జగన్ ప్రభుత్వం కమ్మ సామాజికవర్గాన్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తుందిని విమర్శ
-అమరావతిని కమ్మరావతిగా పేరు పెట్టాలని సవాల్
-మా కమ్మజాతిని తక్కువగా అంచనా వేయకండి
-రాష్ట్రం నిలబడాలంటే అన్ని కులాలు అవసరమే అని హితవు

ఏపీ కాబినెట్ లో కమ్మ సామాజికవర్గానికి స్టానం లేకపోవడంపై ఆ సామాజికవర్గంలోని పలువురు కమ్మనేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . జగన్ పై దుమ్మెత్తి పోస్తున్నారు . బుద్ది ఉంటె వైసీపీలో ఉన్న కమ్మవాళ్లంతా బయటకు రావాలని అంటున్నారు .నిన్నగాకమొన్న టీడీపీ నేత కాట్రగడ్డ ప్రసూన తిట్లు శాపనార్ధాలు పెట్టగా నేడు కాంగ్రెస్ నాయకురాలు మాజీ కేంద్రమంత్రి రేణుక చౌదరి జగన్ సర్కారుపై విరుచుకపడ్డారు .

ఏపీలో అమరావతి విషయంలో వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఇక్కడి కమ్మ సామాజిక వర్గంలో అసంతృప్తి ఉండనే ఉంది. అయితే తెలంగాణలో ఉన్న కమ్మ సామాజికవర్గ నేతల్లోనూ దీనిపై తీవ్ర అసంతృప్తి ఉన్నట్లు తాజాగా బయటపడింది. తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి కమ్మ సామాజికవర్గ సమ్మేళనంలో అమరావతి, సీఎం జగన్ పై చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.

నిజమాబాద్ లో నిర్వహించి కమ్మ సమ్మేళనంలో కాంగ్రెస్ మాజీ ఎంపీ రేణుకాచౌదరి సహా పలువురు కుల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీలో కమ్మ సామాజిక వర్గాన్ని అణగదొక్కేందుకు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను రేణుక సహా పలువురు నేతలు తప్పుబట్టారు. ఏపీలో కమ్మ సామాజిక వర్గాన్ని అణచివేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించిన రేణుకా చౌదరి.. అమరావతి కేంద్రంగా ఈ ప్రయత్నాలు జరగడంపై మండిపడ్డారు.

అమరావతిని కమ్మరావతిగా హేళన చేస్తున్న ఏపీ సీఎం జగన్.. చేతనైతే రాజధానికి కమ్మరావతిగా పేరు పెట్టాలని సవాల్ విసిరారు. అప్పుడు ఏం జరుగుతుందో చూడాలన్నారు. అమరావతి కమ్మ రాజధానిగా పేర్కొంటూ జగన్ తో పాటు వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యల్ని రేణుక తీవ్రంగా తప్పుబట్టారు. మమ్మల్ని తక్కువగా అంచనా వేయకండి అంటూ వైసీపీ ప్రభుత్వంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కమ్మ సామాజికవర్గం మంచితనాన్ని బలహీనతగా చూడకండని సీఎం జగన్ కు రేణుక చురకలు అంటించారు. రాష్ట్రం నిలబడాలంటే అన్ని కులాలు అవసరమేనన్నారు.

ఏపీలో వైసీపీ అదికారంలోకి వచ్చినప్పటి నుంచి కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన చంద్రబాబును, ఆయన కుమారుడు లోకేష్ ను, టీడీపీని వైసీపీ సర్కార్ టార్గెట్ చేయడంపై ఆయా నేతలు మండిపడుతున్నారు. ముఖ్యంగా అమరావతిని కమ్మరావతిగా పేర్కొంటూ వ్యాఖ్యలు చేయడంపై ఆ సామాజిక వర్గంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో రేణుకాచౌదరి వంటి కమ్మ సామాజిక వర్గ నేతలకు ఇతర నేతలు ఫిర్యాదులు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో రేణుక ఇవాళ సీఎం జగన్ ను నేరుగా సవాల్ చేశారు.

Related posts

పవన్ కళ్యాణ్ ఇజ్జత్ కా సవాల్ తిరుపతి ఉపఎన్నిక

Drukpadam

కాంగ్రెస్ వర్గాల్లో కొత్త ఉత్సాహం… కోమటిరెడ్డి నివాసానికి రేవంత్ రెడ్డి!

Drukpadam

ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై మండిపడ్డ చంద్రబాబు!

Drukpadam

Leave a Comment