కేటీఆర్ ఖమ్మం టూర్ మళ్ళీ వాయిదా- ఈసారి పక్కనా..?
బిజీ షడ్యులా? ఖమ్మం లో సంఘటనలా??
ఇప్పటికే మూడుసార్లు వాయిదా
రాష్ట్రమంత్రి కేటీఆర్ ఖమ్మం టూర్ మళ్ళీ వాయిదా పడింది… తిరిగి ఖమ్మం ఎప్పుడు వచ్చేది రెండుమూడు రోజుల్లో వెల్లడిస్తామని తెలిపారు .అయితే పక్కాగా ఉంటుందా మళ్ళీ వాయిదా పడుతుందా ? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఖమ్మంలో 60 కోట్ల రూపాయల తో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంఖుస్థాపన చేయాల్సి ఉంది. గతంలో ఒకసారి వస్తారన్న టూర్ వాయిదా పాడగా ఈ నెల 16 న రావాల్సి ఉంది. అనివార్య కారణాలవల్ల దాన్ని మార్చి 18 వతేది అన్నారు ఆ మేరకు ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేశారు . ఈ లోగా బీజేపీ కి చెందిన సాయి గణేష్ , ఆత్మహత్య చేసుకోవడం ఖమ్మంలో టీఆర్ యస్ , బీజేపీ లమధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడం, మంత్రి కేటీఆర్ కు ఇతర బిజీ కార్యక్రమాలు ఉండటంతో పర్యటన వాయిదా పడింది. ఈ నెల 27 న హైద్రాబాద్ లో టీఆర్ యస్ రాష్ట్ర ప్లీనరీ ఉండటం తో మరింత బిజీ అయిన కేటీఆర్ ఖమ్మం కు ప్లీనరీ తరువాత వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు .
టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్.. మంత్రి తారక రామారావు షెడ్యూల్ ప్రకారం రేపు (సోమవారం) అయన ఖమ్మంలో పర్యటించాల్సి ఉండగా.. దానిని వాయిదా వేసుకున్నారు. ఈ – కామర్స్ పైన ఏర్పాటు చేసిన పార్లమెంట్ కమిటీ సమావేశంతో పాటు, తెలంగాణ ప్రభుత్వ స్పేస్ టెక్ పాలసీ ఆవిష్కరణ కార్యక్రమాల నేపథ్యంలో ఖమ్మం పర్యటనను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఖమ్మంలో సాయి గణేష్ అనే బీజేపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేయడం.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందడం.. ఈ నేపథ్యంలో.. మంత్రి పువ్వాడ అజయ్, పోలీసులపై బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.
ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ- కామర్స్ పైన ఏర్పాటు చేసిన పార్లమెంట్ కమిటీ సమావేశం పాటు, తెలంగాణ ప్రభుత్వ స్పేస్ టెక్ పాలసీ ఆవిష్కరణ కార్యక్రమాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ఒకటి, రెండు రోజుల్లో కేటీఆర్ ఖమ్మం పర్యటన ఉంటుందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఇదే సమయంలో మంత్రి కేటీఆర్ హైటెక్స్‌లో నిర్వహించనున్న టీఆర్ఎస్ ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించారు. తెలంగాణ ఆత్మగౌరవం, అస్థిత్వానికి ప్రతీకగా టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తామన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 21 ఏండ్లు పూర్తయిన సందర్భంగా, హెచ్ఐఐసీలో ప్రతినిధుల మహాసభ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు కేటీఆర్ పేర్కొన్నారు.
రేపు (సోమవారం) మధ్యాహ్నం జీహెచ్ఎంసీ నాయకులతో సమావేశం నిర్వహిస్తామని..ప్లీనరీ నిర్వహణా ఏర్పాట్లు పైన చర్చిస్తామని చెప్పారు. ఆవిర్భావ దినోత్సవానికి 3 వేల మంది హాజరు కానున్నట్లు వెల్లడించారు. ఆహ్వానాలు అందినవారే సభకు రావాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. సభకు వచ్చే వారికి పాసులు జారీ చేస్తామని కేటీఆర్ చెప్పుకొచ్చారు. నిర్వహిస్తామన్నారు. గ్రామ శాఖల అధ్యక్షులు టీఆర్ఎస్ జెండాలను ఆవిష్కరించాలని నిర్దేశించారు. 3,600 చోట్ల పట్టణాల్లో జెండా ఆవిష్కరణ చేయాలని కేటీఆర్ సూచించారు.