Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

ఢిల్లీలో పెరుగుతున్న కరోనా కేసులు.. మాస్క్ ధరించకుంటే జరిమానా!

ఢిల్లీలో పెరుగుతున్న కరోనా కేసులు.. మాస్క్ ధరించకుంటే జరిమానా!

  • మాస్క్ ధరించకుంటే రూ. 500 జరిమానా
  • పాఠశాలలను మూసివేయబోమన్న డీడీఎంఏ
  • పెరుగుతున్న ఆర్-వేల్యూ

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. మాస్క్ ధరించడాన్ని మళ్లీ తప్పనిసరి చేసింది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నిన్న సమావేశమైన ఢిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ (డీడీఎంఏ) మాస్క్ ధరించని వారికి రూ. 500 జరిమానా విధించాలని నిర్ణయించింది. కేసులు పెరుగుతున్నప్పటికీ పాఠశాలలను మూసివేయబోమని స్పష్టం చేసింది. కాగా, నిన్న 2,067 కొత్త కేసులు, 40 మరణాలు నమోదయ్యాయి.

కొత్త కేసుల్లో అత్యధికభాగం హర్యానా, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, మిజోరంలలోనే బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలన్నీ అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ లేఖ రాశారు. మరోవైపు, గత మూడు నెలలుగా దేశంలో 1కి దిగువనే ఉన్న ఆర్-వేల్యూ ఈ నెల 12-18తో ముగిసిన వారంలో 1.07కు పెరగడం యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయని చెప్పేందుకు సంకేతమని చెన్నైకి చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేథమెటికల్ సైన్సెస్ తెలిపింది.

Related posts

జర్నలిస్టులను కూడా ఫ్రంట్‌లైన్‌ వర్కర్లుగా గుర్తిస్తున్నాం:కేంద్రం

Drukpadam

మహారాష్ట్రలో ఆసుపత్రి ఐసీయూలో మంటలు.. 13 మంది సజీవ దహనం

Drukpadam

ఇజ్రాయెల్ లో కొత్త వైరస్ కలకలం.. తొలి ‘ఫ్లోరోనా’ కేసు నమోదు!

Drukpadam

Leave a Comment