Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

టీడీపీ అధినేత చంద్రబాబుకు నోటీసులు పంపిన రాష్ట్ర మహిళా కమిషన్

టీడీపీ అధినేత చంద్రబాబుకు నోటీసులు పంపిన రాష్ట్ర మహిళా కమిషన్

  • విజయవాడలో మానసిక వికలాంగురాలిపై ఘాతుకం
  • పరామర్శించేందుకు వెళ్లిన చంద్రబాబు
  • వాసిరెడ్డి పద్మతో వాగ్యుద్ధం
  • తన గౌరవానికి భంగం కలిగించారన్న పద్మ
  • వ్యక్తిగతంగా విచారణకు రావాలని నోటీసులు

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇవాళ విజయవాడలో అత్యాచార బాధితురాలిని పరామర్శించిన సందర్భంగా, అక్కడే ఉన్న రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మతో తీవ్ర వాగ్యుద్ధానికి దిగడం తెలిసిందే. ఈ ఘటనను వాసిరెడ్డి పద్మ తీవ్రంగా పరిగణించారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు మహిళా కమిషన్ చైర్ పర్సన్ హోదాలో నోటీసులు పంపారు.

విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో అత్యాచార బాధితురాలని పరామర్శించేందుకు వెళ్లిన తన గౌరవానికి భంగం కలిగించే విధంగా చంద్రబాబు ప్రవర్తించారని ఆరోపించారు. తన పట్ల అవమానకర రీతిలో వ్యవహరించారని పేర్కొన్నారు. ఈ నెల 27వ తేదీ ఉదయం 11 గంటలకు మహిళా కమిషన్ ఎదుట చంద్రబాబు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో స్పష్టం చేశారు.

అటు, టీడీపీ నేత బోండా ఉమకు కూడా మహిళా కమిషన్ నుంచి ఇవే తరహాలో నోటీసులు అందాయి. ఆయనను కూడా ఈ నెల 27న మంగళగిరిలోని రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయానికి వ్యక్తిగతంగా రావాలని ఆదేశించారు.

Related posts

పాక్ ప్రధాని ఇమ్రాన్ కు రాజీనామా తప్ప మరో మార్గం లేదు…

Drukpadam

ఊపిరితీస్తున్న ‘వాయు కాలుష్యం’!

Drukpadam

నేడు టీడీపీ 41వ ఆవిర్భావ దినోత్సవం..

Drukpadam

Leave a Comment