Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

లోకేష్ అబద్దాలు మాట్లాడుతున్నావ్ … క్షమాపణలు చెప్పు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి

లోకేష్ అబద్దాలు మాట్లాడుతున్నావ్ … క్షమాపణలు చెప్పు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి
పుదుచ్చేరి బీజేపీ మ్యానిఫెస్టో లో ప్రత్యేక హోదా అంశంలేదు
మ్యానిఫెస్టో ఇంగ్లీష్ లో ,పబ్లిక్ డొమైన్ లో ఉంది చూసుకో
-తెలుసుకోకుండా మాట్లాడుకు మరింత దిగజారి పోతావ్
-తిరుపతి లో ఓటమి తప్పదని అసంబద్ధ ప్రేలాపనలు
-బీజేపీ అభ్యర్థి రత్నప్రభ పై ఎలాంటి కేసులు లేవు 
లోకేష్ అబద్దాలు మాటాడుతున్నావ్ … క్షమాపణలు చెప్పు …పుదుచ్చేరి లో మా మ్యానిఫెస్టో పై తప్పుడు ప్రచారం మానుకో … అని ఏపీ రాష్ట్ర బీజేపీ ప్రధానకార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. పుదుచ్చేరి బీజేపీ మ్యానిఫెస్టో లో ఎలాంటి ప్రత్యేక హోదా అంశంలేదని ఆయన స్పష్టం చేశారు. మా పార్టీ మ్యానిఫెస్టో ఇంగ్లీష్ ,తమిళంలో ఉంది. కావాలంటే చదువుకో , అమెరికా లో మంచి యూనివర్సిటీ లో చదివి వచ్చావ్ అనుకున్నాను. కాని అది తప్పుడు ప్రచారాలకు కోసం అమెరికా దాక వెళ్లినట్లు ఇప్పుడు తెలిసిందని దుయ్యబట్టారు. బీజేపీపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్న నారా లోకేష్ అబద్దాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. మ్యానిఫెస్టో గురించి తేలుసుకోకుండా మాట్లాడుతున్న నారా లోకేష్ బీజేపీ కి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తిరుపతి లో ఓటమి తప్పదని గ్రహించి అసంబద్ధ ప్రేలాపనలు పేలుతున్నారని ధ్వజంమెత్తారు. లోకేష్ అమెరికాలో ఉన్నత చదువులు చదివినందున ఆయనకు ఇంగ్లీష్ తెలుసనీ అనుకున్నానని మరి తెలిసి మాట్లాడితే అబద్దాలు .భాష తెలవకపోతే అజ్ఞానమోతుందని అన్నారు. ఆయన ఏ కోవకు చెందిన వారనేది ప్రజలే నిర్ణయించాలని అన్నారు. తెలుగుదేశం పార్టీని ప్రజలు నమ్మటంలేదని వారి మోసాలను ఆంధ్రప్రదేశ్ ప్రజలు గ్రావించబట్టే బుద్ది చెప్పిన విషయాన్నీ ఇంతతొందరగా మర్చిపోతే ఎలాగని అన్నారు.
తిరుపతి లో బీజేపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న రిటైర్డ్ కర్ణాటక చీఫ్ సెక్రటరీ రత్నప్రభ పై ఎలాంటి c కేసులు లేవని అన్నారు. తెలుగుదేశం కు ప్రజలు ఓటేసే పరిస్థితి లేదని అందువల్ల వారు దిగజారుడు జాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.

Related posts

కెన్యాలో దారుణం.. మతపెద్ద సూచనతో కఠిన ఉపవాసం చేసి 47 మంది మృతి!

Drukpadam

కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసన…రేపు మౌనదీక్ష చేపట్టనున్న బండి సంజయ్!

Drukpadam

మహారాష్ట్రలో ప్రభుత్వానికి ఢోకాలేదు … శరద్ పవార్…

Drukpadam

Leave a Comment