ఈ నెల 25 నుండి 27వరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మథురలో జరగనున్న ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(IJU) జాతీయ కార్యవర్గ సమావేశాలకు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(TUWJ)
ప్రతినిధి బృందం ఇవ్వాళ ఉదయం తెలంగాణ ఎక్స్ ప్రెస్ రైలులో లో బయలు దేరింది. ఐజేయూ జాతీయ అధ్యక్షులు కె.శ్రీనివాస్ రెడ్డి, టీయుడబ్ల్యుజె రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నగునూరి శేఖర్, కె.విరాహత్ అలీ, ఐజేయూ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు దాసరి కృష్ణారెడ్డి, ఆలపాటి సురేష్, రాంనారాయణలు మథురకు బయలుదేరిన ప్రతినిధి బృందంలో వున్నారు. మథురలో జరిగే సమావేశాల్లో దేశంలో జర్నలిస్ట్ లు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తారు. ఈ సమావేశాలకు దేశంలోని 24 రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటారు.