Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

అజయ్ కు బీసీ సంఘాల తరపున గాయత్రి రవి మద్దతు!

ఇటీవల బీజేపీ కార్యకర్త ఖమ్మంలో ఆత్మహత్య చేసుకోవడం అది మంత్రి అజయ్ వత్తిడి వల్లనే పోలీసుల వేదింపులు తాళలేక చనిపోయాడని అందుకు మంత్రిపై కేసు నమోదు చేయాలని, ఆయన్ను మంత్రివర్గం నుంచి తొలగించాలనే డిమాండ్స్ నేపద్యంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వద్దిరాజు రవిచంద్ర స్పందించరు.గణేశ్ ఆత్మహత్య దురదృష్టకరం. దాన్ని ఎవరు సమర్ధించటంలేదు. దానికి మంత్రి పువ్వాడ అజయ్ ని నిందించడం సమంజసం కాదని అన్నారు. దానికి అజయ్ కు ఏమి సంబంధం అని వద్దిరాజు ప్రశ్నించారు.బీసీ సంఘాల తరుపున అజయ్ కి మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు

అభ్యుదయ భావాల వేదిక ఖమ్మం.. ఇక్కడ మతోన్మాద పార్టీలకు స్థానం లేదని స్పష్టం చేశారు.

మతాలు, కులాల మధ్య చిచ్చు రగిల్చి.. లబ్ధి పొందాలనుకునే వారిని జిల్లా ప్రజలు సహించరని బీజేపీకి చురకలంటించారు.

బీజేపీ కార్యకర్త చనిపోవడం బాధాకరం.. కేసులున్నాయని ఆత్మహత్య చేసుకోవడం సరికాదు.. న్యాయ పరంగా కేసులు ఎదుర్కోవాలే తప్ప చావు పరిష్కారం కాదు.

కేసులు ప్రతి ఒక్కరి మీద ఉన్నాయి.. తెలంగాణ ఉద్యమకారులందరిపై పదుల సంఖ్యలో కేసులు ఉన్నాయి. అంత మాత్రాన అందరూ ఆత్మహత్యలు చేసుకోలేదు.

తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత ఖమ్మం అదే స్థాయిలో అభివృద్ధి పుంతలు తొక్కుతోంది.

మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నాయకత్వంలో ఖమ్మం జిల్లా బంగారు తెలంగాణ లో భాగస్వామ్యం అవుతోందని అన్నారు.

మంత్రి అజయ్ కుమార్ కు బీసీ సంఘాల తరపున సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని రవి పేర్కొన్నారు.

Related posts

VR Health Group Is Rating How Many Calories Games Burn

Drukpadam

భద్రాచలంలో వరద భాదితుల ఆందోళన ..తమకు కరకట్ట నిర్మించాలని డిమాండ్!

Drukpadam

అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు… మానవ రహిత నౌకను పంపిన రష్యా!

Drukpadam

Leave a Comment