జగన్ బెయిల్ రద్దు … చంద్రబాబు జైలుకే
బీజేపీనేత సంచలన వ్యాఖ్యలు
తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికలు వైసీపీ ,బీజేపీ మధ్య మాటల యుద్దాన్ని పెంచుతున్నాయి.ప్రత్యేక హోదా ,విశాఖ ఉక్కుపై వస్తున్నా విమర్శలను పక్కదార్లు పట్టించేందుకు బీజేపీ కొత్త దార్లు వెతుక్కుంటుంది.బీజేపీ ఏపీ ఇంచార్జి సునీల్ దేవర ముఖ్యమంత్రి జగన్ పైన ,ప్రతిపక్ష నేత చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ బెయిల్ రద్దు అవుతుందని , చంద్రబాబు స్టే లతో ఉంటున్నారని అందువల్ల ఆయన స్టేలు తొలిగిపోయి జైలుకు వెళ్లడం ఖాయం అను పేర్కొన్నారు. జగన్ జైలుకు వెళ్ళటం , చంద్రబాబు జైలుకు వెళ్ళటం బీజేపీ కోరిక కావచ్చు కానీ దానికి కొన్ని నిభందనలు ఉన్నాయి. స్టే అనేది బీజేపీ దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉండదు అది చట్టాలకు లోబడే ఉంటుందని తెలుగుదేశం వర్గాలు పేర్కొంటున్నాయి. తమకు అనుకూలంగా ఉంటె ఒకరంగా లేకపోతె మరోరకంగా బీజేపీ వ్యవహరించటం పై విమర్శలు వెళ్ళుఎత్తుతున్నాయి. ఎన్నికల్లో ఏమి చెప్పాలో తెలియక బీజేపీ నాయకులూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని వైసీపీ నేతలు ధ్వజమెత్తారు. తిరుపతిలో బీజేపీ అభ్యర్థి స్పందన కరువైందని అందువల్లనే వారికీ ఏమి మాట్లాడాలో అర్థం కావడంలేదని అంటున్నారు.
previous post