Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

ఢిల్లీ లో కారుపై దుండగుల కాల్పులు …అన్నదమ్ములకు సీరియస్!

ఢిల్లీ లో కారుపై దుండగుల కాల్పులు …అన్నదమ్ములకు సీరియస్!
-బిజీ రోడ్డులో జనం చూస్తుండగానే ఘటన
-వెనక్కు తిరిగి వెళ్లిపోయిన వాహనదారులు..
-ఢిల్లీలోని సుభాష్ నగర్ లో ఘటన
-అన్నాదమ్ములిద్దరికి తీవ్రగాయాలు
-వారి పరిస్థితి విషమం

దేశరాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకున్నది. నడిరోడ్డుపై జనం అంత చూస్తుండగానే గుర్తు తెలియని దుండగలు కారుపై కాల్పులు జరిపారు . దీనితో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అన్నదమ్ములకు బుల్లెట్ గాయాలు అయ్యాయి. వారిని దగ్గరలోని ఒక ఆసుపత్రికి తరలించారు . వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది.

చుట్టూ జనం.. వచ్చిపోయే వాహనాలతో బిజీబిజీగా రోడ్డు.. అందరి కళ్ల ముందే ఓ కారుపై ముగ్గురు దుండగులు కాల్పులు జరిపారు. కానీ, ఏ ఒక్కరూ స్పందించలేదు. ఆపే ప్రయత్నం చేయలేదు. ఈ షాకింగ్ ఘటన ఢిల్లీలోని సుభాష్ నగర్ లో నిన్న రాత్రి జరిగింది. కాల్పుల్లో ఇద్దరు అన్నాదమ్ములు తీవ్రంగా గాయపడ్డారు.

ఘటన గురించి స్థానికులు ఇచ్చిన సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు.. కాల్పుల్లో గాయపడిన బాధితులను కేశోపూర్ మండి మాజీ చైర్మన్ అజయ్ చౌదరీ, అతడి సోదరుడు జస్సా చౌదరీగా గుర్తించారు. ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. తీహార్ గ్రామంలో అజయ్ చౌదరీ నివసిస్తూ ఉంటారని, ఆసుపత్రిలో ఉన్న బంధువులను చూసి వచ్చేందుకు తన తమ్ముడితో కలిసి కారులో వెళుతుండగా దుండగులు 10 రౌండ్ల కాల్పులు జరిపారని పోలీసులు చెప్పారు.

పరారైన నిందితుల కోసం గాలిస్తున్నామని, వారు దొరికాక కాల్పులకు గల కారణాలను వెల్లడిస్తామని చెప్పారు. ఘటన నేపథ్యంలో సుభాష్ నగర్ ప్రాంతంలో భారీగా పోలీసులను మోహరించారు. మరోవైపు ఘటన జరుగుతున్న సమయంలో వాహనదారులు అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. ఎక్కడో దూరం నుంచే యూ టర్న్ తీసుకుని వెనక్కు వెళ్లిపోవడం వీడియోలో కనిపించింది.

Related posts

జంగారెడ్డిగూడెంలో ఘోర బస్సు ప్రమాదం.. 9 మంది మృతి!

Drukpadam

నరసరావుపేటలో సాఫ్ట్ వేర్ ఉద్యోగినిని బెదిరించి రూ.11 లక్షలు వసూలు…

Ram Narayana

కంపెనీ డబ్బుతో భార్యకు శాండ్విచ్ కొనిచ్చి ఉద్యోగం పోగొట్టుకున్న వ్యక్తి!

Ram Narayana

Leave a Comment