Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

సమస్యలు పరిష్కారం కాకపోతే ప్రజా ఆగ్రహం తప్పదు… వై విక్రమ్

సమస్యలు పరిష్కారం కాకపోతే ప్రజా ఆగ్రహం తప్పదు… వై విక్రమ్
-కార్పొరేషన్ ముందు భారీ ధర్నా నిర్వహించిన ప్రజా సంఘాలు..
-రోడ్ మీద నాలుగు పూల కుండీలు పెడితే అభివృద్ధా ?
-మౌలిక సమస్యలు పరిస్కారం లో ప్రభుత్వం విఫలం

ఖమ్మం నియోజకవర్గంలో ప్రజలకు కావలసిన మౌలిక సౌకర్యాలు కల్పించకపోతే టీఆర్ యస్ ప్రజా ప్రతినిధులు ప్రజా ఆగ్రహానికి గురి కాకతప్పదు అని సీటు జిల్లా నాయకులు వై విక్రమ్ హెచ్చరించారు. సీటు , ఐద్వా, డైఫీ, కెవిపిఎస్ , ఆవాజ్, ఎం పి ఆర్ డి , ఆధ్వర్యంలో గురువారం ప్రజా సమస్యలపై భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డబుల్ బెడ్ రూం ఇళ్ళు, పెన్షన్ లు, రేషన్ కార్డులు తదితర స్ధానిక సమస్యలు పరిష్కారం చేయడంలో టీఆర్ యస్ పాలకవర్గం విఫలం అయింది అని విమర్శించారు. రోడ్ మీద నాలుగు పూలు కుండీలు పెట్టి ఖమ్మం అభివృద్ధి అయిందని తెరాస ప్రజా ప్రతినిధులు ప్రకటనలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయకుండా గోడల మీద బొమ్మలు వేస్తే ప్రజల కడుపు నిండదని విమర్శించారు.మామిళ్ళగూడెం సారధి నగర్ అండర్ బ్రిడ్జి సమస్య పరిష్కారం చేయడంలో తెరాస జిల్లా మంత్రి విఫలం చెందారని విమర్శించారు. డిపో రోడ్, ఎన్ ఎస్ టి రోడ్ వెడల్పుకు నిధులు మంజూరు చేయకుండా, నగరంలో ఒకే ఒక్క ప్రాంతంలో చుట్టూ అభివృద్ధి చేస్తున్నారు అని విమర్శించారు. రమణగుట్ట, రాపర్తి నగర్ ప్రాంతంలో రోడ్లు, డ్రైనేజీ లేక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు అని తెలిపారు. వెంటనే ప్రజా సమస్యలు పరిష్కారం కాకపోతే త్వరలో కార్పొరేషన్ కార్యాలయం ముట్టడి చేస్తామని అక్కడే వంట వార్పూ పెడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బోడపట్ల సుదర్శన్, ఎన్ మనోహర్, ఎస్ కె మీరా సాహిబ్, ఎం ఏ జబ్బార్,ఆర్ ప్రకాష్, డి తిరుపతిరావు, యస్ నవీన్ రెడ్డి, భుక్యా ఉపేంద్ర, ఎం డి గౌస్ సిహెచ్ భద్రం , రమేష్, డి నాగరాజు, హుస్సేన్, ఎన్ కుమారి, పావని, బీబీ,బుర్రి శోభా, సాగర్, యేటా రాజేష్, కె రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Related posts

“ఇక చీపురుకట్టలపై ఎగురుతూ వెళతారు”…రష్యా వ్యంగ్యం

Drukpadam

గద్వాల పర్యటనలో మంత్రి జూపల్లి కృష్ణా రావు కాన్వాయ్‌పై రాళ్లదాడి?

Ram Narayana

ఇతరులతో పోల్చితే బీసీల్లో ఐక్యత తక్కువ: పవన్ కల్యాణ్

Drukpadam

Leave a Comment