Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

సమాజం పట్ల నిబద్ధతగా పని చేసిన మహనీయుడు సురవరం

మాట్లాడుతున్న తెలంగాణ సీఎం ఓఎస్.డి ప్రముఖ రచయిత దేశపతి శ్రీనివాస్

సమాజం పట్ల నిబద్ధతగా పని చేసిన మహనీయుడు సురవరం
గోల్కొండ పత్రిక పునరాగమణం అవసం ఎంతైన వుంది
సురవరం పరిశోధనలను కనీసం వ్యక్తికరించలేం
నేటి సమాజంలో పత్రికలు అపహాస్యం పాలయ్యాయి
సురవరం 125వ జయంతి ఉత్సవాలలో వక్తలు
సమాజంలో ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై నిబద్దతో పనిచేసిన మహనీయుడు సురవరం ప్రతాపరెడ్డి అని తెలంగాణ సీఎం ఓఎస్.డి ప్రముఖ రచయిత దేశపతి శ్రీనివాస్ అన్నారు. అయన 125వ జయంతిని తెలుగు జాతీ మొత్తం కూడా మహోత్సవంగా జరుపుకోవాల్సిన అవసరం ఎంతైన వుందని పేర్కొన్నారు. అతితక్కువ వ్యవధిలోనే ఎక్కువ విస్తర్ణంలో పనిచేసి సమాజానికి కావాల్సిన అనేక విషయాలను వెలుగులోకి తీసుకువచ్చారని కొనియాడ్డారు. జిల్లా పరిషత్ పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన సురవరం ప్రతాపరెడ్డి 125వ జయంతి మహోత్సవాలలో భాగంగా టియూడబ్ల్యుజె, మీడియా ఎడ్యూకేషన్ ఫౌండేషన్ ఇండియా, సురవరం సాహిత్య వైజయంతి ట్రస్ట్, సరుపద పరిషత్ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ జిల్లాలో నిర్వహించిన కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ అధ్యక్షత వహించగా తెలంగాణ రాష్ట్ర సమాచార శాఖ కమీషనర్ కట్టా శేఖర్ రెడ్డి, మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ చైర్మన్ స్వర్ణసుధాకర్ రెడ్డి, శాంతనారాయణ ట్రస్ట్ చైర్మన్ శ్రీహిత, టియూడబ్ల్యూజె రాష్ట్ర కార్యదర్శి విరాహత్ ఆలీ, ఐజెయు కార్యదర్శి వై.నరెందర్ రెడ్డి, మహబూబ్ నగర్ జిల్లా అధనపు కలెక్టర్ సీతారామయ్య, జయంతి ఉత్సవాల కమిటీ సభ్యురాలు సురవరం పుష్పలత తదితరులు పాల్గొని ప్రసంగించారు. అంతకుముందు సురవరం ప్రతాపరెడ్డి చిత్రపట్టానికి పూలమాలలు వేసి నివాళ్ళు అర్పించారు.

మాట్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్


ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ తెలంగాణ జాతీ పునర్ నిర్మాణానికి, అస్తిత్వం కోసం సురవరం తీవ్రంగా పరితపించారని అన్నారు. నేడు రచయితలు, సామాజిక వైతాళికుల పట్ల అంత సామాజిక స్ర్పూహ కరువు అయ్యిందని, వారికి దక్కాల్సిన గౌరవం దక్కడం లేదని దేశపతి అవేధన వ్యక్తం చేశారు. అధునిక యుగంలో పెద్ద ప్రచార సాధనంగా పత్రికలు వున్నాయని, కాని నాడు స్వాతంత్ర్యోద్యమం సంస్కరణలుగా పత్రికలు వచ్చాయన్నారు. నాడు గాంధీ, నెహ్రు రాజకీయ నాయకులుగానే కాకుండా రచయితలుగా మెలిగారని, గాంధీజీ 60వేల సాహిత్యం వ్రాశారని అది సాహిత్యం పట్ల అయనకు వున్న నిబద్ధత అన్నారు. స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో సాంఘిక విప్లవంగా సాధనంగా పత్రికలు నడిపిన ఘనత సురవరంకే దక్కుతుందని, తెలంగాణ చరిత్రను పరిశీలిస్తే ఆయన ఒక్క విశ్వరూపంగా కనిపిస్తారని చెపుకొచ్చారు. చదువుకోవడమే కష్టంగా వున్న రోజుల్లో బహుబాషలలో ప్రావిణ్యం సాధించారంటే అయనకు చేసే ప్రతి పనిలో వున్న చిత్తశుద్దిని చెప్పకనే చెబుతుందన్నారు. నిజాం కాలంలో మన ప్రాథమిక హక్కులను సైతం కాలవ్రాయడమే కాకుండా చదువు, విద్యతో పాటు చివరకు తెలుగు మాట్లాడే అవకాశం కూడా లేకుండా పోయిందన్నారు. అలాంటి సమయంలో సురవరం 700 వ్యాసాలు వ్రాశారంటే అయన ఎన్ని కోణాలను అలోచించి ఈ వ్యాసాలు వ్రాసారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదన్నారు. కొత్తాల్ వెంకట్రాంరెడ్డి సహకారంతో సురవరం మరింత చైతన్య కార్య్రకమాలు నిర్వహించారని, ముఖ్యంగా కేవలం సురవం కోసమే నాడు వెంకట్రాంరెడ్డి గొల్కోండ పత్రికను స్థాపించడం జరిగిందన్నారు. ఎలాంటి లాభాపేక్ష లేనందునే ఆ పత్రిక ప్రజల పత్రికగా గొంతుకగా మారిందన్నారు. సురవరం చేసిన పరిశోధనలను మనం కనీసం వ్యక్తికరించలేని పరిస్థితి వుందంటే అయన గొప్పగా ధైర్యంగా వాటిని వ్రాశారో ఆర్థం చేసుకోవాలన్నారు. ముఖ్యంగా రామాయణం పై అయన విశ్లేషణ చేడమే కాకుండా అందులో వున్న దురాచారాలను సైతం ఎత్తిచూపారన్నారు. ఎన్ని విమర్శలు వచ్చిన వాటిని ఎదుర్కొంటూ ఏ రచన పైన అయిన సద్ విమర్శ లెనపుడు అది వెలుగులోకి రాదని చెప్పారని పేర్కొన్నారు. అయన పత్రికను వ్రుత్తిగా కాకుండా ప్రేమించారని అందుకే గొల్కోండ పత్రికకు ఎంతమంది సంపాదకులుగా పనిచేసినా కూడా ఎన్ని పత్రికలు వచ్చినా కూడా సురవరం ప్రతాపరెడ్డి పేరు గొల్కోండ పత్రిక పేరు చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. గొల్కోండ పత్రికను తిరిగి ప్రజలకు పరిచయం చేయాల్సిన అవశ్యకత ఎంతైన వుందని ఇలా చేయడం వల్ల సురవరం పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. అయితే దీని వ్యక్తుల సహకారంతో కాకుండా అయన అశయాలకు, విలువలకు అనుగూణంగా ప్రజల సహకారంతో ప్రజలకు అందిస్తేనే దాని నిస్పక్షపాతంగా రాజకీయాలకు అతీతంగా నడిపే అవకాశం వుందన్నారు. హక్కులను ప్రశ్నించిన వారే గొప్ప సంపాదకులుగా నిలుస్తారని సురవరం నిరూపించారని, ఏదైన పత్రిక నిలబడాలంటే వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైన వుంటుందన్నారు. ప్రస్తుతం చాలా పత్రికలు వున్నప్పటికీ నిజాలు మాత్రం నిర్భయంగా బయటకు వచ్చే పరిస్థితి లేకుండా పోయిందంటే పత్రికలు ఎలా పనిచేస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదన్నారు. నేడు పత్రికా రంగంలో 70శాతం విలువలు పతనం అయ్యాయని వారు అవేధన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా కారణంగా ఇంకా కొంతైన నిజాలు భయటకు వస్తున్నాయని అయితే అందులో కూడా కొంత అసత్య ప్రచారాలు జరగడం కారణంగా కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్పారు. సామాజిక మాధ్యమాల వల్ల లాభనష్టాలు రెండు వున్నాయని కావున ప్రస్తుతం ప్రజలు కూడా పత్రిక స్వేచ్చ, భావ ప్రకటన స్వేచ్చను కోరుకుంటున్నారని అందుకు తగిన వేధిక అవసరం ఎంతైన వుందన్నారు. తమ చుట్టు జరుగుతున్న వాస్తవాలను తెలుసుకోవాలనే కుతూహలం ప్రజల్లో వున్న వాటిని తెలియచేసే సరైన వేధిక మాత్రం కరువైందన్నారు. అయన ఒక్క అగ్రకులస్థుడైనప్పటికీ వివిధ కుల సంఘాలకు అధ్యక్షునిగా పనిచేసి వారిని సంఘటితం చేశారని, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి అయన నాంధి పలికారని గుర్తు చేసుకున్నారు. మీడియా అనేది స్వతంత్ర్యంగా పనిచేడం వల్లే ప్రయోజనం వుంటుంది తప్ప రాజకీయ శక్తుల ఓత్తడి వల్ల తత్కతాళిక ప్రయోజనాలు పొందినప్పటికీ ధీర్ఘకాలంలో రాజకీయాలను ఇవి పూర్తిగా దెబ్బతీసే పరిస్థితి ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఏదో ఒక్క విశ్వవిద్యాలాయానికి సురవరం పేరు పెట్టాలని గతంలో కూడా ప్రభుత్వం ద్రుష్టికి తీసుకువచ్చామని మరోసారి ఈ వేధిక నుండి ప్రభుత్వంను విజ్నప్తి చేస్తున్నామని అన్నారు. సురవరం వంటి వారి గురించి భావితరాలకు తెలియాలంటే దానికి ప్రభుత్వం కూడా తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైన వుందని అభిప్రాయపడ్డారు.

హజరైన జర్నలిస్టులు

కార్యక్రమం అనంతరం సురవరంప్రతాపరెడ్డి కుమారుడు క్రుష్ణవర్దన్ రెడ్డితో పాటు పుష్పలతను సత్కరించారు. ఈ కార్యక్రమంలో టియూడబ్ల్యూజె రాష్ట్ర కార్యదర్శి గుడిపల్లి శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు రాజేష్, టియూడబ్ల్యూజే అధ్యక్ష కార్యదర్శులు దండు దత్తేంద్ర, ఐలమోని శేఖర్, మధు, జిల్లా ప్రముఖులు మనోహర్ రెడ్డి, ప్రొదుటూరి ఎల్లారెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి పరమేష్ గౌడ్, సహాయ కార్యదర్శి బాలకిషన్, తదితరులు పాల్గొన్నారు.

Related posts

రఘురామకృష్ణరాజు విడుదలలో జాప్యం..

Drukpadam

ప్రధాని అత్తగారినని చెప్పాను… కిందికి పైకి చూశారు: సుధామూర్తి

Drukpadam

వైఎస్ జగన్ అంటే అభిమానం.. హీరో విశాల్ ఆసక్తికర వ్యాఖ్యలు

Ram Narayana

Leave a Comment