Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

తెలుగు రాష్ట్రాల నుంచి 6 గురు రాజ్యసభకు ఏకగ్రీవమే ….!

తెలుగు రాష్ట్రాల నుంచి ఆరుగురు అభ్యర్థులు ఏకగ్రీవం….?

రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రాన్ని అయిన ఎదిరిస్తాం …టీఆర్ యస్

చీటికీ మాటికీ కేంద్రం తో పోరాటం మా విధానం కాదు …విజయసాయి

తెలుగు రాష్ట్రాల నుంచి ఆరు రాజ్యసభ స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో ఆరుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు . వారికీ పోటీకి ఎవరు సిద్దపడక పోవడం ,నామినేషన్లు ఉన్న స్థానాలకు ఒక్కరు మాత్రమే నామినేషన్లు వేయడంతో ఎన్నిక లాంఛనంగా మారింది. ప్రతిపక్షాలకు కనీస సంఖ్య లేకపోవడం , పోటీచేసేందుకు అభ్యర్థులు ముందుకు రాకపోవడం , ప్రతిపక్షాలు కూడా గెలవని సీట్ల కోసం పోటీ ఎందుకులే అనే ధోరణి కలిగి ఉండటంతో పోటీలేకుండానే పార్టీ నిర్ణయించిన అభ్యర్థులు ఎన్నిక కానున్నారు . తెలంగాణ నుంచి బండ ప్రకాష్ రాజీనామాతో ఏర్పడిన రెండు సంత్సరాల ఖాళీ సీటుకు ఖమ్మం కు చెందిన ప్రముఖ గ్రానైట్ వ్యాపారి గాయత్రీ రవిని ఎంపిక చేశారు . ఆయనకు కూడా పోటీ ఎవరు లేకపోవడంతో ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికై ధ్రువీకరణ పత్రం కూడా తీసుకున్నారు . అయితే రాజ్యసభ సభ్యుడుగా ఆయన ప్రమాణం చేయాల్సి ఉంది . త్వరలో జరగనున్న రాష్ట్రపతి ,ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో రవి ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉన్నందున వారం రోజుల్లో ఎప్పుడైనా ప్రమాణ స్వీకారం ఉంటుందని సమాచారం .

 

 

ఏపీ నుంచి నాలుగు స్థానాలకు 4 గురు మాత్రమే నామినేషన్లు వేశారు . అదేవిధంగా తెలంగాణ నుంచి రెండు స్థానాలకు గాను ఇద్దరు అభ్యర్థుల నామినేషన్లు వేశారు .ఇక్కడ అక్కడ అధికారపార్టీకి కావాల్సిన మెజార్టీ ఉండటంతో మొత్తం ఆరు స్థానాలకు నామినేషన్లు వేసిన రెండు రాష్ట్రాల అధికార పార్టీ అభ్యర్థులు ఎన్నిక ఇక లాంఛనమే … కొత్తగా రాజ్యసభ కు వెళ్లుతున్నవారిలో తెలంగాణ నుంచి ఖమ్మం జిల్లా కు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త బండి పార్థసారథి రెడ్డి , హైద్రాబాద్ కు చెందిన దీకొండ దామోదర్ రావు లు ఉండగా ఏపీ నుంచి విజయసాయి రెడ్డి , బీద మస్తాన్ రావు , ఆర్ కృష్ణయ్య , ప్రముఖ అడ్వకేట్ నిరంజన్ రెడ్డి లు ఉన్నారు . ఆర్ .కృష్ణయ్య , నిరంజన్ రెడ్డి లు తెలంగాణంకు చెందినవారు కాగా , విజయసాయి రెడ్డి ,బీద మస్తాన్ రావు లు ఏపీ కి చెందినవారు . జాతీయ బీసీ నేతగా గుర్తింపు పొందిన ఆర్ . కృష్ణయ్య ,నిరంజన్ రెడ్డి ల ఎంపిక పై ఏపీలో ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న ఎరవకుండా సీఎం జగన్ నిర్ణయం తీసుకోవడం సంచలంగా మారింది.

రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రాన్ని అయిన ఎదిరిస్తాం …టీఆర్ యస్

రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే కేంద్రాన్ని అయిన ఎదురిస్తామని టీఆర్ యస్ సభ్యులు తెలిపారు . ఇప్పటికే తమ పార్టీ నేత సీఎం కేసీఆర్ ఆదిశగా అడుగులు వేస్తున్నారని ఆయన అప్పగించిన భాద్యతలు నెరవేర్చడం మా ముందున్న కర్తవ్యం అని అన్నారు . నామినేషన్లు అనంతరం బండి పార్థసారథి రెడ్డి , దామోదర్ రావు లు మీడియా తో మాట్లాడారు .

చీటికీ మాటికీ కేంద్రం తో పోరాటం మా విధానం కాదు …విజయసాయి

రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించినా, ఏ ఇతర పార్టీ వ్యవహరించినా దాన్ని వ్యతిరేకిస్తామని చెప్పారు. ప్రస్తుత రాజ్యసభ సభ్యులతో జగన్‌ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. ఈ సామాజిక వర్గాలను మిగతా వర్గాలతో సమాంతరంగా అభివృద్ధి పరిచేవిధంగా.. పనితనం కూడా అదేరకంగా ఉంటుందన్నారు. కేంద్రంతో ఏ సమస్య మీద అయితే పోరాడాలో.. దానిపైనే పోరాడాలి కానీ, ప్రతిపక్షం, చంద్రబాబు చెప్పినట్టుగా ప్రతిదానిపై కేంద్రంపై పోరాడటం కరెక్ట్‌ కాదని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధమో.. వాటిపైనే కేంద్రంతో పోరాడాలన్నారు. రాష్ట్రం, కేంద్రం సమన్వయంతో పనిచేయాలని… అదే తమ ఆశయం.. ఆ వైపుగా పయనిస్తామని విజయసాయిరెడ్డి స్పష్టం చేసారు.

Related posts

కాంగ్రెస్ అధినేత్రి సోనియా ను విచారించిన ఈడీ … భగ్గుమన్న కాంగ్రెస్…

Drukpadam

పొంగులేటి ,జూపల్లి నివాసాలకు కాంగ్రెస్ నేతలు రేవంత్, కోమటిరెడ్డి…

Drukpadam

ఈ నెల 23 వరకు కేసీఆర్ కు టైమ్ ఇస్తున్నాం: రేవంత్ రెడ్డి

Drukpadam

Leave a Comment