Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

మిస్టరీగా మారిన వివేకా హత్య కేసు …

మిస్టరీగా మారిన వివేకా హత్య కేసు …
-పరస్పర ఆరోపణలతో పక్కదార్లు పడుతున్న నిజాలు
-అసలుదోషులు ఎవరు ?
సిబిఐ తేల్చుతుందా ?మూస్తుందా ?
వైయస్ వివేకానందరెడ్డి హత్య జరిగి రెండుసంవత్సరాలు అయింది . కాని ఇంతవరకు మర్డర్ మిస్టరీ తేలలేదు. ప్రస్తుతం సిబిఐ దగ్గర ఉంది . దీనిపై సిబిఐ ఒకటికి రెండు సార్ల విచారణ జరిపింది . కేసుకు సంబందించిన వివరాలు సేకరించింది. అనేక మందిని విచారించింది. అయినప్పటికీ ఒక నిర్ణయానికి రాలేక పోతుంది. కేసులో దోషులను సిబిఐ తేల్చితుందా ? కేసు మూసివేస్తుందా ? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి స్వయాన బాబాయ్ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి తమ్ముడు , మాజీ మంత్రి , మాజీ ఎంపీ అయిన వివేకానందరెడ్డి హత్య గావించబడితే ఇంతవరకు దోషులను పట్టుకోవటం లో అటు పోలీసులు, ఇటు ప్రత్యేక టీంలు విఫలమైయ్యాయి . చివరకు కుటుంబసభ్యుల వత్తిడి మేరకు హైకోర్టు కేసును సీబీఐకి అప్పగించింది. దీనిపై రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. రాజకీయ పార్టీలు పరస్పర ఆరోపణలు తప్ప హంతకులు ఎవరు అనేది తేల్చటం లేదు. రెండు సంవత్సరాలుగా కేసు పోలీసులు,ప్రత్యేక బృందాలు ,సిబిఐ దర్యాప్తు జరుపుతూనే ఉన్నాయి. కాని ఎవరు దోషులు అనేది తేల్చలేక పోయారు. హత్య ఎవరు చేశారు అనేది తొందరగా తేల్చాలని వివేకానందరెడ్డి భార్య , కూతురు ఎప్పటి నుంచో కోరుతున్నారు. తొలుత కొందరిపై అనుమానాలు ఉన్నాయని వివేకానందరెడ్డి కుటుంబసభ్యులు పోలీసులకు , ప్రత్యేక బృందాలకు ,సిబిఐ కి తెలిపారు. ఆకోణంలోను దర్యాప్తు జరిపారు. వైయస్ కుటుంబ సభ్యులు బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆదినారాయణ రెడ్డి వారి కుటుంబసభ్యులకు తెలియకుండా ఇది జరిగి ఉండదని హత్యలో తన ప్రమేయం ఉన్నట్లు నిరూపించ గలిగితే బహిరంగ ఉరికి సిద్ధం అని అంటున్నారు. విజయమ్మ హత్య ఎవరు చేశారనేది నిగ్గుతేలాల్సిందే నని తమ కుటుంబం కోరుకొంటుందని అన్నారు. తాను గాని జగన్ గాని ,షర్మిల కూడా దోషులను తేల్చాల్సిందే అని చెబుతున్నామని అన్నారు . వివేకా కూతురు సునీతా ఢిల్లీలో సిబిఐ అధికారులను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ తొందరగా కేసును పరిష్కరించాలని,దోషులెవరో వెల్లడించాలని కోరామని తెలిపారు .ఆమెకు ఉన్న అనుమానాలను ఆమె మీడియా కు వివరించారు. పర్వోక్షంగా జగన్ , అవినాష్ రెడ్డి , ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి లపై అనుమానం వచ్చేలా మాట్లాడారు .జగన్ సీఎం గా ఉండి కూడా దోషులను పట్టుకోవటంలో వైఫల్యం చెందారని తెలుగుదేశం , జనసేన , బీజేపీలు విమర్శలు చేస్తున్నాయి. తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చం నాయుడు దీనిపై స్పందిస్తూ ,విజయమ్మ బైబిల్ చేతపట్టుకుని వివేకా హత్యతో తమకుటుంబానికి సంబంధం లేదని ప్రమాణం చేయగలదా ? అని ప్రశ్నించారు . రాజకీయపార్టీలు రాజకీయమా కోసం ఆరోపణలు చేయటం సహజం కాని వివేకా కూతురు సిబిఐకి అప్పగించిన కేసును జగన్ సర్కార్ పట్టించుకోవటం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. కేసును సీబీఐకి అప్పగించిన తరువాత రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఏమిటి అనేది కొందరి అభిప్రాయం . కేసును రాజకీయం చేయటం ద్వారా బలహీన పరచటమే అవుతుంది . సునీతా ఏమి సాదించాలనుకున్నారు అనేది అంతు పట్టని విషయంగా ఉంది. సునీతా ను ఎవరైనా ప్రేరేపిస్తున్నారా ? అనే అనుమానాలకు తావిస్తుంది. నిజంగా హత్య ఎవరు చేశారు అనేది తేలాలని ప్రజలు కోరుకుంటున్నారు . ఆదిశగా ప్రయత్నాలు చేయాల్సిన సునీతా రాజకీయ ప్రత్యర్థులకు ప్రధానంగా తన అన్న జగన్ పార్టీని ఇరుకున పెట్టేలా ఉన్నాయి . అందువల్ల జగన్ కుటుంబం తరుపున విజయమ్మ ప్రకటన చేయాల్సి వచ్చిందనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. ఈ అనుమానాలు తీరే వరకు వివేకా కేసు పై పరస్పర రాజకీయ ఆరోపణలు కొనసాగుతూనే ఉంటాయి.

Related posts

చంద్రబాబుపై ప్రశంసలు కురిపించిన వైసీపీ ఎమ్మెల్యే!

Drukpadam

వైయస్ కుటుంబంలో చిచ్చు …జగన్ పై బ్రదర్ అనిల్ విమర్శల దాడి!

Drukpadam

టీడీపీకి 125 సీట్లా…? రాయపాటి జోస్యం నిజమైయ్యేనా …??

Drukpadam

Leave a Comment