Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

సంకల్ప సభకు తల్లి విజయమ్మతో పాటు షర్మిల గ్రాండ్ ఎంట్రీకి రంగం సిద్ధం

సంకల్ప సభకు తల్లి విజయమ్మతో పాటు షర్మిల గ్రాండ్  ఎంట్రీకి రంగం సిద్ధం
-1000 కార్లతో హైద్రాబాద్ నుంచి ఖమ్మం కు పెరేడ్
-మార్గ మధ్యలో ఆరుచోట్ల ఘన స్వాగతాలకు సైతం ఏర్పాట్లు
-ఖమ్మం సభపై ఇంటలిజన్స్ ఆరా
– ప్రజలను కంట్రోల్ చేయటం సాధ్యమేనా ?
-కరోనా నిభందనలు పాటించగలరా ?
ఈ నెల 9 న ఖమ్మం లో జరగనున్న వైయస్ షర్మిల సంకల్ప సభకు తన తల్లి విజయమ్మతో పాటు ఆమె గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. సాయంత్రం ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ లో జరగనున్న సభకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. షర్మిల హైదరాబాద్ లో ని తన నివాసం లోటస్ పాండ్ నుంచి 1000 కార్లతో బయలు దేరనున్నారు. దీంతో హైద్రాబాద్ ,విజయవాడ జాతీయ రహదారి కోలాహలంగా మారనున్నది. మార్గ మధ్యలో 6 చోట్ల ఆమెకు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించిన రోజునే పార్టీ ప్రకటన , జెండా ,ఎజెండా ప్రకటించాలనే పట్టుదలతో ఉన్నందునే ఏప్రిల్ 9 న ముహర్తం ఎంచుకున్నారు . ముందు తల్లి విజయమ్మ ఇక్కడకు వచ్చేదానిపై క్లారిటీ లేకపోయింది. కానీ ఆమె కూడా వస్తున్నట్లు షర్మిల సభ ఏర్పాట్లను చూస్తున్న నాయకులూ తెలిపారు. దీంతో వైయస్ అభిమానుల్లో మరింత జోష్ పెరిగింది. సాయంత్రం జరిగే సభలో కరోనా కారణంగా పరిమిత సంఖ్యలో ప్రజలు పాల్గొనాలని పోలీసులు సెక్షన్ 68 ,69 ప్రకారం నోటీసులు ఇచ్చారు. దేశంలో కరోనా విజృభిస్తున్న నేపథ్యంలో బహిరంగ సభలకు అనుమతులపై కఠిన నిభందనలు అమలు చేస్తున్నారు. నిభందనలు ప్రకారమే సభ జరుపుతామని నాయకులూ చెబుతున్నప్పటికీ ప్రజలను కంట్రోల్ చేయగలరా ? కరోనా నిబంధనలను పాటించగలరా అనే సందేహాలు కలుగుతున్నాయి. అందునా సభ జరుగుతున్నా ప్రాంతం ఖమ్మం నగర నడిబొడ్డున ఉంది. రైల్వే ,స్టేషన్ , పాత బస్టాండ్ కు సమీపంలో ఉంది .వర్తక వాణిజ్య సముదాయాలకు అత్యంత దగ్గర ప్రాంతం తక్కువమంది పట్టే గ్రౌండ్ ఇన్ని పరిమితుల మధ్య సభ కొంత ఇబ్బంది కారమే కావచ్చునని అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. పోలీస్ వారు ఎందుకు ఆలోచించారో గని కాలేజీ గ్రౌండ్ అయితేనే ఎవరికీ ఇబ్బంది లేకుండా ఉండేదని అభిప్రాయాలూ ఉన్నాయి. అక్కడికి కొంత ఎక్కువ మంది వచ్చిన వచ్చే ఇబ్బంది ఏమి ఉండక పోవచ్చు . రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఈ సభకు భారీ సంఖ్యలో అభిమానులు వచ్చే ఆవకాశం ఉంది. అందులో పార్టీ ప్రకటనతో పాటు జెండా ఎజెండా ప్రకటించనుండటంతో సర్వత్రా ఈ సభపై ఆశక్తి నెలకొన్నది. పార్టీ పెట్టబోతున్నట్లు చెప్పిన తర్వాత మొదటి సారిగా ఆమె బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. ఆమె ఏమి చెబుతారు అనే ఉత్కంఠ రాజజకీయ వర్గాలలో సైతం నెలకొని ఉంది . షర్మిల సభపై కేంద్ర ,రాష్ట్ర నిఘావర్గాలు ఆరా తీస్తున్నాయి. సభకు ముందు ఎలాంటి షరతులు లేకుండా పర్మిషన్ ఇచ్చిన పోలీసులు తరువాత కరోనా నిభంధనలతో నోటీసులు జారీ చేయటంపై షర్మిల అభిమానులు భగ్గుమంటున్నారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలకు , ఇటీవల కేటీఆర్ ఖమ్మం పర్యటన సందర్భంగా నిభందనలు ఏమైయ్యాయని ప్రశ్నిస్తున్నారు . అనేక సందేహాల మధ్య జరుగుతున్న ఈ సభ రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పుతుందా లేదా ? అనేది చూడాలి మరి !!!

Related posts

తిరుపతి రుయా ఆసుపత్రి వద్ద నిరసన … అడ్డుకున్న పోలీసులు…

Drukpadam

విజయవాడ లో జరిగిన సమావేశంలో సీఎం జగన్ పై పొగడ్తల వర్షం కురిపించిన ఎమ్మెల్యే లు!

Drukpadam

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకోసం తెలుగుదేశం మాస్టర్ ప్లాన్ ..

Drukpadam

Leave a Comment