Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

రాజన్న బిడ్డ షర్మిలమ్మను ఆశీర్వదించండి

రాజన్న బిడ్డ షర్మిల సంకల్ప సభను ఆశీర్వదించండి….

ముఖ్య అతిథులుగా వై.యస్ విజయమ్మ…..

ఖమ్మం : తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలని చూస్తున్న వైయస్ షర్మిల ఖమ్మం వేదికగా జరిగే సభలో పార్టీకి సంబంధించిన వివరాలు ప్రకటించే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 9న ఖమ్మంలో పెద్దఎత్తున ఈ సభ నిర్వహించాలని నిర్ణయించ్చగా కోవిడ్ కేసుల పెరుగుదలతో ఈ ప్రభావం బహిరంగ సభపై పడనుంది అని పోలీసులు ఆంక్షలు విధించడంతో సాధారణంగానే షర్మిల సంకల్ప ఖమ్మం సభ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి అని అనుకునే తరుణంలో అన్ని అవరోధాలు తొలగిపోయాయి కోవిడ్ నిబంధనల నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లతో సభ నిర్వహించుకోవచ్చని రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు జిల్లా పోలీసు అధికారులు మరోమారు షర్మిల పార్టీకి అధికారిక అనుమతి ఇచ్చారు. ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ లో ఆరు వేల మందితో సభ నిర్వహించుకోవాలని కోవిడ్ జీవో నెంబర్ 68, 69 ప్రకారం వ్యవహరించాలి అని షర్మిల పార్టీ తెలంగాణ కోఆర్డినేటర్ కొండా రాఘవరెడ్డి, నాయకులు బండారు అంజన్ రాజు, గున్నం నాగిరెడ్డి, లక్కీ నేనే సుధీర్బాబు లకు ఆదేశాలు జారీ చేయడంతో వెంటనే షర్మిల టీమ్ రంగంలోకి దిగి సభ నిర్వాహణ ఏర్పాట్లు లో మునిగిపోయామని అయితే వైఎస్ షర్మిల ఈ సభకు ముఖ్యఅతిథిగా తన తల్లి వైయస్ విజయమ్మ ని ఆహ్వానించినట్టు ఖమ్మంలో నిర్వహించిన మీడియా సమావేశంలో షర్మిల పార్టీ తెలంగాణ కోఆర్డినేటర్ కొండా రాఘవరెడ్డి, పేర్కొన్నారు. తల్లి విజయమ్మ ను పక్కన పెట్టుకొని పార్టీ ప్రకటన చేయాలని షర్మిల భావిస్తున్నారని తన పార్టీకి తన తల్లి విజయమ్మ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు షర్మిల ప్రకటించిన సంగతి తెలిసిందే. శుక్రవారం జరిగే ఈ సభకు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలంగాణతో పాటు ఏపీ నుండి కూడా భారీగా వైఎస్ అభిమానులు మరియు షర్మిల అభిమానులు భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని వచ్చేటటువంటి అభిమానులకు అందరికీ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్కులు, శానిటైజర్లు ఏర్పాటు చేశామని తెలియజేశారు. షర్మిల మరియు వైఎస్ విజయమ్మ ఇరువురు ఉదయం ఎనిమిది గంటలకి లోటస్ పాండ్ నుండి బయలుదేరి దారిపొడవునా వీరికి ఘన స్వాగతం పలికేందుకు ఆమె సన్నిహితులు, అభిమానులు ఆరు చోట్ల స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు అని ఇరువురు అభిమానుల స్వాగతాలు స్వీకరిస్తూ మధ్యాహ్నం ఒక్కటీ ముపై నిమిషాలు నుండి రెండు గంటల లోపు ఖమ్మం చేరుకుంటారని అక్కడి నుండి సభా ప్రాంగణానికి ర్యాలీ ద్వారా ఐదు గంటలకు చేరుకుని సంకల్ప సభ ప్రారంభిస్తారని పేర్కొంటారు.

Related posts

సెన్సార్ బోర్డమెంబర్ సన్నె ఉదయ్ ప్రతాప్ కు సన్మానం

Drukpadam

గీతం యూనివర్సిటీ 40 ఎకరాలు ఆక్రమించుకున్నట్టు రోజా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు​: పంచుమర్తి అనురాధ

Ram Narayana

6 Easy Tips For A Better and Healthier Skin

Drukpadam

Leave a Comment