తగిన జాగ్రత్తలతో అన్ని రకాల విద్యాసంస్థలను ప్రారంభించాలి -ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
కరోనా పేరుతొ స్కూళ్లను మూసివేయటం తగదు
కరోనా పేరుతొ స్కూళ్లను మూసివేయడం తగదని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఆలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. తగిన జాగ్రత్తలతో అన్నిరకాల విద్యాసంస్థలను ప్రారంభించాలని అన్నారు. విద్యాసంస్థలను మూసివేస్తే తెలంగాణాలో విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని అన్నారు. మన రాష్ట్ర విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ఖమ్మం లోని యూ టి ఎఫ్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో యూ టి ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావరవి తో కలిసి విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారికోసం అన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రారంభించాలని అన్నారు. వ్యాధి వ్యాపిస్తున్న ప్రాంతాలలో మాత్రమే పాఠశాలలకు కొన్ని రోజులు సెలవులు ఇస్తే సరిపోతుందని పేర్కొన్నారు. కరోనా పేరుతొ అన్ని ప్రాంతాలలో స్కూళ్లను మూసివేయటం ఏ మాత్రం తగదన్నాడు. పాఠశాలల పరిశుభ్రతకు , మరుగుదొడ్ల నిర్వహణకు పారిశుధ్య కరిమికులను నియమించాలని అన్నారు. విద్య సంవత్సరాన్ని అర్థాంతరంగా మూసివేయడంతో పాఠశాలలో , కళాశాలల్లో పనిచేస్తున్న లక్షలాది మంది రోడ్డున పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. వారిని ప్రభుత్వాలు కానీ మేనెజ్మంట్లు కానీ ఆదుకోక పోవడంతో వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి వారిని ఆదుకోవాలని విజ్ఞపి చేశారు. గిరిజన సంక్షేమ హాస్టళ్లను 2013 లో ఆశ్రమ పాఠశాలలుగా మార్చినప్పటికీ కానీ ఉపాధ్యాయ పోస్టులు మంజూరి చేయలేదని అన్నాడు. దీనితో విద్యార్థులు నష్టపోతున్నారని వెంటనే ఆశ్రమ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలనీ డిమాండ్ చేశారు.
ప్రభుత్వం వెంటనే పీఆర్సీ ఉత్తర్వులు ఇవ్వాలి … చావరవి
ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించినప్పటికీ ఇంతవరకు ఉత్తర్వులు ఇవ్వలేదని వెంటనే పీఆర్సీ ఉత్తర్వులు ఇవ్వాలి యూ టి ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావరవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అదే విధంగా ప్రకటించిన పీఆర్సీ ని 2018 జులై 1 అమలు చేయాలనీ రిటైర్ అయినా ఉద్యోగులందరికీ పై తేదీనుంచి నూతన పీఆర్సీ ప్రకారం గ్రాట్యువిటి ,తదితర ప్రయోజనాలను అందించాలని అన్నారు. జులై ౨౦౧౮ తరువాత నియామకమైన నూతన ఉపాధ్యాయులకు 30 శాతం ఫిట్మెంట్ తో ప్రయోజనం వర్తించే విధంగా వేతన పట్టికలు సవరించి అమలు చేయాలన్నారు . ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన విధంగా కాంట్రాక్టు , అవుట్ సోర్చింగ్ వారికీ కూడా ప్రయోజనాలు వర్తింప చేయాలన్నారు. సమావేశంలో చావా దుర్గాభవాని , జి .నాగమల్లేశ్వరరావు , పారుపల్లి నాగేశ్వరరావు , రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.