Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

షర్మిల ఖమ్మం సంకల్ప సభ సక్సెస్… అభిమానుల్లో జోష్

షర్మిల ఖమ్మం సంకల్ప సభ సక్సెస్ అభిమానుల్లో జోష్
-కేసీఆర్ పాలనపై పదునైన మాటలతో దాడి
-కాంగ్రెస్ ,బీజేపీ ల విశ్వసనీయత పైన విమర్శలు
-తెలంగాణ ఆత్మగౌరం దొర చేతుల్లో బందీ అయిందని ధ్వజం
-షర్మిలకు దారిపొడవునా జైజైలు
-హైద్రాబాద్ నుంచి ఖమ్మం దూరం 200 కి.మీ పట్టిన సమయం 11 గంటలు
వై యస్ షర్మిల ఖమ్మం లో నిర్వహించిన సంకల్ప సభ సక్సెస్ అవటంతో అభిమానుల్లో జోష్ పెరిగింది.షర్మిల తన ప్రసంగంలో రాష్ట్రంలోని కేసీఆర్ పాలన టార్గట్ గా విమర్శలు చేశారు. ఆమె ప్రసంగాన్ని సభికులు శ్రద్ధతో విన్నారు. షర్మిల పదునైన పదజాలంతో ఉండటంతో ఆశక్తిని కలిగించాయి. ఆత్మగౌరం కోసం తెచ్చుకున్న తెలంగాణ దొరగారి చెప్పుకింద నలిగి పోతుందని చేసిన తీవ్ర విమర్శలు చర్చనీయాంశం అయ్యాయి. దొర నంది అంటే నంది ,పంది అంటే పంది లాగా పాలన సాగుతుందని, ఎవరి మాట వినరని , నీళ్లు ,నిధులు ,నియామకాలు పేరుతొ తెచ్చుకున్న తెలంగాణ అన్ని కేసీఆర్ కుటుంబానికేనని షర్మిల చేసిన విమర్శలు సభికులను ఆలోచింప చేశాయి. మంత్రుల మాటలకూ చెల్లుబాటు లేదని ఎమ్మెల్యేలకు ఎంపీ లకు సీఎం అపాయింట్ మెంట్ ఇచ్చే పరిస్థితి లేదని ఘాటైన విమర్శలు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల విషయం కూడా ఆమె ప్రస్తావించారు. మొత్తం మీద ఆమె ప్రసంగం అంతా కేసీఆర్ విధానాల టార్గట్ గా సాగింది . తల్లి విజయమ్మ మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి పాలనను గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ ను కమిట్ మెంట్ తో పని చేస్తున్నారని ఆయన పేరు చెప్పగానే సభ హర్షద్వానాలతో మారుమోగింది . తన బిడ్డను తెలంగాణ ప్రజలకు అప్పగిస్తున్నాని ఆమెను అశ్వర్వదించాలని కోరారు.

సాయంత్రం ఐదు గంటలకు అనుకున్న సభ రాత్రి 8 గంటలకు గాని ప్రారంభం కాలేదు. షర్మిల హైద్రాబాద్ లోని తన నివాసం లోటస్ పాండ్ నుంచి ఉదయం 8 గంటలకు బయలు దేరి రాత్రి 7 గంటలకు ఖమ్మం చేరుకొని 7 .45 గని వేదికమీదకు చేరుకోలేక పోయారు. అంటే 200 కి.మీ 4 గంటలు పట్టాల్సిన సమయం 11 గంటల సమయం పట్టింది. వందలాది వాహనాలు ఆమె వెంట కాన్యాయ్ లో పాల్గొన్నాయి . ఆమె హైదరాబాద్ ,విజయవాడ జాతీయరహదారి పై ప్రయాణించి సూర్యాపేట మీదగా ఖమ్మం వచ్చారు. వచ్చే దారిపొడవునా అభిమానులు ఘనస్వాగతం పలికారు. సూర్యాపేట నుంచి ఖమ్మం చేరుకోవటానికి ఎక్కువ సమయం పట్టింది. సూర్యాపేటలో వేలాది మందితో షర్మిలక్క నాయకత్వం వర్ధిల్లాలి , జోహార్ వైయస్ ఆర్ అనే నినాదాలు మిన్నంటాయి.అదే విధంగా , చౌటుప్పల్ , చిట్యాల , నార్కట్ పల్లి, నకిరేకల్ , మోతే , నాయకంగూడెం , పాలేరు ,కూసుమంచి, వరంగల్ క్రాస్ రోడ్, పెద్ద తండా చోట్ల ప్రజలు షర్మిల కాన్వాయి వెంట పరుగులు తీశారు. లక్ష మందికి పైగా ప్రజలతో సభ పెట్టాలని భావించినప్పటికీ కరోనా మహమ్మారి కారణంగా పెద్ద సభకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. కేవలం 6 వేలమంది మాత్రమే పాల్గొనాలని షరతు విధించారు. దీంతో జన సమీకరణ మీద ద్రుష్టి పెట్టలేదు . అయినప్పటికీ ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ లో జరిగిన సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.వచ్చిన వారిలో అత్యధికులు మాస్క్ లతోనే కనిపించారు. నిర్వాకులు కూడా పదే పదే సభకు వచ్చిన వారిని మాస్క్ లు పెట్టుకోవాలని మైకుల ద్వారా విజ్ఞప్తి చేయటం జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారిని ఖమ్మం నగర సరిహద్దులలోనే నిలిపి వేశారని వారిని లోపలి రానివ్వాలని కొండా రాఘవరెడ్డి పలుమార్లు విజ్ఞప్తి చేశారు. ఒక సందర్భంలో పోలీసులను గట్టిగానే హెచ్చరించారు. ముఖ్యమంతి , డీజీపీ,జిల్లా మంత్రి అజయ్ ల ఆదేశాలతోనే పోలీసులు సభకు వచ్చే వారిని రాకుండా నిరోదిస్తున్నారని ఆరోపించారు. షర్మిల రాజన్న రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ అని ఆమె సభకు ఆటంకం కలిపిస్తే ఫలితం అనుభవించక తప్పదని హెచ్చరించారు.
వివిధ ఛానల్స్ లైవ్ ప్రాగ్రాం ఇచ్చినందున లక్షలాది మందికి ఆమె సందేశం చేరింది. పార్టీ ,పేరు , జెండా, ఎజెండా ఖమ్మం లో ప్రకటిస్తారని ప్రచారం జరిగినప్పటికీ పార్టీ ప్రకటన తేదీని జులై 8 న రాజశేఖర్ రెడ్డి పుట్టిన రోజున ప్రకటిస్తామని స్వయంగా షర్మిల బహిరంగసభలో ప్రకటించారు. సభ ప్రాగణం అంట రాజశేఖర్ రెడ్డి , విజయమ్మ , షర్మిల కౌట్ అవుట్లతో నిండిపోయింది . పార్టీలో చేరికలు లేవుగాని ఆమెతో కలిసి నడిచేవారు సభకు వచ్చారు. ఇందులో ప్రముఖులు పెద్దగా లేరు. మాజీ ఎమ్మెల్సీ , రంగారెడ్డి , ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ గుడిపల్లి కవిత ,కొందరు మాజీ ఎమ్మెల్యేలు , కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు.ఏపూరి సోమన్న ఆటపాట సభికులను రజింపజేశాయి.

Related posts

ఉద్దవ్ ,శరద్ పవర్ తో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు …

Drukpadam

కొండపల్లి అటవీ ప్రాంతానికి వెళ్లకుండా రేపు ఎలా అడ్డుకుంటారో చూస్తాం: టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు!

Drukpadam

అజిత్ చర్యతో మేల్కొన్న శరద్ పవార్ …రాష్ట్ర వ్యాపిత పర్యటనకు సిద్ధం …

Drukpadam

Leave a Comment