Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

మూడురోజులపాటు దేశ రాజకీయ కేంద్రంగా హైద్రాబాద్ మహానగరం…

మూడురోజులపాటు దేశ రాజకీయ కేంద్రంగా హైద్రాబాద్ మహానగరం…
-కేంద్ర క్యాబినెట్ ..19 రాష్ట్రాల ముఖ్యమంత్రులు భాగ్యనగరంలో మకాం
-ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యస్వంత్ సిన్హా సైతం రేపు నగరానికి రాక
-ఇప్పటికే దేశ రాజకీయాలపై ఫోకస్ పెట్టిన కేసీఆర్
-వివిధ రాష్ట్రాల నుంచి చేరుకుంటున్న బీజేపీ ముఖ్యనేతలు
-వారి ఏర్పాట్లలో నిమగ్నమైన స్థానిక నేతలు
-హైద్రాబాద్ అంత పోస్టర్లు జెండాల మయం

మూడురోజుల పాటు హైద్రాబాద్ మహానగరం దేశ రాజకీయ కేంద్రం గా మారబోతుంది…బీజేపీ జాతీయసమావేశాలకు భాగ్యనగరం ఆతిధ్యం ఇవ్వబోతుంది. దీంతో ప్రధాని నరేంద్రమోడీ తో సహా అమిత్ షా , బీజేపీ అధ్యక్షుడు జెపి నడ్డా , 19 రాష్ట్రాల ముఖ్యమంత్రులు , పలువురు కేంద్ర మంత్రులు వందలాదిగా ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర ప్రజా ప్రతినిధులు , మహానగరంలో బస చేయనున్నారు . దీంతో ఒక్కసారిగా జాతీయ , అంతర్జాతీయ మీడియా సైతం హైద్రాబాద్ నగరం పై ఫోకస్ పెట్టింది. మీడియా ప్రతినిధులు కూడా హైద్రాబాద్ చేరుకున్నారు . ఒక రకంగా చెప్పాలంటే హైద్రాబాద్ నగరం కాషాయమయం అయింది. ప్రధాని కేంద్ర క్యాబినెట్ మొత్తం ఇక్కడే ఉండటం తో కేంద్ర సచివాలయం కూడా ఇక్కడ నుంచే పనిచేయనుంది. అందుకు అవసరమైన ఏర్పాటు చేసుకున్నారు . ఇందుకు రాజ్ భవన్ తోపాటు , నోవాటెల్ హోటల్ ను ఎంచుకున్నారు .

యస్వంత్ సిన్హా హైద్రాబాద్ రాక …

రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల అభ్యర్థిగా పోటీచేస్తున్న యస్వంత్ సిన్హా ప్రచారం లో భాగంగా ఇక్కడ టీఆర్ యస్ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను కలుసుకునేందుకు రేపు హైద్రాబాద్ వస్తున్నారు . బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి జలవిహార్ వరకు పెద్ద ఎత్తున టీఆర్ యస్ ప్రదర్శనకు ఏర్పాటు చేసింది. సిన్హా ను స్వయంగా సీఎం కేసీఆర్ రిసీవ్ చేసుకుంటారు . బీజేపీ జాతీయసమావేశాలు , ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి ఒకేరోజు నగరంలో ఉండటంతో రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. ఇప్పటికే బీజేపీ ,టీఆర్ యస్ లమధ్య పోస్టర్ల యుద్ధం ప్రారంభమైంది. దీనికి తోడు రాష్ట్రపతి అభ్యర్థి ప్రచారం తో ఆసక్తి నెలకొన్నది .

జాతీయ రాజకీయాలపై కేసీఆర్ ఫోకస్ …

జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టిన కేసీఆర్ ప్రతి అంశాన్ని తనకు అనుకూలంగా వినియోగించుకొనే చాతుర్యం ప్రదర్శిస్తారు . అందులో భాగంగానే కేంద్రం రాష్ట్రానికి చేసిన అన్యాయాలపై పోస్టర్లు హోర్డింగ్ లద్వారా ప్రచారం చేస్తున్నారు . దానికి ప్రతిగా బీజేపీ రాష్ట్రానికి ఇచ్చిన వాటిపై ప్రచారం చేస్తుంది. రెండు పార్టీలమధ్య జరుగుతున్నా యుద్ధం రేపు రాబోయే రాజకీయాలను ప్రభావితం చేస్తుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు .

కేసీఆర్ పై బీజేపీ మండిపాటు …

తమ సమావేశాలు జరుగుతుండగా తమకు వ్యతిరేక ప్రచారం చేస్తున్న టీఆర్ యస్ పై కేసీఆర్ పై బీజేపీ నేతలు మంది పడుతున్నారు . ఇక సాలు దొరా…సెలవు దొరా అంటూ వెలసిన పోస్టర్లు చర్చనీయాంశంగా మారాయి.

3 న ప్రధాని బహిరంగ సభ పై బీజేపీ విస్తృత ప్రచారం ….

 

బీజేపీ సమావేశాల సందర్భంగా హైద్రాబాద్ లో పెద్ద బహిరంగసభను ఏర్పాటుచేశారు . ఇందులో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటారు . దీంతో 10 లక్షల మందిని ఈ సభకు సమీకరించాలని లక్ష్యం తో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన బీజేపీ ముఖ్యనేతలను పరిశీలకులుగా పంపారు . వారు వివిధ ప్రాంతాలలో పర్యటించి మోడీ సభకు రావాలని పిలుపు నిస్తున్నారు . పెద్ద ఎత్తున వాహనాలు , ట్రైన్స్ కూడా ఏర్పాటు చేశారు . దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు . రేపు జరగబోయే ఎన్నికలకు ఒకరకంగా శంఖారావం పూరించేందుకు బీజేపీ సిద్ధమౌతోంది. దీంతో హైద్రాబాద్ నగరం వైపు దేశం చూపు పడింది….రాజకీయ కేంద్రంగా హైద్రాబాద్ మారింది.

 

Related posts

ఆదిత్యనాథ్‌ పుట్టినరోజుకు మోదీ ట్విటర్‌లో శుభాకాంక్షలు చెప్పక పోవడంపై చర్చ…

Drukpadam

పెట్రోల్ రేట్లపై ప్రశ్నిస్తే రాందేవ్ బాబా కు కోపం వచ్చింది….

Drukpadam

పార్లమెంట్ లో ప్రతిపక్షాల రచ్చ …ప్రధాని ఆగ్రహం…

Drukpadam

Leave a Comment