Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

షర్మిల స్పీచ్ స్క్రిప్ట్ కేసీఆర్ రాసి ఇచ్చిందా …?

షర్మిల స్పీచ్ స్క్రిప్ట్ కేసీఆర్ రాసి ఇచ్చిందా …?
-బీజేపీ ఆరోపణల్లో నిజమెంత
-శషభిషలు లేని ప్రసంగం
-జెండాను పోలిన చీర
వైయస్ షర్మిల ఎట్టకేలకు ఖమ్మం లో అనేక నిబంధనల మధ్య సంకల్ప సభ నిర్వించారు.అది మంచి సక్సెస్ అయింది. ఆమె ప్రసంగంలో ఎక్కడ తడబాటు లేదు.ముక్కుసూటిగా శషభిషలు లేకుండా చెప్పదల్చుకున్న విషయాలన్నీ సూటిగా చెప్పింది. ఆమె చీర కూడా పెట్టబోయే పార్టీ జెండాను పోలివుందా అనే అభిప్రాయాలు ఉన్నాయి. ఆమె కట్టుకున్న చీర లైట్ యెల్లో ,బ్లూ బోర్డర్ అంచు తో అచ్చం జెండాను పోలి ఉంది. ఇందులో . ఈ సభపై ఆమె చేసిన ప్రసంగంపై వివిధ రాజకీయపార్టీలు స్పందిస్తున్నాయి. స్పందించాలి కూడ . బీజేపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే ఎం ఇ ఎస్ ఎస్ ప్రభాకర్ స్పందించారు.షర్మిల స్పీచ్ అంత కేసీఆర్ స్క్రిప్ట్ అనే ఆరోపించారు. సత్తుపల్లి శాసనసభ్యులు ఇటీవలే అధికారికంగా టీఆర్ యస్ లో చేరిన సండ్ర వెంకట వీరయ్య, కాంగ్రెస్ కు చెందిన వి.హనుమంతరావులు కూడ స్పందించారు. ఆయన తన పార్టీని ప్రభుత్వాన్ని తిట్టమని స్క్రిప్ట్ రాసి ఇస్తారా ? బీజేపీ నేత బండి సంజయ్ అనేక సందర్భాలలో ఘాటైన పదజాలంతో కేసీఆర్ పై విమర్శలు గుప్పించినా వ్యక్తిగత విమర్శలకే పరిమితమైయ్యారు. షర్మిల స్పీచ్ కేసీఆర్ రాసి ఇచ్చారా ? ఇందులో నిజముందా అని పరిశీలిస్తే ఆమె ప్రసంగం మొత్తంలో రెండు సార్లు మాత్రమే బీజేపీ ప్రస్తావన ఉంది . అందులో కూడా కేసీఆర్ పాలనపై ప్రతిపక్షాలు స్పందించడంలేదని బీజేపీ ,కాంగ్రెస్ లు తమ అవసరాలకోసం రాజీధోరణి అవలంభిస్తున్నాయని విమర్శలు చేశారు. పరస్పర సహకారం పార్టీల మధ్య ఉన్నందునే ప్రజల సమస్యలపై ప్రశ్నించే గొంతు లేదని అందుకే పార్టీ పెడుతున్నట్లు వెల్లడించారు. బీజేపీ విభజన సందర్భంగా ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ఆరోపించారు. ఖాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ,బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ , గిరిజన యూనివర్సిటీ , నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు లాంటివి రాష్ట్రానికి కేంద్రం నుంచి రాలేదు కదా ? బీజేపీ చేసిన వాగ్దానాలను మరిచి పోతుందా ? కావాలని విస్మరిస్తుందా అనేది షర్మిలకు మాత్రమే కాదు అందరిలో ఉన్న సందేహం . మతతత్వాన్ని రెచ్చగొట్టి లబ్ది పొందాలని ఆ పార్టీ చూస్తుందని ఆరోపించారు. ఈ విషయాలను ఇప్పుడే కొత్తగా షర్మిల ప్రస్తావించలేదు . అనేక సందర్భాలలో వివిధ పార్టీలు ప్రత్యేకించి టీఆర్ యస్ చేస్తున్న విమర్శలు . ఆమె ప్రసంగం మొత్తం టీఆర్ యస్ , కేసీఆర్ టార్గట్ గానే సాగింది. ఆమె అంశాలవారీగా కేసీఆర్ విధానాలపై విమర్శలు గుప్పించారు. ఆమె ఉపన్యాసంలో అధికభాగం అధికార పార్టీ చుట్టే తిరిగింది. కేసీఆర్ ఒడ్డు చేరినదాకా ఓడ మల్లయ్య ,ఒడ్డు చేరినాక బోడ మల్లయ్య అంటాడని తీవ్రమైన విమర్శలు చేసింది. తెలంగాణ ఆత్మగౌరవం దొరగారి కాలు చెప్పుకింద నలిగి పోతుందని ఆవేదన వ్యక్తం చేసింది. నీళ్లు, నిధులు ,నియామకాలు , కేసీఆర్ ఫామిలీ కే దక్కాయని ధ్వజమెత్తింది . తాను ఎవరు వదిలిన బాణాన్ని కాదని ప్రజా బాణాన్ని తేల్చి చెప్పింది. టీఆర్ యస్ నాయకులూ కూడా షర్మిల ప్రసంగం పై అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. కాంగ్రస్ కూడా మండి పడుతుంది. అందువల్ల అన్ని పార్టీల విమర్శలతో షర్మిల తాను ఎంచుకున్న బాటలో సక్సెస్ అయినట్లే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Related posts

అండమాన్‌లో చేతులు కలిపిన టీడీపీ, కాంగ్రెస్…

Drukpadam

సినీ నటులకు కలిసిరాని ఎన్నికలు …ఉదయనిధి మినహా అందరూ ఓటమి!

Drukpadam

రాజీవ్ గాంధీ చిత్రపటంతో సోనియాకు వీడ్కోలు పలికిన మల్లికార్జున ఖర్గే!

Drukpadam

Leave a Comment