జనసేనకు మాదాసు గంగాధరం గుడ్ బై -తెలుగుదేశం కు అనుకూలంగా పవన్ నిర్ణయాలు
- రాజకీయాలు, సినిమా వేరు వేరు
- వాటి మధ్య తేడా తెలియని పవన్ తో పనిచేయలేను
- ప్రజలు ఆశించినట్టు జనసేన పని చేయడం లేదని ఆరోపణ
జనసేన పార్టీ నేత, మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాధరం, పార్టీలో సీనియర్లకు గౌరవం దక్కడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన ఓ లేఖ రాశారు. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు తెలుగుదేశంకు అనుకూలంగా ఉన్నాయని ప్రచారం జరుగుతున్నా, ఆయన వాటిని ఖండించడం లేదని అన్నారు. దీంతో ఆయన మౌనం నిజాన్ని అంగీకరించినట్టుగా భావిస్తున్నారని అన్నారు.
తాను పోటీ చేసిన గాజువాక నియోజకవర్గంలో ఉన్న స్టీల్ ప్లాంట్ ఓటర్లకు పవన్ అండగా నిలవలేదని, సినిమాలు, రాజకీయాలు వేరని, వాటి మధ్య తేడా తెలియని వారితో తాను పని చేయలేనని అన్నారు. ప్రజలు ఆశించినట్టుగా జనసేన పని చేయడం లేదని ఆరోపించారు. కాగా, గంగాధరం, జనసేన పార్టీలో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ కన్వీనర్ గా పని చేసి, ప్రస్తుతం ఎలక్షన్ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ గా ఉన్నారన్న సంగతి తెలిసిందే.