Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

చిరంజీవిని ఊసరవెల్లితో పోల్చిన సిపిఐ నారాయణ …ఘాటుగా స్పందించిన నాగబాబు!

చిరంజీవిని ఊసరవెల్లితో పోల్చిన సిపిఐ నారాయణ …ఘాటుగా స్పందించిన నాగబాబు!
-ఈ సీపీఐ నారాయణ చాలాకాలంగా అన్నం తినడం మానేసి గడ్డి, చెత్తా చెదారం తింటున్నాడు
-చిరంజీవి, పవన్ కల్యాణ్ లపై నారాయణ విమర్శలు
-చిరంజీవిని ఊసరవెల్లితో పోల్చిన భగ్గుభగ్గు మన్న నాగబాబు
-పవన్ ఓ మందుపాతర అంటూ వ్యాఖ్యలు
-తీవ్రంగా స్పందించిన నాగబాబు

చిరంజీని ఊసరవెల్లి అని ,పవన్ కల్యాను ఓ డైనమైట్ అంటూ సిపిఐ సీనియర్ నేత ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శలు చేయడంపై చిరంజీవి బ్రదర్ కొణిదెల నాగబాబు తీవ్రంగా స్పందించారు . నారాయణ పై ఘాటైన పదాలతో విమర్శలు గుప్పించారు . అసలు చిరంజీవిని ఊసరవెల్లి అనడంపై కూడా నారాయణపై విమర్శలు వస్తున్నాయి. అల్లూరి విగ్రహావిష్కరణకు ప్రధాని మోడీ పాల్గొన్న సభకు సూపర్ స్టార్ కృష్ణ ను ఆహ్వానించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు . వెవారిని పిలవలనేది చెప్పటానికి నారాయణ ఎవరనే విమర్శలు కూడా ఉన్నాయి.

తన సోదరులు చిరంజీవి, పవన్ కల్యాణ్ లపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీపీఐ నారాయణపై మెగాబ్రదర్ నాగబాబు ధ్వజమెత్తారు. ఇటీవల కాలంలో కొంతమంది చేసిన తెలివి తక్కువ వెర్రి వ్యాఖ్యలపై మెగా అభిమానులు, జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని వెల్లడించారు.

“కానీ మన కుర్రాళ్లకు నేను చెప్పదలచుకున్నది ఏంటంటే… ఈ సీపీఐ నారాయణ అనే వ్యక్తి చాలాకాలం నుంచి అన్నం తినడం మానేసి కేవలం ఎండుగడ్డి, చెత్తా చెదారం తింటున్నాడు. కాబట్టి మన మెగా అభిమానులందరికీ నా హృదయపూర్వక విన్నపం ఏంటంటే… దయచేసి వెళ్లి అతనితో గడ్డి తినడం మాన్పించి కాస్త అన్నం పెట్టండి. తద్వారా అతను మళ్లీ తెలివి తెచ్చుకుని మనిషిలా ప్రవర్తిస్తాడు” అంటూ నాగబాటు ట్విట్టర్ లో స్పందించారు.

అంతకుముందు సీపీఐ నారాయణ…. ఇటీవల భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణ సభకు చిరంజీవిని పిలవడాన్ని తప్పుబట్టారు. సూపర్ స్టార్ కృష్ణ వంటి వ్యక్తిని పిలవకుండా ఊసరవెల్లిలాంటి చిరంజీవిని వేదిక మీదకు పిలవడం ఏంటని ప్రశ్నించారు. అటు, పవన్ కల్యాణ్ పైనా నారాయణ విమర్శలు చేశారు. పవన్ కల్యాణ్ ఓ మందుపాతర లాంటివాడని, ఎప్పుడేం చేస్తాడో, ఎలా ప్రవర్తిస్తాడో తెలియదని వ్యాఖ్యానించారు.

Related posts

పాకిస్థాన్​ ఆర్మీ అదుపులో తాలిబన్​ అధిపతి.. భారత్​ కు నిఘా వర్గాల సమాచారం!

Drukpadam

జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి!

Drukpadam

అసెంబ్లీలో సీఆర్డీయే రద్దు ఉపసంహరణ బిల్లును ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి బుగ్గన!

Drukpadam

Leave a Comment